wyra
-
వైరాలో వార్.. కారు స్పీడ్‌కు కాంగ్రెస్ బ్రేక్ వేస్తుందా?
వైరా నియోజకవర్గంలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏవరు గెలుస్తారన్నది పక్కన పెడితే.. రెండు పార్టీలలో గ్రూప్ వార్ చర్చానీయంశంగా మారుతుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఈసారి టికెట్ దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ వరించింది. దీంతో పైకి మదన్ లాల్ గెలుపుకోసం పనిచేస్తానని రాములు నాయక్ చెబుతున్నా లోలోపల చేయాల్సిందంతా చేస్తున్నారట. అటు కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఏకంగా అర డజన్ మంది టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వైరా ఎన్నికల సమరంలో కారు దూసుకు పోతుందా? కాంగ్రెస్ తన సత్తా చాటుతుందా.? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు. పాలనా సౌలభ్యం కోసం రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏకైక నియోజకవర్గం వైరా. కొనిజర్ల, వైరా, ఏన్కూర్, జూలూరుపాడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ జనాభా 1,97,360 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గం హట్సీట్గా మారునుందనే చెప్పాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరడంతో టికెట్ వచ్చిన వారికి.. రాని వారు సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకాకుండా మాజీ ఎమ్మెల్యేకు టికెట్ రావడంతో ఎమ్మెల్యేవర్గం ఏమాత్రం మద్దతు ఇచ్చే పరిస్థితి కనబడటంలేదు. అటు కాంగ్రెస్‌లో సైతం అదే పరిస్థితి. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైరా కాంగ్రెస్‌లో పెద్ద రచ్చనే చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు అరడజన్ పైనే ఉండటం ఇందుకు కారణం. వైరా నియోజకవర్గం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా లావుడియా రాముల నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రధానంగా ఎమ్మెల్యే తరుచూ అనేక సమావేశాల్లో నోరు జారీ చిక్కులు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే ఆయన నోరు జారీన స్పీచ్‌లు నేషనల్ మీడియా వరకు వెళ్లాయంటేనే స్పీచ్‌లు ఏస్థాయిలో డ్యామేజ్ చేశాయో అర్థమవుతుంది. అంతేకాదు ఇండిపెండెంట్‌గా జనం ఆదరించిన ఎమ్మెల్యేరాములు నాయక్ అభివృద్ధి చేసింది ఏమీ చేయలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే, ఆయన కోడుకు జీవన్ లాల్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల లిస్ట్ చాంతడంతా ఉందన్నది లోకల్‌గా ప్రచారం నడుస్తూ వస్తుంది. రాములు నాయక్‌కు టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే అన్న ప్రచారం ఉంది. మొత్తం ఈక్వేషన్స్ పరిగణంలోకి తీసుకొని బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేరాములు నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు టికెట్ కేటాయించింది. బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన పథకాలు తనను గెలిపిస్తాయని బానోత్ మదన్ లాల్ ధీమాతో ఉన్నారు. ప్రధానంగా పోడు భూములకు పట్టాల పంపిణీ, దళితులకు దళిత బంధువు పది లక్షలు ,రైతులకు లక్ష రూపాయాల రుణ మాఫీ బీసీలకు లక్ష రుపాయల ఆర్థిక సహయం ఓట్లు కురిపిస్తాయని మదన్ లాల్ ఆశిస్తున్నారు. మదన్ లాల్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లంబడా సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈసారి సానుభూతితో గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. మదన్ లాల్ మా బావ ఆయనకి టికెట్ కేసీఆర్ ఇచ్చాడు.. కేసిఆర్ నా దేవుడు ఆయన టికెట్ ఇచ్చారు కాబట్టే ఆయన గెలిపించుకునేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే రాములు నాయక్. దళిత బంధు విషయంలో మంత్రి పువ్వాడ అజయ్, మదన్ లాల్ కలిసి మదన్ లాల్ వర్గానికి చెందిన 600 మందికి అధికారులు దళితబంధు ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యేగా తనకు తెలియకుండనే ఇదంతా జరిగిందని రాములు నాయక్ ఇటివలే చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారమే లేపాయి. అంతేకాదు మంత్రి అజయ్‌పై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. ఇవి కూడా పార్టీలో హట్ టాపిక్‌గా మారాయి. ఆ తర్వాత పార్టీ అధిష్టానం రాములు నాయక్‌ను బుజ్జగించడంతో ప్రస్తుతం కొంత సైలెంట్‌గా ఉన్నారు. మళ్లీ బాంబ్ పేలుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. పైకి రాముల నాయక్ మదన్ లాల్ మా బావ.. కేసీఆర్ చెప్పిండు కాబట్టి ఓట్లేపిస్తానని పైకి రాములు నాయక్ చెబుతున్న.. రాములు నాయక్ వర్గం మాత్రం మదన్ లాల్‌కు సపోర్ట్ చేసేదే లేదని చెప్పుకొస్తుంది. సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాలోత్ రాందాస్ నాయక్ ,బాలాజీ నాయక్, బానోత్ రామ్మూర్తి నాయక్, విజయిబాయి.. బీజేపీ నుంచి మోహన్ నాయక్, డీబీ నాయక్, కృష్ణ రాథోడ్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. వైరా నియోజకర్గంలో లంబాడి ఓట్లు ఎక్కువ. లంబాడి ఓట్లు ఎవరికి ఎక్కువ వేస్తే వాళ్ళు గెలుపొందే అవకాశాలు ఉంటాయి. లంబాడి ఓట్ల తర్వాత బీసీ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటమిలపై వీరి ప్రభావం ఏక్కువగా ఉంటుంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వైరా నియెజకర్గంలో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పొరపాటుగా అకౌంట్లో రూ.2 కోట్లు.. వ్యక్తి ఏం చేశాడంటే..
సాక్షి, వైరా(ఖమ్మం) : ఓ వ్యక్తి ఖాతాలో పొరపాటుగా రూ.2 కోట్ల నగదు జమ కాగా.. తిరిగి జమ చేసిన కంపెనీకి అప్పగించిన వైనమిది. వివరాలిలా ఉన్నాయి. వైరాకు చెందిన గంధం వెంకటేశ్వర్లు ఖాతాలో ఈనెల 11న రూ.2 కోట్లు జమ అయినట్లు సెల్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన ఏటీఎం సెంటర్‌కు వెళ్లి చూడగా ఖాతాలో రూ.2కోట్లు జమ అయి ఉన్నాయి. కాగా, వెంకటేశ్వర్లు వైరా తహసీల్ ఎదుట నిర్మించిన భవనంలో సాబూ ఆటో జోన్ కంపెనీ(అశోక్ లేలాండ్ కంపెనీ) డీలర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశాడు. నెలనెలా సదరు డీలర్ వెంకటేశ్వర్లుకు ఇంటి అద్దెను బ్యాంకు అకౌంట్లో జమ చేసేవాడు. ఈక్రమంలోనే పొరపాటున కంపెనీకి చెల్లించాల్సిన రూ.2కోట్లను ఈయన ఖాతాలో జమ చేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కంపెనీ జీఎం శేషాచారి వైరాకు చేరుకోగా.. అప్పటికే వెంకటేశ్వర్లు డీలర్‌తో చర్చిస్తున్నాడు. దీంతో మంగళవారం ఖమ్మంలోని రోటరీనగర్ ఎస్బీఐ శాఖ ద్వారా ప్రతి నిధులకు రూ.2కోట్ల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును కంపెనీ ప్రతినిధులు, బ్యాంకు అధికారులు అభినందించారు. -
పటాన్చెరు: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. ఇటీవలే ముత్తంగి గురుకుల పాఠశాలలో 48 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పటాన్చెరు, ఖమ్మం వైరా గురుకులు పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. (చదవండి: ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్డే రద్దు.. కారణమిదే!) పటాన్చెరు-ఇంద్రేశం గురుకుల పాఠశాలలో 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఖమ్మం వైరా గురుకుల పాఠశాలలో 27 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యాశాఖ తగిన నిర్ణయం తీసుకోవాలిని కోరుతున్నారు. (చదవండి: తరుముకొస్తున్న ఒమిక్రాన్.. టీకా రక్షిస్తుందా.. లేదా..?!) తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరిగితే.. రూ. 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: నా ఎదుగుదల సర్వేల్ గురుకులం భిక్షే -
TSRTC గరుడ బస్సు లో మంటలు
-
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై చీటింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ బానోత్ కొడుకు మృగేందర్‌లాల్ బానోత్ (30)పై చీటింగ్ కేసు నమోదయింది. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, అత్యాచారం చేశాడని ఓ యువతి మృగేందర్‌లాల్‌పై గత నెల 27వ తేదీన కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మృగేందర్‌లాల్‌తో పాటు మాజీ ఎమ్యెల్యే మదన్‌లాల్ బానోత్‌పై కేసులు నమోదయ్యాయి. యువతి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2019లో ఐపీఎస్‌కు ఎంపికైన మృగేందర్ శివరాంపల్లిలోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందే సమయంలో కూకట్‌పల్లికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రతి రోజూ ఆమెతో చాటింగ్ చేసేవాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. గతేడాది డిసెంబర్ 25న పథకం ప్రకారం యువతిని తన రూమ్‌కు తీసుకెళ్లి బలవంతం చేయబోయాడు. కానీ, ఆమె ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గాడు. కొద్దిరోజుల అనంతరం తన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తానని, అకాడమీకి రావాలని చెప్పడంతో ఆ యువతి నమ్మి వెళ్లింది. అక్కడ తన కోరికను తీర్చకపోతే వివాహం చేసుకోనని బ్లాక్మెయిల్ చేయడంతో వేరే మార్గం లేక ఆ యువతి అంగీకరించింది. ఇక ఆ తరువాత ముఖం చాటేసిన మృగేందర్ పలుమార్లు ఆ యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చినా రకరకాల కారణాలతో వాయిదా వేస్తూ వచ్చాడు. గతేడాది ఆగస్టులో మృగేందర్‌లాల్ ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎస్‌కు రాజీనామా చేసి ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో చేరాడు. అక్కడ మృగేందర్‌కు మరొక అమ్మాయితో (ఐఏఎస్ బ్యాచ్‌మేట్) దగ్గరి సంబంధం ఉందని ఆ యువతి నిలదీయడంతో మృగేందర్ తండ్రి మదన్‌లాల్ బానోత్ యువతికి రూ.25 లక్షల నగదు ఇస్తానని ఆశ చూపించాడు. యువతి ఒప్పుకోకపోవడంతో చంపేస్తామని ఆమె కుటుంబ సభ్యుల ముందే బెదిరించాడు. ఈ ఏడాది జూలై 31వ తేదీన మృగేందర్ యువతి ఇంటికి వచ్చి బలవంతంగా ఆమె సెల్‌ఫోన్ ధ్వంసం చేసినట్లుగా యువతి ఆరోపిస్తోంది. దీంతో ఆమె న్యాయం చేయాలని కోరుతూ కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కేసు వివరాలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ప్రతినిధి సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించగా.. అలాంటి కేసు ఏమీ నమోదు కాలేదని పోలీసులు వెల్లడించడం విశేషం. -
'పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలి'
సాక్షి, ఖమ్మం: వైరా ఎమ్మెల్యే మరోసారి నోరుజారారు. కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని శ్రీసిటీలో ఆదివారం ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆవేశంగా మాట్లాడిన ఆయన పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. దీంతో ఆయన మాట్లాడిన మాటలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరుగుతున్న వరుస మీటింగ్‌లలో ఎమ్మెల్యే అదుపుతప్పి మాట్లాడుతూ వివాదాస్పదంగా నిలుస్తున్నారు. చదవండి: (పెళ్లయిన నెలకే.. భార్య గొంతు కోసి దారుణహత్య) -
ఎమ్మెల్యే స్వగ్రామంలో క‘న్నీటి’ కష్టాలు..
జూలూరుపాడు: వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ స్వగ్రామం ఉమ్మడి ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనుకతండా గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కారు. నీళ్ల కోసం ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసన తెలిపారు. భోజ్యాతండా గ్రామ పంచాయతీ వెనకతండా గ్రామంలో రెండు వారాలుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. రెండు వారాల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, ఈ విషయాన్ని సర్పంచ్, ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. సమస్యను వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌కు వివరించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. గ్రామంలో చేతి పంపులు కూడా పని చేయడంలేదని, బిందె నీళ్ల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమని సర్వేల్లో తేలింది) చదవండి: మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల -
వైరా మున్సిపాలిటీలో ఏడాదికి ముగ్గురు కమిషనర్లు బదిలీ
-
‘ఆపదలో ఇచ్చిన సొమ్ము, ఇవ్వనంటే ఎలాగా..’
సాక్షి,ఖమ్మం: వైరాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మంగళవారం హై డ్రామా నెలకొంది. అప్పుగా తీసుకున్న మొత్తం చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ భానోతు సరోజిని అనే మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... తన తండ్రి చావుబతుకుల్లో ఉన్నాడని చెప్పి భుక్యా బాలాజీ అనే వ్యక్తి సరోజిని దగ్గర రెండేళ్ల క్రితం రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ బాలాజీ అప్పు చెల్లించలేదు. నెల క్రితం నిలదీయగా.. ఇంటిని అమ్మేసి అప్పు తీరుస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే ఇంటిని అమ్మేశాడు. కానీ, సరోజిని వద్ద తీసుకున్న డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు. నేడు బాలాజీ అమ్మిన ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉండటంతో తన తల్లితో కలిసి సరోజిని వైరాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుంది. ఆపదలో ఇచ్చిన సొమ్ము, ఇవ్వనంటే ఎలాగా.. తనకు న్యాయం జరగడం లేదని చెప్తూ ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడున్నవారు ఆమెకు అడ్డుపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, పోలీసులకు ఇదివరకే ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని సరోజిని ఆవేదన వ్యక్తం చేసింది. వడ్డీ అవసరం లేదని, రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టిన అసలు ఇచ్చినా చాలునని వాపోయింది. -
ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య
సాక్షి, వైరా: ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ నేత నేలవెల్లి రామారావు దారుణ హత్యకు గురయ్యారు. బీజేపీ ఆర్టీఐ సెల్ కన్వీనర్ రామరావు నివాసానికి శనివారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్స్ ధరించి బైక్‌పై వచ్చారు. ఇంట్లోకి చోరబడి అయిదు నిమిషాల వ్యవధిలోనే ఆయనపై కత్తులతో అతి దారుణంగా దాడి చేశారు. ఇంట్లో ఉన్న రామరావు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దాడి చేసిన వెంటనే నిందితులు బైక్‌పై పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రామరావును కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే రామరావు హత్యకు ఆర్థిక లావాదేవిలే కారణంగా తెలుస్తుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రామరావు మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ కోనసాగుతుంది. అటు జిల్లా బీజేపీ నేతలు సైతం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు రామరావు హత్య వెనుక రాజకీయ కోణం కూడ ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు మాడపాటి రాజేశ్ మధిర కోర్టులో లొంగిపోయాడు. ప్రధాన నిందితుడు రాజేశ్ (ఫైల్ ఫోటో) -
వావ్.. వజీర్..
సాక్షి. వైరా రూరల్: యూట్యూబ్ అతడికి మార్గదర్శిగా నిలిచింది. అందులో నుంచి బుల్లెట్లను రీమోడలింగ్ చేసే విధానాన్ని నేర్చుకుని.. ఎన్నో పాత బుల్లెట్లను కొత్తగా మార్చాడు. ఈతరం బుల్లెట్ల మాదిరిగానే అవి ఉండటంతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో ఆ వృత్తినే జీవనోపాధిగా మార్చుకుని “బుల్లెట్’లాగా దూసుకుపోతున్నాడు.. వైరాకు చెందిన వజీర్. తాను రీమోడలింగ్ చేసిన బుల్లెట్ల ఫొటోలు యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌లలో పెట్టి విక్రయిస్తున్నాడు. ప్రత్యేకంగా ఫేస్బుక్లో పేజీ రూపొందించి ఫాలోవర్ల సంఖ్యను పెంచుకున్నాడు. యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసి ఎందరో సబ్స్క్రైబర్లను సాధించాడు. 1994 అంతకంటే ముందు వచ్చిన డీజిల్ బుల్లెట్ వాహనాలకు రీమోడలింగ్ చేసి భవిష్యత్‌లో స్థిరపడాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఇంత వరకు అతను ఎక్కడా షాపు పెట్టలేదు. చదవండి: రాష్ట్రంలో విరివిగా కరోనా పరీక్షలు ఇలా మొదలైంది.. బుల్లెట్ వాహనాలకు రీమోడలింగ్ చేసే షేక్ వజీర్ ఏడేళ్ల కిందట టోరస్ 1995 మోడల్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. దానిని కొన్ని రోజులు నడిపిన తర్వాత ఆ బైక్ రిపేర్‌కు వచ్చింది. దానికి మరమ్మతులు చేయించేందుకు చాలా షాపులు తిరిగాడు. కానీ ఏళ్ల కిందట బుల్లెట్ కావడంతో రిపేర్ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 1994 కంటే ముందు మోడల్ డీజిల్ బుల్లెట్లకు అప్పటి మెకానిక్‌లు ఆర్డీఓ అప్రూవల్తో పెట్రోల్ వాహనాలుగా మాత్రమే కన్వర్షన్ చేసేవారు తప్ప రిపేర్ మాత్రం చేసే వారు కాదు. ఇలాంటి బైక్‌లను మరమ్మతు చేయడం నేర్చుకుంటే జీవితంలో స్థిరపడవచ్చనే అనే ఆలోచన అప్పుడు అతడికి వచ్చింది. యూట్యూబ్ ద్వారా గుంటూరులో మాత్రమే ఇంజిన్ రిపేర్ చేసే వారు ఉంటారని తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్లి ఇంజిన్ రీపేర్ చేయడం, అమర్చడం నేర్చుకున్నాడు. యూట్యూబ్ ద్వారా వాహనంలోని వివిధ భాగాలు వీడదీయడం, వాటిని అమర్చడం నేర్చుకున్నాడు. తాను కొనుగోలు చేసిన బుల్లెట్‌పై ప్రయోగం చేసి సత్ఫలితం సాధించాడు. షాపు పెట్టుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో యూట్యూబ్‌లో చానల్ రూపొందించాడు. తాను రీమోడలింగ్ చేసే ప్రతి వావాహనాన్ని అందులో ఆప్‌లోడ్ చేసి ప్రపంచమంతా వీక్షించే విధంగా దానిని రూపకల్పన చేశాడు. కుంగిపోకుండా.. వజీర్ ఎంబీఏ చేసి ఏదైనా ఉద్యోగంలో స్థిరపడాలని కోరిక. డిగ్రీలో కొన్ని సబ్జెక్టులు తప్పడంతో తన తండ్రి సైదులుకు ఉన్న చికెన్ షాపులో పని చేసుకుంటూ.. చదువుకునే వాడు. ఈ క్రమంలో తన తండ్రి మత్స్యకారుడు కూడా కావడంతో సుమారు ఆరేళ్ల కిందట చేపల వేటకు వెళ్లి ఈదురు గాలులకు రిజర్వాయర్‌లో గల్లంతై మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం మొత్తం ఇతడిపై పడడంతో చదువును మధ్యలోనే ఆపేశాడు. తండ్రి మృతి తర్వాత చికెన్ షాపులో కూడా వ్యాపారం తగ్గడంతో.. అతడికి తెలిసిన చికెన్ షాపులో పనిచేస్తూ.. అన్ని తానై తన చెల్లి వివాహం చేశాడు. ప్రస్తుతం కొణిజర్లలో చికెన్ షాపు పార్ట్‌టైంగా నిర్వహిస్తూ.. ఇంట్లో బుల్లెట్ రీమోడలింగ్ చేస్తున్నాడు. ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే.. డీజిల్ బుల్లెట్లు 1996 తర్వాత పూర్తిస్థాయిలో బ్యాన్ అయ్యా యి. కానీ, వాటి క్రేజ్ మాత్రం తగ్గలేదు. కారణం ఈ ద్విచక్రవాహనం లీటర్ డీజిల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ ఇస్తాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ఓఎల్‌ఎక్స్‌ల ద్వారా నాటి బుల్లెట్లు ఎక్కడ దొరకుతాయో.. తెలుసుకొని అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు ఉంటే.. వాటిని కొనుగోలు చేస్తాడు. అనంతరం దాని భాగాలు మొత్తం పూర్తి స్థాయిలో వీడదీసి, దానికి కావా ల్సిన స్పేర్ భాగాలను కొని మొత్తం ఫిట్టింగ్ అంతా పూర్తి చేస్తాడు. నూతన సీట్లు కావాలంటే వాటిని సైతం తయారు చేస్తాడు. పెయింటింగ్, రాయల్ ఎన్ఫీల్డ్ అనే స్టిక్కర్ కూడా వేస్తాడు. మొత్తం రీమోడలింగ్ అయిన తర్వాత తన సోషల్ మీడియా ద్వారా విక్రయానికి సిద్ధం చేస్తాడు. ఇలా ఇప్పటికే ఎన్నో బుల్లెట్లను రీమోడలింగ్, రీస్టోర్ చేశాడు. -
రెండు రోజుల్లో 51 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, ఖమ్మం: మండలంలో ప్రజలను కరోనా వణికిస్తోంతి. శని, ఆదివారాలు రెండు రోజులలోనే మండలంలోని వివిధ గ్రామాలలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనిని బట్టి కోవిడ్–19 ఎంత వేగంగా విస్తరిస్తున్నదో అర్థం అవుతుంది. శనివారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలలో కొణిజర్ల పీహెచ్సీ పరిధిలో 16, పెద్దగోపతి పీహెచ్సీ పరిధిలో అయిదు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, కొణిజర్లలో శనివారం మొత్తం 35 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా 16 మందికి కోవిడ్ సోకినట్లు వైద్యాధికారి డాక్టర్ మోత్యా తెలిపారు. ఇందులో కొణిజర్లలో 7 కేసులు, శాంతినగర్ బీసీ కాలనీలో 3, రామనరసయ్యనగర్లో 3, మల్లుపల్లి, సింగరాయపాలెం, క్రాంతినగర్‌లో ఒక్కో కేసు నమోదు అయినట్లు తెలిపారు. పెద్దగోపతి పీహెచ్సీ పరిధిలోని 43 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 5 గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. అమ్మపాలెం, తనికెళ్ల, బస్వాపురం, రెడ్డిగూడెంలో ఒక్కొక్కరికీ, ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఆదివారం కొణిజర్ల పీహెచ్సీలో 16 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 7 గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కొణిజర్లలో 6, మల్లుపల్లిలో 1 పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.. ఐదు పాజిటివ్ కేసులు వైరా: మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు నిత్యం పెరుగుతునే ఉన్నాయి. వైరా పీహెచ్సీ పరిధిలోని సోమవారం 13 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అందులో ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. మున్సిపాలిటీలోని హనుమాన్ బజార్లో 2, ఫిషన్కాలనీ, మెయిన్ రోడ్డుతో పాటు దాచాపురంలో ఒక్కో కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కారేపల్లి మండలంలో.. కారేపల్లి: కారేపల్లి మండలంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కారేపల్లి పీహెచ్సీలో శనివారం 21 మందికి కరోనా పరీక్షలు చేయగా, 10 మందికి కరోనా పాజిటివ్ నమోదు అయ్యాయని, ఆదివారం 40 మంది పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు వైద్యాధికారి హన్మంతరావు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు కారేపల్లి మండలంలో 63 కరోనా కేసులు నమోదైనట్లయ్యింది. శనివారం రోజు మండలంలో గుంపెళ్లగూడెంలో ఒకటి, తొడితలగూడెంలో రెండు, బొక్కలతండాలో ఒకటి, కారేపల్లిలో రెండు, భాగ్యనగర్ తండాలో ఒకటి, పేరుపల్లిలో ఒకటి, కొత్త కమలాపురంలో ఒకటి, బాజుమల్లాయిగూడెంలో ఒక కేసు నమోదు కాగా, ఆదివారం కారేపల్లిలో 3, కొత్త కమలాపురంలో ఒకటి, బాజుమల్లాయిగూడెంలో నాలుగు, గాంధీనగర్‌లో ఒకటి, సూర్యతండాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. -
రైతులను బ్లాక్మెయిల్ చేస్తారా?
సాక్షి, వైరా: కరోనా కష్టకాలంలో తెలంగాణ రైతాంగాన్ని తరుగు పేరుతో మిల్లర్లు, సొసైటీలు వేధిస్తున్నాయని.. ఇది ఎంతమాత్రం ఆయోదయోగ్యం కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన ఆయన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైరా సొసైటీకి సంబంధించి కాంటా వేసి, బస్తాలు వరంగల్ మిల్లుకు పంపితే.. ఆరేడు రోజులుగా వాటిని దించకుండా క్వింటాలకు ఏడెనిమిది కిలోలు తరుగు తీయాలని రైతులను పిలిపించారు. అలాగే మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండంలోని సఖినవీడు కొనుగోలు కేంద్రంనుంచి కొసుగోలు చేసిన ధాన్యాన్ని పెద్దపల్లి మిల్లుకు పంపారు. అక్కడా ఒక లోడుకు 14 క్వింటాల తరుగు తీస్తామని రైతులతో అన్నారని భట్టి విక్రమార్క చెప్పారు. ఇది ముమ్మాటికి రైతులను భయభ్రాంతులను చేయడమేనని సీఎల్పీ నేత అన్నారు. ఈ పరిణామాలు ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. (సాయం అంతలోనే మాయం!) సాధారణంగా ఒక్కసారి కాంటా వేసిన తరువాత ఆ ధాన్యంతోనూ, బస్తాలతో రైతులకు సంబంధం ఉండదని భట్టి చెప్పారు. కేవలం ఆ సొసైటీ లేదా కాంటా వేసే ఆర్గనైజేషన్ దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రవాణా నుంచి లేదా మిల్లర్లకు అందించే వరకూ.. ధాన్యం తరుగుతోనూ ఇక వారిదే బాధ్యత తప్ప రైతులకు ఉండదని భట్టి స్పష్టం చేశారు. చాలాగ్రామాల్లో కాంటా వేసి, రవాణ జరిగి, మిల్లర్లకు చేరిన తరువాత కూడా తరుగు తీస్తున్నారని రైతులను నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని భట్టి చెప్పారు. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బందినుంచి మొత్తం యంత్రాంగం వరకూ స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయాలని అన్నారు. (తెలంగాణ: రాగల మూడు రోజులు వర్ష సూచన) -
మహిళకు కుడి వైపున గుండె
ఖమ్మం, వైరా: సాధారణంగా గుండె ఎడమ చేతి వైపు ఛాతి భాగంలో ఉంటుంది. కానీ.. వైరాలోని ఓ మహిళ కు కుడి వైపున గుండె ఉంది. వైరా సంత బజార్‌కు చెందిన బాసాటి ఆనంద్, ఉష దంపతులకు పెళ్లయి ఐదేళ్లయింది. పిల్లలు కలగకపోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మంగళవారం పరీక్షల నిమిత్తం వెళ్లారు. అక్కడ ఆమెకు స్కానింగ్ చేసిన సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఎడమ వైపున ఉండాల్సిన గుండె కుడి వైపున ఉన్నట్లు గుర్తించారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. -
వైరా ‘పుర’ రాజకీయం
సాక్షి, వైరా: మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుండటంతో వార్డుల రిజర్వేషన్లు, అభ్యర్థుల గుర్తింపు, వార్డుల వారీగా బాధ్యతలు తదితర అంశాలపై ఆయా పార్టీల నాయకులు కసరత్తు ప్రారంభించారు. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఎలాగైనా గెలవాలనే తపన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఏం చేద్దాం.. ఎలా చేద్దాం, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళదాం? వార్డుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రిజర్వేషన్లను బట్టి అభ్యర్థులు ఎవరు? ఈ అంశాలపై పార్టీలు జోరుగా చర్చలు సాగిస్తున్నాయి. ఆయా పార్టీల నేతల ఇళ్ల ముందుకు కార్యకర్తలు, ఆశావాహుల హడావుడి ఎక్కువైంది. వైరా మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. వైరా మున్సిపాలిటీ 20 వార్డుల్లో 23,226 మంది ఓటర్లు ఉన్నారు. వైరా గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా ఉండటంతో అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2013లో సర్పంచ్‌గా గెలుపొందారు. ఆ తరువాత రాష్ట్రం విడిపోవటం, 2018లో వైరా మున్సిపాలిటీగా రూపుదిద్దుకోవడంతో రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. తొలిసారి జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలకు బలాబలాలు.. మొట్టమొదటిసారి జరిగే మున్సిపల్ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ ఆరునెలలుగా కసరత్తు చేస్తూనే ఉంది. మండలస్థాయి నేతలకు స్థానిక ఎమ్మెల్యే లావూడ్యా రాములునాయక్ ఎప్పటికప్పుడు సూచనలిస్తూ సమాయత్తం చేశారు. ఇప్పటికే వైరా నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. గత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి.. స్వతంత్ర అభ్యర్థి అయిన లావూడ్యా రాములునాయక్ గెలుపొందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, అదే స్వతంత్ర అభ్యర్థి తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీఆర్ఎస్ పార్టీ మళ్లీ బలం పుంజుకుంది. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవానే కొనసాగింది. ప్రతి పక్ష పార్టీ నుంచి అదేస్థాయిలో వలసలు కూడా పెరగడంతో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ రానున్న మున్సిపాలిటీలో ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. మున్సిపాలిటీలో విలీనమైన కొణిజర్ల మండలంలోని పల్లిపాడు, దిద్దుపుడి, లాలాపురం గ్రామాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆశించినస్థాయిలో బలం లేకపోయినప్పటికీ అక్కడి నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలంతా టీఆర్ఎస్లో చేరటంతో అక్కడ కూడా పార్టీకి బలం చేకూరింది. మండలంలోని సోమవరం, గండగలపాడు, బ్రాహ్మణపల్లి ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ బలపడింది. ప్రతి పక్ష పార్టీల పరిస్థితి ఇలా.. 2013లో మేజర్ గ్రామం పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో వార్డు సభ్యులు గెలుపొందలేదు. ఉన్న రెండు మూడు వార్డుల వారు కూడా టీఆర్ఎస్లో చేరారు. అయినప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఎం) కూడా సత్తా చాటేందుకు కసరత్తు ప్రారంభించాయి. గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులు, స్థానికులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులను పోటీకి దించితే గెలిచే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీలకు కూడా ఓటు బ్యాంక్ ఉందని, ప్రస్తుతం టీఆర్ఎస్పై వ్యతిరేకత ఉందని, దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటామని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులు చెబుతున్నారు. విలీన గ్రామాల్లో పరిస్థితి.. 2013లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా టీడీపీ అభ్యర్థి గెలుపొందగా, ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్లో చేరారు. సీపీఎం ఆ గ్రామంలో బలంగా ఉంది. వార్డు కౌన్సిలర్ ఎన్నికలో ప్రభావం చూపనుంది. పల్లిపాడు సర్పంచ్ కూడా టీడీపీ నుంచి గెలుపొందినప్పటికీ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అక్కడి నాయకులంతా అధికార టీఆర్ఎస్లో చేరారు. దిద్దుపూడి గ్రామ సర్పంచ్‌గా సీపీఐ నుంచి గెలుపొందారు. అక్కడి నాయకత్వం అంతా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే, దిద్దుపూడి గ్రామంలో గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా పురపాలక ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడిక్కిందని చెప్పవచ్చు. -
అడ్మిన్లూ.. జర జాగ్రత్త..!
సాక్షి, వైరా: సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా వివాదాస్పద పోస్టులు చేస్తామంటే ఇకచెల్లదు. నా గ్రూపుల్లో నేను ఏ సమాచారం షేర్ చేస్తే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించకతప్పదు. అత్యుత్సాహంతో పోస్టులు పెట్టి, అవాకులు చెవాకులు పేలే వారికి శిక్ష తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూపులు అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లోకసభ ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్నీ పార్టీలకు చెందిన ఆశావాహులు టికెట్లు వచ్చేలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ట్రెండ్‌లో సోషల్ మీడియా కీలకంగా మారింది. ఆశావాహులు సామాజిక మాధ్యమాల ద్వారానే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల వేళ అభ్యర్థుల హామీలు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులపై చేసే విమర్శలు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల సందడి కనిపిస్తుంది. అభ్యర్థులు, పార్టీలు ఇలాంటి పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ పోస్టులు పెట్టిన గ్రూప్ అడ్మిన్‌పై చట్టప్రకారం కేసులు నమోదవుతాయి. ఎన్నికల వేళ ప్రత్యేకంగా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సందేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదులు వస్తే కేసులు పెడతామని అధికారులంటున్నారు. అధికారుల ప్రత్యేక దృష్టి సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అ«ధికారుల సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించారు. అశ్లీల సమాచారం. ఫొటో మార్ఫింగ్ తప్పుడు సమాచారం, ఇతరులు మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేసేవారు. జైలు శిక్ష, జరిమానా అనుభవించాల్సి ఉంటుంది. అదే నేరానికి రెండోసారి పాల్పడితే పదేళ్లు జైలు, రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలుంటాయి. పోస్టులు పెట్టే అడ్మిన్లతో పాటు వాటిని షేర్ చేసేవారిని కూడా బాధ్యులను చేసే అవకాశం ఉంటుంది. అడ్మిన్లే బాధ్యులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూపులకు సంబంధించిన అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోకపోవడమే ఉత్తమం. వివాదాస్పదపోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారనే విషయాన్ని అడ్మిన్లతోపాటు గ్రూపూలలోని సభ్యులూ తెలుసుకుని మసలుకోవాలి. విద్వేషాలు రెచ్చ గొట్టే విషయాలు, తప్పుడు, తెలియని సమాచారం, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, ఓ వర్గాన్ని బాధించే ఏ విషయాన్ని పోస్టు చేయకపోడమే మంచిది. అడ్మిన్లు జాగ్రత్త వహించాలి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియాలో ఇబ్బందికర పోస్టులు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇతర వ్యక్తులను, పార్టీలను ఇబ్బందులకు గురిచేసేలా ఎటువంటి పోస్టులు చేయకూడదు. అలా పోస్ట్ చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు కూడా ఉంటాయి. –ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, వైరా -
పంచాయతీకి చేరిన పెళ్లి..!
సాక్షి, వైరా: గ్రామాల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు త్వరితగతిన అందే అవకాశం ఉంటుంది. గ్రామ కార్యదర్శులకు వివాహం రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి నుంచే అమల్లోకి.. కాగా ఈ విధానం నేటి నుంచి అమలులోకి రానుంది. పంచాయతీ కార్యదర్శులతో పాటు మండలంలోని ఈఓపీఆర్డీలు ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. పెళ్లి రిజిష్ట్రేషన్‌కు నామమాత్రపు రుసుము చెల్లించాలి. రెండు నెలల గడువు దాటితే రూ.100 చెల్లించి గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై గడువుదాటితే రిజిష్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థికసాయం పొందేందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పని సరి. పంచాయతీల్లో నమోదు చేసుకోవాలి గ్రామాల్లో జరుగుతున్న వివాహాలను ఇక నుంచి తప్పని సరిగా గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలి. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథక ఫలాలను త్వరిత గతిన పొందే అవకాశం ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం -
స్మార్ట్ ఫోన్లో పబ్జీ భూతం..ఆడితే ఇక అంతే..
సాక్షొ, వైరారూరల్: ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్లలో కొన్ని రకాల ఆటలకు యువకులు బాకా ఆకర్షితులవుతూ..సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అర్ధరాత్రుళ్ల వరకూ ఫోన్లలో ఆటలాడేలా ప్రేరేపిస్తున్న గేముల్లో పబ్జి అనేది ముఖ్యంగా కనిపిస్తోంది. ఈ ఆట ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా ఆడుతున్నారు. ఒక్కరు, ఇద్దరు లేదా నలుగురు కలిసి ఒకేసారి ఆన్లైన్లో ఆడవచ్చు. ముగ్గురు కలిసి కూడా ఆడొచ్చుకానీ..అధికశాతం నలుగురు మిత్రులు వేర్వేరు ప్రాంతాల నుంచి ఒక టీం మాదిరి ఏర్పడి ఆన్లైన్లో ఈ ఆటను ఆడుతున్నారు. గేమ్‌లో ఒక ఐలాండ్ ఉంటుంది. అందులో విమానం నుంచి 100 మంది వారికి నచ్చిన ప్రదేశాల్లో దిగుతారు. ఇందులో నలుగురు మిత్రులు ఉంటారు. వీరికి మిగిలిన 96 మంది శత్రువులవుతారు. ఆ 96 మందిలో సైతం నలుగురితో కూడిన పలు టీంలు ఉంటాయి. వారికి 96 మంది శత్రువులుగా భావిస్తారు. అదే ఒక్కరు ఈ ఆటను ఆడితే.. మిగిలిన 99 మంది.. ఇద్దరు కలిసి ఆడితే మిగిలిన 98 మంది సభ్యులు వారికి శత్రువులు అవుతారు. ఎవరికి వారే బృందాలుగా ఏర్పడి ఐలాండ్‌లోకి దిగిన వెంటనే ఇళ్లలోకి చొరబడి లూటీలు చేస్తారు. ఈ ఆటను ఆడేందుకు కావాల్సిన పలు రకాల తుపాకీలు, స్కోప్స్, కారు, ద్విచక్రవాహనాలు, ఎనర్జీ డ్రింక్స్ వంటివి వారు దోచుకుంటారు. ఈ క్రమంలో దాడి చేసిన వారిపై ప్రతి దాడులు చేసి వారిని హతమారుస్తారు. పలు ప్రదేశాల్లో ఉన్న శత్రువుల వద్దకు కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లి వారిని చంపుతారు. శత్రువులను సిగ్నళ్ల ద్వారా కనిపెడతారు. వెతికే క్రమంలో బ్లూ, వైట్ అనే రెండు సర్కిళ్లు ఉంటాయి. పొరపాటున బ్లూ సర్కిల్‌లోకి ప్రవేశిస్తే..వారు శక్తిని కోల్పోతారు. లేదా చనిపోయే ప్రమాదముంది. వైట్ సర్కిల్ సేఫ్ జోన్. ఆట మొత్తం మీద విమానం మూడుసార్లు ప్రవేశించి పలు రకాల తుపాకులు, స్కోప్స్, బాంబులు, బాణాలు జారవిడుస్తుంది. పబ్జి ఆటకు చాలామంది యువకులు బానిసలుగా మారి..కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిని బహిష్కరించాయి. ప్రత్యర్థులను ఎలా అంతమొందించాలి?, గెలవాలంటే ఎలాంటి తుపాకులను వినియోగించాలి? ఐలాండ్‌లో తిరిగేందుకు ఏ వాహనం ఎంచుకోవాలి? అని తరచూ ఆలోచిస్తూ మానసికంగా దెబ్బతింటున్నారు. ఆటలో ఇతరులను ఇష్టారీతిన చంపేస్తూ హింసాప్రవృత్తి పెంచుకోవడం బాధాకరం. ఈ ఆట ఆడేవారిలో చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. ఈ çపబ్జి భూతంతో అనేకమంది బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. ఇళ్లలో పెద్దలు దృష్టిసారించి..ఇలాంటి గేమ్స్ ఆడకుండా చూడాలని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆడితే హడలే.. బూర్గంపాడు: పబ్జి కార్పొరేషన్, బ్లూహోల్ సంస్థలు సృష్టించిన ఈ పబ్జి ఆటను ఆన్లైన్లో ఆడుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కాల్పులు, విధ్వంసం, హత్యలు వంటి ప్రక్రియలను ఓ గేమ్‌లోని చిన్న అంశంగా తీసిపారేస్తున్నారు. గతంలో ల్యాప్‌టాప్, కంప్యూటర్లకే పరిమితమైన ఈ ఆట ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో హల్చల్ చేస్తోంది. ఆటలో భాగంగా దాడులు, హత్యలు చేయడం వంటివి తొలుత సరదాగా అనిపించినా రానురానూ యువతలో, పిల్లల్లో మానసికంగా రాక్షసత్వాన్ని నింపుతున్నాయి. గంటల తరబడి ఈ గేమ్ నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. చదువులు, ఇతర వ్యాపకాలను పక్కకు పెట్టి కేవలం ఆన్లైన్ గేమ్స్‌కే కొందరు బానిసలుగా మారుతున్నారు. ఈ గేమ్ పిచ్చి బాగా ముదిరిన వారు..వింత చేష్టలతో మానసికంగా దెబ్బతింటున్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించి, పిల్లలు స్మార్ట్ఫోన్లలో విపరీతమైన ఆటలు ఆడకుండా చూసుకోవాలి. నియంత్రించాలి.. ఆన్లైన్ గేమ్స్‌ను నియంత్రించకుంటే పిల్లల భవిష్యత్ ఇబ్బందుల పాలవుతుంది. ఆన్లైన్ గేమ్స్ వలన మానసిక పరిపక్వత మందగిస్తుంది. పిల్లలు ఈ ఆటలకు బానిసలైతే ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు ఎక్కువవుతాయి. దీంతో వాళ్ల భవిష్యత్ పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉంచాలి. – డాక్టర్ శంకర్‌నాయక్, వైద్యనిపుణుడు -
రిజర్వేషన్లపై ఆశలు
వైరా: గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలు కాబోతోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సీట్ల రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో రిజర్వేషన్ల వల్ల ఏ వర్గం లాభపడుతుందోనని ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని చాటేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలు ఉండగా, 5,354 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ పోరుకు సిద్ధమవుతున్న ఆశావహులు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవట్లేదు. పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ..తమకే సీటు వచ్చేలా చూసుకుంటున్నారు. ఈసారి యువత ఎక్కువచోట్ల సీట్ల కోసం ప్రయత్నిస్తోంది. పోటీ చేస్తామని ముందుగానే చెబుతూ..తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఈసారి మరింత ఉత్సాహంగా పోటీకి సిద్ధమవుతున్నారు. గతంలో శివారు గ్రామంగా ఉండి..అవకాశాలు రాలేదని బాధపడిన ఇక్కడి జనం..ఈసారి తమ పాలన తామే చేసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారా ? లేకుంటే గతంలో కేటాయించిన రిజర్వేషన్ల లెక్కనే తీసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. మద్దతుదారులను ఎలాగైనా గెలిపించుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే చాకచక్యంగా పావులు కదపడానికి వ్యూహరచన చేస్తున్నాయి. నేతలు లోలోపల మంతనాలు జరుపుతున్నారు. ఈసారి ఉపసర్పంచ్‌లకూ సర్పంచ్‌లతో పాటు చెక్ పవర్ ఇస్తుడంటంతో చాలామంది ఉప సర్పంచ్ పదవులపై దృష్టి సారిస్తున్నారు. -
వైరా: అభ్యర్థుల లీలలు
ఎక్కడ చూసినా అభ్యర్థుల గెలుపుపైనే చర్చ జరుగుతోంది. ఏ నలుగురు కలిసినా రాజకీయాలే మాట్లాడుకుంటున్నారు. ఓటర్ల ప్రసన్నానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పది ఓట్లు ఎవరి చేతిలో ఉంటాయో వారిని ఆకట్టుకుంటున్నారు. విందులతో హల్ చల్ సృష్టిస్తున్నారు. మేమున్నాం.. ముందుకు పదండని డబ్బులు ఎరవేస్తున్నారు. తాగినంత మద్యం.. జేబు నిండా డబ్బు పెట్టి ఓటర్ల వేటకు పంపుతున్నారు. దీంతో ఒకే ఓటరును వివిధ అభ్యర్థులకు చెందిన అనుచరులు కలుసుకొని మొహమాటం పెడుతున్నారు. కానీ ఓటర్లు మాత్రం అందరితో సరేనని పంపుతున్నారు. ఇదండీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల తంతు.. సాక్షి, వైరా: ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి వారి అవసరాలను ఆసరగా చేసుకుంటున్నారు. తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పింఛన్లతోపాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకాలం తమ అవసరాల కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా పట్టించుకోని వారు.. ఇప్పుడు ఓట్లకోసం నోటికొచ్చిన హామీలను ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఓ పక్క స్వతంత్ర అభ్యర్థి లావూడ్య రాములు నాయక్ ఎన్నికల అధికారులు కేటాయించిన రైతు నాగలి గుర్తును ఆశించిన స్థాయిలో ఓటర్లకు గుర్తుండిపోయేలా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రజాకూటమి అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పాలన కంటే నాలుగురెట్లు అభివృద్ధి చేసి చూపుతానని చెబుతున్నారు. తమ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామంటు సీపీఎం నాయకులు ఓట్లు అడుగుతున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన అంశాలు కానున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నందున ఆయా పార్టీల నాయకులు ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రహస్యంగా గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. కుల సంఘాల నాయకులతో బేరసారాలాడుతున్నట్లు వినికిడి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో డబ్బులు, మద్యం బాటిళ్లు వెదజల్లి ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం. ఇక ఈ శిబిరాల్లో ప్రచారం నిర్వహించే యువకులకు నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. బూత్‌ల వారిగా విభజించి డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గెలుపుపై అభ్యర్థుల ధీమా.. నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్, స్వతంత్ర అభ్యర్థి లావూడ్య రాములు నాయక్, ప్రజాకూటమి అభ్యర్థి విజయాబాయి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ అభ్యర్థుల గెలుపుపై ప్రజల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఎవరికి వారు తమ పార్టీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల వారీగా ఓట్లను లెక్కగడుతున్నారు. నియోజకవర్గంలో 1,76, 820 ఓట్లు ఉన్నాయి. అభివృద్ధి పనులే టీఆర్ఎస్కి పట్టం కడతాయని ఆ పార్టీ నాయకులుండగా, ప్రజల్లో ఉన్న సానుభూతితోపాటు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందంటూ స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ ధైర్యంతో ప్రచారంలో దూసుకెళుతున్నారు. మరోవైపు ప్రజాకూటమి అభ్యర్థి బాణోత్ విజయ ఓటర్లను ఆ«శించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోందనే విమర్శలు ఉన్నప్పటికీ ప్రచారంలో ప్రత్యుర్థులతోపాటు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రచారానికి మరో రెండు రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రతి గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. -
పోలీసులకూ నో ఎంట్రీ
సాక్షి, వైరా: ఎన్నికల విధుల్లో పబ్లిక్ సర్వెంట్ అనే పదానికి సాధారణ అర్థం పోలీసు అధికారి అని కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. యూనిఫాంలో ఉన్నా, లేకపోయినా పోలీసులకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి అనుమతి లేదు. అవసరమైన పక్షంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎన్నికల అధికారి పిలిస్తే తప్ప ఏ ప్రత్యేక కారణం లేకుండా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం నిషేధం. పోటీ చేసే అభ్యర్థికి జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్నప్పటికీ రక్షణ సిబ్బందికి పోలింగ్ బూత్‌లోకి అనుమతి లేదు. అభ్యర్థితో పాటు మఫ్టీలో ఉన్న ఒకే భద్రతా సిబ్బంది మాత్రమే వెళ్లడానికి అనుమతిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేబినెట్, స్టేట్ మంత్రులు, ఉపమంత్రులకు ప్రజల ఖర్చుతో భద్రత ఉంటుంది. వీరికి తమ వెంట వచ్చే భద్రత సిబ్బందికి కూడా ప్రవేశం లేదు. భద్రత సిబ్బంది తలుపు బయట ఆగిపోవాలి. అక్కడ ఎవరికి ఇబ్బంది కల్గించే పని మంత్రి వెంట ఉన్న సిబ్బంది చేయరాదు. పోలింగ్ సిబ్బంది తమపై ఎన్నికల అధికారులు ఆదేశాలను మాత్రమే అనుసరించాలి. రాజకీయ నాయకులు, మంత్రుల మాటలను పట్టించుకోవద్దు. ఎన్నికల కమిషన్ ఆజ్ఞా పత్రం ఉంటే తప్ప పోలింగ్ బూత్‌లోకి రావడానికి వీలులేదు. అక్కడ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించరాదు. మాటలు, సైగలు చేసినా నేరం కిందకే వస్తుంది. -
టీఆర్ఎస్లో అసమ్మతి రాగాలు
సాక్షి, ఖమ్మం : అసెంబ్లీని రద్దు చేసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరలేపడంతో.. ఆ పార్టీలో అసమ్మతి రాగాలు జోరందుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికల కోసం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ 105 నియోజకరవర్గాల అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. అయితే, పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానిక నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఖమ్మ జిల్లా వైరా నియోజకవర్గం పార్టీ టికెట్‌ను తాజా మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మదన్‌లాల్‌కు కేటాయించడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన మదన్‌లాల్‌కు మరోసారి అవకాశం ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు వైరా నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం సమావేశమయ్యారు. మదన్‌లాల్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కార్యకర్తలు.. పార్టీ నాయకులు, శ్రేణులందరినీ కలుపుకొనిపోయే నాయకుడికి టికెట్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మదన్‌లాల్ ఓడిపోతే తమకు సంబంధం లేదని వారు తెగేసి చెప్పారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బయ్యారం మండల కేంద్రం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టిఆర్ఎస్లో చేరారు. -
బిక్కు..బిక్కు
వైరా ఖమ్మంజిల్లా : బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో..వైరాలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ( పాఠశాల, కళాశాల)లో చేరిన విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక, భవనం కూలుతుందేమోనని జంకుతూ, కరెంట్ షాక్ కొడుతున్న గోడలతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇక్కడి పాఠశాల భవనం నిర్మించి 35 ఏళ్లు గడుస్తోంది. ప్రస్తుతం డార్మెటరీ బిల్డింగ్ కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనం పెచ్చులు ఊడిపోయి కురుస్తోంది. మొత్తం 10 గదులున్నాయి. సమావేశ మందిరం, కారిడార్ అంతా కూడా పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారింది. రాత్రివేళల్లో చాలా భయపడుతున్నారు. ఇక్కడి పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 630 మంది విద్యార్థినులు తరగతులకు హాజరవుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల కాలంలో డార్మెటరీ భవనం పెచ్చులు ఊడిపోయి విద్యార్థినుల మీద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కురుస్తున్న వర్షాలకు భవనం నాని..అంతా నీటి చెమ్మగా మారింది. షాక్‌తో సెలవులు.. డార్మెటరీ భవనం వర్షాలకు నాని కురుస్తుండటంతో ఇటీవల ఓ విద్యార్థిని ఫ్యాన్ స్వీచ్ వేయగా ఒక్కసారిగా షాట్ సర్క్యూట్ కావడంతో..అప్రమత్తమైన సిబ్బంది జిల్లా అధికారులకు తెలియజేసి ఈ నెల21నుంచి 27వరకు 5వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థినులకు సెలవులిచ్చి ఇళ్లకు పంపారు. ఇంకా..ఈ సమస్యను పరిష్కరించలేదు. ఇక్కడి విద్యార్థినులు తరగతి గదుల్లోనే ఉంటున్నారు. రాత్రిళ్లు కూడా ఇక్కడే నిద్రిస్తున్నారు. సైన్స్ల్యాబులో కింద కూర్చొని, ఇరుకుగా ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం..రూ.3 కోట్ల నిధులతో చేపట్టిన జీప్లస్ వన్ భవన నిర్మాణం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా..అధికారులు, కాంట్రాక్టర్లల నిర్లక్ష్యం వల్ల ఇంకా..పునాదుల దశనే దాటలేదు. స్లాబ్ కూలుద్దేమో.. డార్మెంటరీ భవనం స్లాబ్ ఎప్పుడు కూలుతుంతోనని భయమేస్తోంది. ప్రమాదకరంగా ఉన్నప్పటీకీ ప్రతిరోజూ అక్కడే నిద్రిస్తున్నాం. రాత్రివేళల్లో కరెంట్ పోతే ఇబ్బందిగా ఉంది. మాకు చాలా భయమేస్తోంది. – టి.ప్రణవి, 8వ తరగతి ఎర్త్ కొడుతోంది.. డార్మెటరీ భవనం కురుస్తోంది. భవనం మొత్తం ఎర్త్కూడా వస్తోంది. అక్కడే నిద్రించాలంటే భయమేస్తోంది. కోతుల బెడద విపరీతంగా ఉంది. మా సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. – జి.ధృవిత, 8వ తరగతి ఇబ్బందికరంగా ఉంది.. పాఠశాలలో స్లాబ్ కురుస్తోంది. ఎప్పుడు కూలుతుందోనని ఇబ్బంది పడుతున్నాం. పాఠశాల ప్రిన్సిపాల్ సమస్యను అధికారులకు తెలియజేశా రు. ఇంకా పరిష్కారం కాలేదు. – ఐ.శిరీష, కేర్‌టేకర్, వైరా సెక్రటరీకి తెలియజేశాం.. పాఠశాలలో డార్మెటరీ భవనం సమస్యగానే ఉంది. రెండునెలల క్రితమే రాష్ట్ర సెక్రటరీకి విన్నవించాం. విద్యార్థినులకు ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాం. కొత్త భవన నిర్మాణం త్వరగా పూర్తయితే ఇబ్బంది ఉండదు. – వి.మేరీ ఏసుపాదం, ప్రిన్సిపాల్, వైరా గురుకుల పాఠశాల -
ఇద్దరిని మింగిన గంగ
వేర్వేరు ప్రమాదాల్లో నీళ్లలో పడి ఒకరు గల్లంతు కాగా.. ఇద్దరు మృతి చెందిన సంఘటనలు ఉమ్మడి జిల్లాల్లో సోమవారం చోటు చేసుకున్నాయి. వైరా రిజర్వాయర్‌లో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతుకాగా.. చింతకాని మండలంలోని రామకృష్ణాపురంలో మరొక మత్స్యకారుడు చెరువులో పడి మృత్యువాత పడ్డాడు. టేకులపల్లి మండలంలోని మొక్కంపాడులో పెదవాగు దాటుతూ దాని ఉధృతికి ఓ రైతు బలయ్యాడు. పెదవాగులో పడి.. టేకులపల్లి : ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటుతూ.. ఓ రైతు కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన సోమవారం మొక్కంపాడులో చోటు చేసుకుంది. బోడు ఎస్సై భూక్య శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో మొక్కంపాడు కు చెందిన ఈసం సమ్మయ్య (50) మేతకు వెళ్లిన పశువులను ఇంటికి తోలుకొచ్చేందుకు అడవి వైపునకు వెళ్లాడు. పశువులు పెద్దవాగు అవతల ఉన్నా యి. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా సమ్మయ్య లెక్క చేయకుండా పశువుల కోసం వాగులో దిగాడు. వాగు ఉధృతి తీవ్రంగా ఉండటంతో కొంత దూరం కొట్టుకుని పోయాడు. గమనించిన స్థానికులు వెళ్లేసరికి.. అప్పటికే ఊపిరాడక సమ్మయ్య మృతి చెందాడు. అతి కష్టం మీద మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చారు. బోడు ఎస్సై భూక్య శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మత్స్యకారుడు గల్లంతు.. వైరా : వైరా రిజర్వాయర్‌లో మత్స్యకారుడు గల్లంతైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. రిజర్వాయర్ అలుగుపోస్తున్న నేపథ్యంలో స్థానిక హనుమాన్ బజార్‌కు చెందిన వేముల నర్సింహారావు (41) అనే మత్స్యకారుడు చేపలవేటకు వెళ్లాడు. అలుగు వద్ద వల విసురుతుండగా.. ప్రమాదవశాత్తు జారి రిజర్వాయర్‌లో పడి నీటి ఉధృతికి కొట్టుకు వెళ్లాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూ కీ లభించలేదు. నర్సింహారావు కోసం గజ ఈతగాళ్లు సైతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడికి గాయాలు.. మత్స్యకారుడు నర్సింహారావు గల్లంతైన విషయం తెలిసుకొని అదే ప్రాంతానికి చెందిన ఇర్లపూడి హరిష్ అలుగు వద్ద నడుచుకుంటూ వెళుతుండ గా.. కాలుజారి అతడి నీటిలో పడ్డాడు. నీటి ఉధృ తికి కొంతదూరం కొట్టుకు వెళ్లాడు. స్నేహితు లు కాపాడి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికి త్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంలో హరిష్‌కు స్వల్పగాయాలయ్యాయి. వలలు ఏర్పాటు చేస్తుండగా.. చింతకాని : మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు బొమ్మకంటి ఆదినారాయణ (52) ప్రమాదవశాత్తు చెరువులో పడి సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు స్థానిక చెరువులోకి భారీగా వరద నీరు చేరి చెరువు అలుగు పడింది. దీంతో చెరువులోని చేపలు వరదకు పోకుండా ఉండేందుకు అలుగు వద్ద వలలను ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆదినారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం