ఈ రెండూ లోబీపీకి ప్రధాన సూచన కావొచ్చు. తక్కువ ఆక్సిజన్ స్థాయి కారణంగా ఒక్కోసారి అపస్మారక స్థితి ఏర్పడవచ్చు. మెడ మీద గట్టిగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఆగీ ఆగీ నొప్పి కూడా రావొచ్చు. అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులోని మరో లక్షణం ఏమిటంటే, శరీరం ఒక్కసారిగా చెమటలు పట్టడం, శరీరంలో వేడి జ్వరంలా పెరిగిపోవడం, అలసిపోయినట్లుగా కుప్పకూలిపోవడం సంభవిస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వల్ల అలసట కనిపిస్తుంది. ఆహారం జీర్ణం కాక వికారంగా అనిపిస్తుంది. వాంతులు, వికారం, విపరీతమైన అలసట వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లోబీపీ ఉంటే మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది.
లోబీపీ ఉంటే ఏం చేయాలి
లోబీపీ అకస్మాత్తుగా జరగదు. శరీరంలో ఏ సమస్య వచ్చినా బీపీ తగ్గుతుంది. ఇది డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. రక్తస్రావం అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేము. శరీరంలోని ఏ భాగంలో అయినా మార్పులు సంభవిస్తే రక్తప్రసరణలో తేడా వచ్చి బీపీ పడిపోతుంది. మితిమీరిన ఆలోచనలు, ఒత్తిడితో కూడిన జీవితం బీపీలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మధుమేహం వల్ల కూడా ఇది జరగవచ్చు. అలాంటప్పుడు తగిన చికిత్సను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి.
(చదవండి: మాంసం తినే బ్యాక్టీరియా!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!)
Comments
Please login to add a commentAdd a comment