
Omicron Variant Confirmed in 12 Countries: కొన్ని రోజులు క్రితం దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వైరస్ అప్పుడే పలు దేశాల్లో విరుచకుపడటానికి సన్నహాలు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్‌తో ప్రపంచదేశాలన్ని అతలాకుతలం అయ్యిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటికి దడ పుట్టించేలా విరుచకుపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించని కొద్ది రోజుల్లోనే జపాన్, ఐరోపా, యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా సుమారు 12 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన తొలి కేసులు నమోదైనట్టు ధృవీకరించడం గమనార్హం. తాజాగా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులలో కొత్త కోవిడ్ -19 వేరియంట్ తొలి కేసులను గుర్తించినట్లు ధృవీకరించింది.
(చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..)
అయితే ఈ కరోనా మహమ్మారీ కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాలైన అమెరికా, భారత్, చైనాలో ఇంతవరకు కొత్త వేరియంట్‌కి సంబంధించిన కేసులు నమోదు కాలేదు. ఈ మేరకు భారత్ కొత్త వేరియంట్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా ఆంక్షలు కఠినతరం చేయడమే కాకా ముందుగానే పలు టెస్ట్‌లు నిర్వహించి హోం క్యారంటైన్‌లో ఉంటే గానీ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్‌లోని ఒక సీనియయర్ వైద్యుడు ఈ ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే దేశంలోకి వచ్చే ఉండవచ్చని, ఇది డెల్లా వేరియంట్ కంటే వేగంతగా వ్యాప్తి చెందే అటువ్యాధి అని అన్నారు. పైగా ఇది చాలా ప్రాణాంతకమైనదని వ్యాక్సిన్‌లు ఎంతవరకు రక్షణగా ఉంటాయి అనే అంశంపై పరిశోధనలను వేగవంతం చేయాలని చెప్పారు.
అంతేకాదు డెల్టా వేరియంట్ వల్ల కలిగే నష్టాన్ని అరికట్టలేని ప్రస్తుత వైద్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్న భారత్‌కి ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని వైద్యుల ఈ ఒమిక్రాన్ ప్రమాదకరమైన వైరస్ కావచ్చు కానీ డెల్టా కంటే తేలికపాటి లక్షణాలను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకోని వారిపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో అనే అంశం పై నిపుణులు కచ్చితమైన అవగాహనకు రావడానికి నాలుగు వారాలు పట్టవచ్చని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ యాక్టింగ్ హెడ్ అడ్రియన్ ప్యూరెన్ అన్నారు. ఏదీఏమైన డబ్ల్యూహెచ్‌ఓకి గతేడాది అల్పా వేరియంట్‌ని ప్రమాదకరమైన వేరియంట్‌గా గుర్తించడానికి కొద్ది నెలల సమయం పట్టింది. కానీ ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ని కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించడం గమనార్హం.
(చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..!!)
Comments
Please login to add a commentAdd a comment