బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి బ్రిటన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అనుమతులను ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం షేక్ హసీనా బ్రిటన్‌కు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశ హోంశాఖ కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘ఇతర దేశాల చెందిన వ్యక్తులు బిట్రన్‌లో ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అనుమతించవు. కానీ, అత్యవసరమైన సమయంలో ఆశ్రయం కావాలనుకునేవారికి గతంలో భారీగా కల్పించిన రికార్డు బ్రిటన్ సొంతం. అంతర్జాతీయ రక్షణ అవసరం కావాలనుకునేవారికి.. వారు చేరుకునే దేశం సురక్షితమైనదై ఉండాలి. అప్పుడే వారు సురక్షితమైన భద్రతను పొందగలరు’ అని పేర్కొంది. బ్రిటన్ హోంమంత్రి శాఖ ఈ ప్రకటన చేసినప్పటికీ షేక్ హాసీనా అధికారిక ఆశ్రయానికి సంబంధించిన అభ్యర్థనపై అనుమతి ప్రక్రియ కొనసాగుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. షేక్ హసీనా అసలు భారత్‌ను వదిలి బ్రిటన్‌కు వెళ్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.
మరోవైపు.. గత నెలలో బ్రిటన్‌లో లేబర్ అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఆశ్రయం కోరే వ్యక్తులకు బ్రిటన్ మొదటి సరక్షితమైన దేశమని ఎన్నికల సమయంలో ప్రకటించటం గమనార్హం. మరోవైపు.. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది’అని విదేశాంగ శాఖ మంత్రి జైశంక పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment