సాక్షి, వైరా: కరోనా కష్టకాలంలో తెలంగాణ రైతాంగాన్ని తరుగు పేరుతో మిల్లర్లు, సొసైటీలు వేధిస్తున్నాయని.. ఇది ఎంతమాత్రం ఆయోదయోగ్యం కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన ఆయన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైరా సొసైటీకి సంబంధించి కాంటా వేసి, బస్తాలు వరంగల్ మిల్లుకు పంపితే.. ఆరేడు రోజులుగా వాటిని దించకుండా క్వింటాలకు ఏడెనిమిది కిలోలు తరుగు తీయాలని రైతులను పిలిపించారు. అలాగే మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండంలోని సఖినవీడు కొనుగోలు కేంద్రంనుంచి కొసుగోలు చేసిన ధాన్యాన్ని పెద్దపల్లి మిల్లుకు పంపారు. అక్కడా ఒక లోడుకు 14 క్వింటాల తరుగు తీస్తామని రైతులతో అన్నారని భట్టి విక్రమార్క చెప్పారు. ఇది ముమ్మాటికి రైతులను భయభ్రాంతులను చేయడమేనని సీఎల్పీ నేత అన్నారు. ఈ పరిణామాలు ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. (సాయం అంతలోనే మాయం!)
సాధారణంగా ఒక్కసారి కాంటా వేసిన తరువాత ఆ ధాన్యంతోనూ, బస్తాలతో రైతులకు సంబంధం ఉండదని భట్టి చెప్పారు. కేవలం ఆ సొసైటీ లేదా కాంటా వేసే ఆర్గనైజేషన్ దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రవాణా నుంచి లేదా మిల్లర్లకు అందించే వరకూ.. ధాన్యం తరుగుతోనూ ఇక వారిదే బాధ్యత తప్ప రైతులకు ఉండదని భట్టి స్పష్టం చేశారు. చాలాగ్రామాల్లో కాంటా వేసి, రవాణ జరిగి, మిల్లర్లకు చేరిన తరువాత కూడా తరుగు తీస్తున్నారని రైతులను నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని భట్టి చెప్పారు. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బందినుంచి మొత్తం యంత్రాంగం వరకూ స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయాలని అన్నారు. (తెలంగాణ: రాగల మూడు రోజులు వర్ష సూచన)
Comments
Please login to add a commentAdd a comment