
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పుణెలో కొత్తగా మరో 7 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులును వైద్యులు గుర్తించారు. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 12కు చేరింది.
ఆదివారం టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన 37వ్యక్తి కోవిడ్ కొత్త వేరియంట్ సోకింది. లోక్‌నాయక్ జై ప్రకాష్ ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కో కేసు బయటపడగా.. కర్ణాటకలో రెండు కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment