Omicron Symptoms In Telugu: These 3 Are Signs That You Must Need To Know - Sakshi
Sakshi News home page

Omicron Variant Symptoms In Telugu: కొత్తవేరియంట్‌ లక్షణాలు పూర్తిగా భిన్నమైనవి!

Published Sat, Dec 4 2021 9:02 PM | Last Updated on Mon, Dec 6 2021 6:43 PM

Symptoms Of Omicron Variant These 3 Are Signs That You Must Need To Know - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా చాపకింద నీరులా కోరలుచాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. దీనికి సంబంధించి నాలుగో కేసు వెలుగులోకి రావడంతో భారత్‌లో తీవ్ర కలకలం రేగింది. కరోనా చివరి వేవ్‌లో డెల్టా వేరియంట్ సోకిన తర్వాత శ్వాస తీసుకోవడంలో సమస్యలు, అధిక జ్వరం, బలహీనత, ఆహారం రుచి, సువాసన తెలియకపోవడం వంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఐతే ఒమిక్రాన్ విషయంలో ఈ లక్షణాలు చాలా భిన్నంగా ఉన్నాయి.

ఒమిక్రాన్ వేరియంట్ మూడు ప్రధాన లక్షణాలివే..
ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లలో ఒమిక్రాన్ అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధిగా చెప్పబడుతోంది. ఇప్పటివరకు కనుగొనబడిన రోగులందరిలో కరోనాలో కనిపించే సాధారణ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఫ్లూ లాంటి సమస్యలూ బయటపడలేదు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఏం చెబుతున్నారంటే.. ఓమిక్రాన్ మూడు ప్రధాన లక్షణాలు ఇవి...
►తలనొప్పి 
►తీవ్రమైన అలసట
►ఒళ్లు నొప్పులు 
ఒమిక్రాన్ సోకినవారిలో అధికంగా జ్వరం రావటం, రుచి, సువాసనలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదు.

చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..!

ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..
►కరోనాను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 
►ఏవైనా లక్షణాలను బయటపడితే వెంటనే తనిఖీ చేయించుకుని, ఒంటరిగా ఉండండి. 
►ఈ విధంగా మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. 
►మాస్క్‌ను సరైన విధానంలో ధరించాలి.
►సామాజిక దూరాన్ని పాటించాలి.
►ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
►ఇప్పటివరకు రెండు డోస్‌ల టీకాలను తీసుకోకపోతే.. వీలైనంత త్వరగా తీసుకోండి.

చదవండి: Lucknow: విమానం టైరును ఎత్తుకెళ్లిన దుండగులు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement