పటాన్‌చెరు: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం | TS Patancheru And Khammam Gurukula Students Test Covid | Sakshi
Sakshi News home page

పటాన్‌చెరు: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

Published Thu, Dec 2 2021 7:29 PM | Last Updated on Fri, Dec 3 2021 4:33 PM

TS Patancheru And Khammam Gurukula Students Test Covid - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే ముత్తంగి గురుకుల పాఠశాలలో 48 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పటాన్‌చెరు, ఖమ్మం వైరా గురుకులు పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి.
(చదవండి: ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్‌డే రద్దు.. కారణమిదే!)

పటాన్‌చెరు-ఇంద్రేశం గురుకుల పాఠశాలలో 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఖమ్మం వైరా గురుకుల పాఠశాలలో 27 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ తగిన నిర్ణయం తీసుకోవాలిని కోరుతున్నారు.
(చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్‌.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!)

తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించకుండా తిరిగితే.. రూ. 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

చదవండి: నా ఎదుగుదల సర్వేల్‌ గురుకులం భిక్షే  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement