head aches
-
ఆకస్మిక మైకం.. తరచు తలనొప్పా?
ఈ రెండూ లోబీపీకి ప్రధాన సూచన కావొచ్చు. తక్కువ ఆక్సిజన్ స్థాయి కారణంగా ఒక్కోసారి అపస్మారక స్థితి ఏర్పడవచ్చు. మెడ మీద గట్టిగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఆగీ ఆగీ నొప్పి కూడా రావొచ్చు. అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులోని మరో లక్షణం ఏమిటంటే, శరీరం ఒక్కసారిగా చెమటలు పట్టడం, శరీరంలో వేడి జ్వరంలా పెరిగిపోవడం, అలసిపోయినట్లుగా కుప్పకూలిపోవడం సంభవిస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వల్ల అలసట కనిపిస్తుంది. ఆహారం జీర్ణం కాక వికారంగా అనిపిస్తుంది. వాంతులు, వికారం, విపరీతమైన అలసట వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లోబీపీ ఉంటే మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది. లోబీపీ ఉంటే ఏం చేయాలి లోబీపీ అకస్మాత్తుగా జరగదు. శరీరంలో ఏ సమస్య వచ్చినా బీపీ తగ్గుతుంది. ఇది డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. రక్తస్రావం అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేము. శరీరంలోని ఏ భాగంలో అయినా మార్పులు సంభవిస్తే రక్తప్రసరణలో తేడా వచ్చి బీపీ పడిపోతుంది. మితిమీరిన ఆలోచనలు, ఒత్తిడితో కూడిన జీవితం బీపీలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మధుమేహం వల్ల కూడా ఇది జరగవచ్చు. అలాంటప్పుడు తగిన చికిత్సను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి. (చదవండి: మాంసం తినే బ్యాక్టీరియా!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!) -
సతమతం చేసే సైనసైటిస్ నుంచి ఇలా ఉపశమనం పొందండి..
Sinusitis Home Remedies: ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అని లేకుండా చాలా మందిని పీడించే సమస్య సైనసైటిస్. తరచూ ముక్కులు మూసుకుపోతూ శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం సైనసైటిస్ లో కనిపించే సమస్యల్లో ప్రధానమైనది. చికిత్స తీసుకున్నా తరచు తిరగబెట్టే ఈ సమస్యకు నివారణ మార్గాలు తెలుసుకుందాం. వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా వచ్చే సైనస్ వ్యాధి వల్ల ముక్కుతోపాటు గొంతు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. తలనొప్పి కూడా వస్తుంది. కొన్ని రోజులపాటు పట్టి పీడించే ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు చిన్న చిన్న చిట్కాలు ఎంతగానో దోహదపడతాయి. ఉల్లి, వెల్లుల్లి రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది. మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి. 250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగుసార్లు తీసుకోవాలి. 300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒకసారి తాగాలి. దీర్ఘకాలంగా ఉండే సైనసైటిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.. అయితే కారం టీ సైనస్ నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. ఓ కప్పు మరిగించిన నీళ్లలో అర టీస్పూను కారం, రెండు టీస్పూన్ల తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి గోరువెచ్చగా రోజుకి రెండుసార్లు తాగితే సైనస్ నుంచి ఉపశమనం కలుగుతుందట. -
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేదు.. చివరగా
బెంగుళూరు: మూఢనమ్మకం ఓ మహిళ ప్రాణాలు తీసింది. అల్లోపతి వైద్యంతో ఫలితం లేదని భూత వైద్యుడిని సంప్రదిస్తే ఆ అభాగ్యురాలి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కూతురు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడరహళ్లికి చెందిన పార్వతి (37) గత రెండు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చెకప్‌లు కూడా చేయించుకుంది. అయితే, ఆమెకు అంతా బాగానే ఉందని, ఎటువంటి సమస్యలు లేవని వైద్యులు చెప్పారు. కానీ, పార్వతి తలనొప్పి మాత్రం తగ్గలేదు. చివరగా బంధువుల సూచన మేరకు డిసెంబర్ 2న ఆమెను కుటుంబ సభ్యులు మను అనే భూత వైద్యునికి వద్దకు తీసుకెళ్లారు. బెక్క గ్రామంలో నివసించే మను ఓ నిమ్మకాయ ఇచ్చి కొద్ది రోజుల తర్వాత రమ్మన్నాడు. (చదవండి: గతంలో కోవిడ్.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి) అతను చెప్పిన ప్రకారం డిసెంబర్ 7న బాధితురాలిని అక్కడకు మరోసారి తీసుకెళ్లారు. తలనొప్పిని తగ్గిస్తానని చెప్పి మను పార్వతి తలపై, ఒంటిపై కర్రతో విపరీతంగా బాదాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను చెన్నరాయపట్నంలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: West Bengal: ఆహా ఏమి అదృష్టం! ఉదయం కొన్నాడు.. సాయంత్రానికి జాక్‌పాట్ కొట్టాడు!!) -
ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే..
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నెమ్మదిగా చాపకింద నీరులా కోరలుచాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. దీనికి సంబంధించి నాలుగో కేసు వెలుగులోకి రావడంతో భారత్‌లో తీవ్ర కలకలం రేగింది. కరోనా చివరి వేవ్‌లో డెల్టా వేరియంట్ సోకిన తర్వాత శ్వాస తీసుకోవడంలో సమస్యలు, అధిక జ్వరం, బలహీనత, ఆహారం రుచి, సువాసన తెలియకపోవడం వంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఐతే ఒమిక్రాన్ విషయంలో ఈ లక్షణాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ మూడు ప్రధాన లక్షణాలివే.. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లలో ఒమిక్రాన్ అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధిగా చెప్పబడుతోంది. ఇప్పటివరకు కనుగొనబడిన రోగులందరిలో కరోనాలో కనిపించే సాధారణ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఫ్లూ లాంటి సమస్యలూ బయటపడలేదు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఏం చెబుతున్నారంటే.. ఓమిక్రాన్ మూడు ప్రధాన లక్షణాలు ఇవి... ►తలనొప్పి ►తీవ్రమైన అలసట ►ఒళ్లు నొప్పులు ఒమిక్రాన్ సోకినవారిలో అధికంగా జ్వరం రావటం, రుచి, సువాసనలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదు. చదవండి: వింత నమ్మకం.. ఐదేళ్ల కొడుకును గొడ్డలితో 7 ముక్కలుగా నరికి..! ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి.. ►కరోనాను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ►ఏవైనా లక్షణాలను బయటపడితే వెంటనే తనిఖీ చేయించుకుని, ఒంటరిగా ఉండండి. ►ఈ విధంగా మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. ►మాస్క్‌ను సరైన విధానంలో ధరించాలి. ►సామాజిక దూరాన్ని పాటించాలి. ►ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ►ఇప్పటివరకు రెండు డోస్‌ల టీకాలను తీసుకోకపోతే.. వీలైనంత త్వరగా తీసుకోండి. చదవండి: Lucknow: విమానం టైరును ఎత్తుకెళ్లిన దుండగులు! -
ఇదో వింత వ్యాధి
వాషింగ్టన్ : నిద్రలో కలలు రావటం.. కలవరపాటుకు గురికావటం సహజం. కానీ, మామూలుగా తన యాసలో మాట్లాడే ఓ వ్యక్తి నిద్రలేచాక అకస్మాత్తుగా ‘పొరుగు’భాషలో మాట్లాడితే ఎలా ఉంటుంది. అరిజోనాకు చెందిన మిచెల్లె మైర్స్(45) పరిస్థితి అలాగే ఉంది. ఫారిన్ అస్సెంట్ సిండ్రోమ్ తో ఆమె బాధపడుతోంది. ఒక్కోసారి ఆమెకు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అప్పుడు ఆమె నిద్రలోకి జారుకుంటుంది. ఆపై మెలుకువ వచ్చేసరికి అసలు వ్యవహారం మొదలవుతుంది. స్వతహాగా అమెరికన్ అయిన ఆమె వేరే వేరే భాషల్లో మాట్లాడుతుంది. అసంకల్పితంగా ఆమె నోటి నుంచి పర భాష పదాలు దొర్లుతుంటాయి. గతంలో ఆస్ట్రేలియన్, ఐరిష్ భాషలు ఆమె మాట్లాడారు. అయితే అది రెండు వారాలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఓ రోజు నుంచి ఆమె బ్రిటీష్ భాష మొదలుపెట్టి రెండేళ్లు మాట్లాడారు. దీనికి గల కారణాలను పరిశోధకులు వివరిస్తున్నారు. ‘మనిషి మెదడులో భాషలను గుర్తించే ఓ కేంద్ర విభాగం(బేసల్ గ్యాంగ్లియాన్) ఉంటుంది. దానికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు.. లేదా షాక్ తగిలినప్పుడు పదాల ఉచ్ఛరణ అన్నది వారికి తెలీకుండానే మారిపోతుంది. అలా వారి ప్రమేయం లేకుండానే వేరే భాషలు మాట్లాడుతుంటారు. కానీ, అది తాము సాధారణంగా మాట్లాడే భాషే అని వారనుకుంటారు. ఆ ప్రభావం కొన్ని గంటలు ఉండొచ్చు.. లేదా ఏళ్ల తరబడి ఉండొచ్చు. దీనినే ఫారిన్ అస్సెంట్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తుంటార’ని షెలియా బ్లూమ్ స్టెయిన్ అనే భాషావేత్త వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి కేసులు వెలుగు చూశాయి. 2010లో వర్జీనియాకు చెందిన ఓ మహిళ కూడా ఇదే తరహా సమస్యతో బాధపడినట్లు ది వాషింగ్టన్ పోస్టు తన కథనంలో వివరించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇలాంటివి 60 కేసులు నమోదు అయినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. -
వరికి వెన్నుపోటు
సాక్షి,విశాఖపట్నం: రుతుపవనాలు గతి తప్పడంతో జిల్లా రైతులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. పంటల సాగు సమయంలో ముఖం చాటేస్తున్న వర్షాలు అనంతరం అనూహ్యంగా వచ్చిపడే తుపాన్లు, వాయుగుండాలప్పుడు ముమ్మరిస్తున్నాయి. కొన్ని మండలాల్లో అధికం నమోదవుతుండగా,కొన్నింట సాధారణంలో సగం కూడా కురవడం లేదు. ఇవి గణాంక విభాగానికి, ఇటు వ్యవసాయాధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలో వర్షపాతం బాగానే ఉన్నప్పటికీ పంటలెందుకు తగ్గుతున్నాయనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడంలేదు. ఈపాటికే అంతటా నాట్లు పూర్తయి పంట పొట్టదశదాటి కంకులు బయటకు రావాలి. ఆ పరిస్థితి లేదు. మొత్తంగా రైతుకు నష్టమే వాటిల్లుతోంది. ఖరీఫ్‌కు సిద్ధమయ్యే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 142.8 మిల్లీమీటర్లకు 49.4 మిల్లీమీటర్లే కురిసింది. అత్యంత కీలకమైన కాలం(జూన్-సెప్టెంబర్)లో 646.7 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, కేవలం 353.4 మిల్లీమీటర్లు నమోదయింది. ఖరీఫ్ ముగియడానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 98,718 హెక్టార్లు. ఆరంభంలో వర్షాలు నెమ్మదించడంతో అధిక శాతం మండలాల్లో అసలు ఉభాలే జరగలేదు. ఇంతవరకూ 53వేల హెక్టార్లలో నాట్లేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సగానికిపైగా హెక్టార్లలో పంట ఎండిపోయే దుస్థితి నెలకొంది. ఇలా జిల్లాలో వరిసాగు సంక్షోంభంలో చిక్కుకుంది. ఈపాటికే ఏపుగా పెరిగి కళకళలాడాల్సిన పైరు పలు ప్రాంతాల్లో ఎర్రబారింది. చుక్కనీరు లేక మైదానంలోని సగం మండలాల్లో అసలు ఎరువాకే మొదలవలేదు. ఈసారైనా కరుణించేనా? ఈ ఏడాది వాతావరణం అనుకూలించి వరిసాగు సుమారు లక్ష హెక్టార్లకు చేరుకుంటుందని వ్యవసాయశాఖ అంచనాకట్టింది. ఇందుకోసం 22,040 క్వింటాళ్ల విత్తనాలు, 76,849 మెట్రిక్ టన్నుల ఎరువులు సైతం రప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ పరిస్థితి దయనీయంగా మారింది. క్యుములోనింబస్ మేఘాల జాడలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు,వాయుగుండాలు ఏర్పడకపోవడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అల్పపీడనద్రోణి,ఆవర్తనాలు వల్ల కొన్ని చోట్ల వర్షాలు అప్పుడప్పుడూ పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వరిసాగు జాగయింది. అనకాపల్లి, నర్సీపట్నం,ఎలమంచిలి,చోడవరం,పాయకరావుపేట,మాడుగుల తదితర నియోజకవర్గాల్లో నీటి సదుపాయం లేక ఇప్పటికీ నాట్లు ప్రారంభంకాలేదు. సుమారు 25వేల హెక్టార్లలో ముదిరిన నారుతో వేసిన నాట్లు ఎండిపోయాయి. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం పరిధిలో పరిస్థితి దయనీయంగా ఉంది. 3,500 హెక్టార్లకు రెండు వేల హెక్టార్లలో అసలు నాట్లేపడలేదు. మిగిలిన 1500 హెక్టార్లలోని పంట ఎండిపోతోంది. బుచ్చెయ్యపేట,చోడవరం,రావికమతం,రోలుగుంట మండలాల్లో ఇంకా ఐదు వేల హెకార్లలో నాట్లు వేయాల్సి ఉంది. ఎలమంచిలి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఎలమంచిలి,రాంబిల్లి అచ్యుతాపురం,మునగపాక మండలాల్లో 9 వేల హెక్టార్లలో నాట్లు ఇంకా మొదలు కాలేదు. అనకాపల్లిగ్రామీణ ప్రాంతంలో ఏటా ఖరీఫ్‌లో 2,400హెక్టార్లలో వరిపంట చేపడుతుంటారు. ఇప్పటివరకు 600 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. ఇందులోనూ 200 హెక్టార్లలో పంట ఎండిపోవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు అధిక వర్షాలు పడినా ఫలితం ఉండదంటున్నారు. ఐదేళ్లలో వర్షపాతం వివరాలు నెల సాధారణం 2009 2010 2011 2012 2013 జూన్ 128.8 54.0 131.4 23.8 44.4 87.0 జూలై 197.7 104.8 268.8 134.4 168.6 111.4 ఆగస్టు 193.0 101.6 94.8 144.2 183.6 155.0