paddy farmers
-
తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఒక రైతు గా చెప్తున్నా.. ఎవరు బాధపడకండి..ఎమ్మెల్యే ఆర్కే భరోసా
-
వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం
-
అన్నదాతలను నట్టేట ముంచిన అకాల వర్షాలు
-
వరి... ఉరి కాకుండా ఆపలేమా?
కొంతకాలంగా తెలంగాణలో వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న వరి పండించే రైతన్నలకు ప్రత్యామ్నాయం చూపవలసి ఉంది. వరి పండించవద్దని చెప్పడం సరైంది కాదు. వరి కొనుగోలు సమస్య ముఖ్యంగా యాసంగి పంటకు వస్తుంది. కారణం – యాసంగిలో వడ్ల మిల్లింగ్‌లో ఎక్కువ నూకల శాతం ఉండడమే. నూక శాతాన్ని తగ్గించుకోవడానికి మిల్లర్లు బాయిల్డ్ రైస్ వైపు మొగ్గు చూపడం వలన కేంద్రం కొనుగోలుకు విముఖంగా ఉంది. రైస్‌కు ఉన్న డిమాండ్ బాయిల్డ్ రైస్‌కు లేకపోవడం, బాయిల్డ్ రైస్ వినియోగం దేశంలో తగ్గుతుండడం కేంద్ర ప్రభుత్వ నిరాసక్తతకు ఊతమిస్తున్నాయి. ఈ సమస్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూడడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సబబు కాదు. రైతుల క్షోభను అర్థం చేసుకుని ఇరు ప్రభుత్వాలూ సానుభూతితో పరిష్కారం కోసం కృషి చేస్తే రైతుల మన్ననలను పొందగలరు. సమస్యకు మూలకారణమైన నూకలు, బాయిల్డ్ రైస్ వినియోగానికి ఉన్న అవకాశాలను పరిశీలించి అమలు చేస్తే, రైతులకు మంచి ధరను అందించవచ్చు. వీటిని వినియోగించి ‘ఇథనాల్’ తయారీకి మంచి అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం ఉన్న ఇంధనం కొరత, అధిక ఇంధన ధరలకు ఒక పరిష్కారం కూడా అవుతుంది. పెట్రోల్ కొరత, దాని ఇతర ఉత్పత్తుల ధరల పెరుగుదల వలన, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. బ్లెండెడ్ పెట్రోల్ ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. (చదవండి: ఎరువుల వెతలకు శాశ్వత పరిష్కారం!) అన్ బ్లెండెడ్ పెట్రోల్‌పై లీటరుకు రెండు రూపాయల అదనపు ఎక్సైజ్ సుంకం ఉండడం వలన, బ్లెండెడ్ పెట్రోల్ వినియోగించడానికి ఆర్థిక ప్రోత్సాహం కూడా ఉంది. ఇథనాల్ ఉపయోగిస్తే రైతులకు మేలుతో పాటు, దేశానికి పెట్రోలియం దిగుమతుల భారం తగ్గుతుంది. దేశంలో ‘ఇథనాల్’ కొరతను కూడా అధిగమించవచ్చు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా, వరి ఉత్పత్తులతో ఇథనాల్ తయారీకి, రెండు తెలుగు రాష్ట్రాల్లో అవకాశం మెండుగా ఉందనీ, తయారీకి ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామనీ చెప్పడం కూడా గమనార్హం. (చదవండి: వ్యవసాయరంగంలో నిశ్శబ్ద విప్లవం) ఇథనాల్‌ను రైస్ తయారీలో కూడా మితంగా ఉపయోగిస్తారు. నూకలను, బాయిల్డ్ రైస్‌ను పిండిగా మార్చి ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. చర్మ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్, రైస్ బిస్కెట్లు, నిల్వ ఆహార పదార్థాల తయారీలో కూడా బియ్యపు పిండిని వాడుతారు. ఇవే కాకుండా ఇంకా మెరుగైన వినియోగానికి మార్గాలను పరిశోధనల ద్వారా అన్వేషించి ఉపయోగించడం ద్వారా వరి రైతులకు ఊరటనివ్వడమే కాకుండా పారిశ్రామిక ఉద్యోగ అవకాశాలు పెరిగి గ్రామీణ ఆర్థికం పరిపుష్టమౌతుంది. – ఏఎల్ఎన్ రెడ్డి, హైదరాబాద్ -
కిసాన్ కాల్‌సెంటర్‌తో సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: పశుపోషణను లాభసాటిగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ) పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. పశుఆరోగ్య పరిరక్షణ, యాజమాన్య పద్దతులపై శాస్త్రీయ విషయ పరిజ్ఞానం కల్పించడం, శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆధునిక పశుపోషణపై అవగాహన పెంచి ఇతర వృత్తులకు దీటుగా ఆదాయం పెంచడమే లక్ష్యంగా టోల్‌ఫ్రీ నంబరు 1800–120–4209తో ఏర్పాటు చేసిన కిసాన్ కాల్‌సెంటర్ పాడిరైతులు, విద్యార్థుల అవసరాలను తీరుస్తోంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తున్న ఈ కాల్సెంటర్లో కేవీకే సిబ్బంది సేవలందిస్తున్నారు. పాడిపశువుల పోషణ, యాజమాన్యం, పునరుత్పత్తి, పశుగ్రాసాల సాగు, వ్యాధులు–నివారణ, విలువ ఆధారిత పదార్థాల తయారీ తదితర అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడమేగాక పశువైద్య కళాశాలల్లో కొత్త కోర్సులు, ప్రవేశాలపై విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాల్‌సెంటర్ ద్వారా గడిచిన ఏడాదిన్నరలో 3,429 మంది సమస్యలను పరిష్కరించారు. పునరుత్పత్తి, గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణ కోసం 759, ఇతర వ్యాధుల నివారణ కోసం 593, పశుపోషణ, యాజమాన్య పద్ధతుల కోసం 370, చేపల పెంపకంపై 106, పాలు, మాంస పదార్థాల తయారీ కోసం 287, అడ్మిషన్స్ కోసం 1,314 మంది కిసాన్ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేశారు. ఫోన్లో విషయం చెప్పగానే క్షణాల్లో వారి సమస్యలకు పరిష్కారమార్గాలు చూపారు. -
వద్దన్నా.. వరి సాగు
-
ఆశ పోయింది.. శ్వాస ఆగింది..కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె
హుజూరాబాద్/జమ్మికుంట: ధాన్యంరాశి వద్ద ఇరవై రోజులుగా పడిగాపులు కాసినా, కొనే నాథుడులేడనే ఆవేదనతో అన్నదాత కన్ను మూశా డు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (59)కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 20 రోజుల క్రితం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టడంతో ఐలయ్య అక్కడే ధాన్యం ఆరబోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళ వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై వడ్ల రాశిపైనే కుప్పకూలి విగతజీవిగా మారాడు. ఆయనకు భార్య లక్ష్మి, కూతురు నిత్య ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఐలయ్య మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు డిమాండ్ చేశారు. వడ్లు తెచ్చి 20 రోజులైతాంది వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైతాంది. తేమ ఉందని ఆరబెట్టాలని సార్లు చెప్పిన్లు. అప్పటిసంది కేంద్రంలోనే రోజూ ధాన్యం ఎండబెడుతున్నం. ఈ రోజు నా భర్త భోజనం చేసి, వడ్లను బస్తాలలో నింపేందుకు పోయిండు. కొద్దిసేపటికే చనిపోయిండని చెప్పిన్లు. నాకు దిక్కెవరు. ప్రభుత్వం ఆదుకోవాలె. – లక్ష్మి, మృతుడి భార్య టోకెన్ ఇచ్చాం ఐలయ్య వారం క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఆరబెట్టిన తర్వాత ఈ టోకెన్ జారీ చేశాం. ఈరోజు గన్నీ తీసుకొని నింపుతుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. – తిరుపతి, పీఏసీఎస్ సెంటర్ ఇన్చార్జి ఐలయ్యది ఆకస్మిక మరణం: అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటుతో మృతి చెందారని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4న 10–10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, 6న టోకెన్ జారీచేశామని పేర్కొన్నారు. ఐలయ్య మృతిపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసూనతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. -
పంటలు మార్చండి, లాభాలు పొందండి.. రైతులకు సీఎం కేసీఆర్ సూచన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బంది పడే కంటే రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. వరికి ప్రత్యామ్నాయమే మేలు అని, తెలంగాణ రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, మినుములు, పత్తి, పెసర్లు, శనగల వంటి పంటలు సాగు చేయాలని చెప్పారు. పంట మార్పిడి విధానం అవలంబించి అధిక దిగుబడులు, లాభాలు గడించాలన్నారు. గద్వాల ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి ఇటీవల మరణించిన నేప థ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన గురువారం గద్వాలకు వచ్చారు. రోడ్డు మార్గంలో బస్సులో వచ్చిన సీఎం.. ముందుగా ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగుపయనంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన సాగు చేస్తున్న మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. రైతులు, వ్యవసాయాధికారులతో ముచ్చటించారు. అదేవిధంగా కొత్తకోట మండల పరిధిలోని విలియంకొండ తండా రోడ్డు వద్ద కల్లంలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. అక్కడే రోడ్డు పక్కన పెద్దగూడేనికి చెందిన కౌలు రైతు గోకరి వెంకటయ్య సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. కొన్ని వేరుశనగ మొక్కలను భూమి నుంచి తీసి కాయల నాణ్యతను పరిశీలించారు. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని ముఖ్యమంత్రికి రైతు వెంకటయ్య వివరించారు. ఈ సందర్భంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని అక్కడే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి సూచించారు. ముఖ్యమంత్రి అకస్మాత్తుగా చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. సీఎం వెంట రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు ఉన్నారు. కాన్వాయ్‌ని అడ్డుకునే యత్నం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కొత్తబస్టాండ్ దాటిన తర్వాత జాతీయ రహదారిపై సీఎం కాన్వాయ్‌ని స్థానిక బీజేవైఎం నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించి కాన్వాయ్ సాఫీగా ముందుకు వెళ్లేలా చేశారు. మినుము రైతుతో సీఎం ముచ్చట సీఎం కేసీఆర్: మినుము పంట ఎందుకు వేశావు ? రైతు మహేశ్వర్‌రెడ్డి: నీళ్లు తక్కువ తీసుకుంటుంది. ఆరు తడి పంటల కింద వేశాను సర్. సీఎం: ఎన్ని రోజుల్లో చేతికొస్తది ? రైతు: 90 రోజుల్లో వస్తది. సీఎం: ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది ? రైతు: 8 నుంచి 12 క్వింటాళ్ల మధ్య వస్తది. సీఎం: పెట్టుబడి ఖర్చు ఎంతవుతది ? రైతు: మందులు, ఎరువులు, కూలీలు కలిపి మొత్తం ఖర్చు ఎకరాకు రూ.20 వేలు అవుతది. సీఎం: మార్కెట్లో ఎంత ధర పలుకుతోంది ? రైతు: ఎంఎస్పీ క్వింటాల్‌కు రూ.6,300 ఉంది. మార్కెట్లో రూ.8 వేలకు పైనే ఉంది సార్. సీఎం: అమ్మితే మీకు ఎంత మిగుల్తది ? రైతు: ఖర్చులు పోనూ రూ.20 వేలు మిగుల్తది. సీఎం: ఎక్కడెక్కడ మినుము వేస్తారు? రైతు: పెంచికలపాడు, ఈర్లదిన్నె, జనుంపల్లి, గుమ్మడం, యాపర్లలో ఎక్కువగా వేస్తారు సర్. -
మేలుజాతి పశు పునరుత్పత్తి క్షేత్రాలు
సాక్షి, అమరావతి: అధిక దిగుబడినిచ్చే దేశవాళి ఆవులు, గేదెలు, విదేశీజాతి ఆవుల పునరుత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మేలుజాతి పశుపునరుత్పత్తి క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో యూనిట్ రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఈ క్షేత్రాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, మేలుజాతి పశుసంపదను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యవంతమైన, అధిక పాల దిగుబడినిచ్చే పశుసంపద కోసం పాడిరైతులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటివరకు దేశంలో వీటి పునరుత్పత్తికి సరైన వ్యవస్థ అందుబాటులో లేదు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మేలుజాతి పశుపునరుత్పత్తి క్షేత్రాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక్కో యూనిట్‌కు అయ్యే రూ.4 కోట్ల వ్యయంలో రూ.2 కోట్లను సబ్సిడీ రూపంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ద్వారా అందిస్తుంది. ఒక్కో క్షేత్రాన్ని 200కు తక్కువకాకుండా మేలుజాతి ఆవులు లేదా గేదెలతో ఏర్పాటు చేస్తారు. మినిమమ్ స్టాండర్స్ ప్రొటోకాల్స్ (ఎమ్మెస్పీ) ప్రకారం కనీసం రోజుకు 16 లీటర్ల పాలిచ్చే గేదెలు, 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే ఆవులు, 22 లీటర్లకుపైగా పాలిచ్చే సంకరజాతి ఆవులను ఎంపిక చేసుకోవాలి. ఒక ఈత అయిన ఆవులు, గేదెలను మాత్రమే కొనుగోలు చేయాలి. వీటివిలువ ఒక్కొక్కటి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. వీటికోసం ప్రత్యేకంగా షెడ్లు, పోషణకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలి. మేలుజాతి పశువుల వీర్యాన్ని ఐవీఎఫ్ సాంకేతికత ద్వారా వినియోగించి నాణ్యమైన దూడెలను పునరుత్పత్తి చేయాలి. ఇలా అభివృద్ధి చేసిన ఆడదూడల పునరుత్పత్తి ద్వారా బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫారాలను అభివృద్ధి చేయవచ్చు లేదా తోటి రైతులకు విక్రయించుకోవచ్చు. మగ దూడలనైతే సెమన్ బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయిస్తారు. ఎంపిక చేసే విధానం ► దరఖాస్తుదారులు.. వ్యాపారవేత్తలు, ప్రైవేట్ వ్యక్తులు, స్వయం సహాయక సంఘాలు/రైతు ఉత్పత్తి సంస్థలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్–8 కింద నమోదైన కంపెనీలై ఉండాలి. ► పాడి పశువుల పెంపకంలో అనుభవం ఉండాలి. ► కనీసం 5 ఎకరాల సొంత భూమి లేదా లీజుకు తీసుకున్న భూమి ఉండాలి. ► ఫారంలో పశువులకు అవసరమైన మేతను సేకరించేందుకు తగిన ఏర్పాటు ఉండాలి. ► పశుసంవర్ధకశాఖ, ఎన్డీడీబీ, నిపుణుల కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. ► దరఖాస్తు, ప్రెజంటేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా వారి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అవసరమైతే బ్యాంకు/ఆర్థికసంస్థకు రుణం కోసం సిఫారసు చేస్తుంది ► బ్యాంకుల నుంచి రుణమంజూరు లేఖ అందిన తర్వాత తొలుత ఎన్డీడీబీ, చివరగా డీఏహెచ్డీ ఆమోదముద్ర వేస్తాయి. ► ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను buy@ nddb.coop అనే ఈ మెయిల్ ద్వారా నిర్దేశిత ఫార్మాట్లో సమర్పించాలి. పశుక్షేత్రాల లక్ష్యాలు ► ఆవులు, గేదెల పెంపకంలో ఉత్తమ వ్యాపారవేత్తలను తయారు చేయటం. ► వ్యాధులు లేని, అధిక దిగుబడినిచ్చే దేశవాళి ఆవులు, గేదె జాతుల కోడెదూడలు, తొలిచూరు పడ్డలను అందుబాటులోకి తీసుకురావడం. ► పశుపోషణ, వ్యాధుల నివారణ, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించడం. ► ఐవీఎఫ్ సాంకేతికత, విజయవంతమైన వీర్యోత్పత్తి ద్వారా అధిక దిగుబడినిచ్చే పాడి పశువులను ఉత్పత్తి చేయడం. దరఖాస్తు గడువు నవంబర్ 30 రాష్ట్రంలో స్వదేశీ జాతి పశువుల కంటే వ్యాధిరహిత, అధిక దిగుబడినిచ్చే కోడెలు/గర్భిణి కోడెలు/ క్యూలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ క్షేత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు ఆసక్తిచూపేవారు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తు ఫారాలు అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డా.మురళీధర్ని 9985738718/7093360333 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ -
కౌలు రైతుకు పెద్ద కష్టం..పంట డబ్బూ పోయే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కౌలురైతులకు మరో పెద్ద కష్టం వచ్చిపడింది. ధాన్యం కొనుగోలు డబ్బులను.. సదరు భూమి యజమాని బ్యాంకు ఖాతాల్లోనే వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త సమస్య మొదలైంది. ఇందుకోసం రైతులు కౌలుకు తీసుకున్న భూమి యజమానుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు కావాలనడం, ధాన్యం డబ్బులను ఆ ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా.. సదరు భూయజమానికి చెందిన పాస్‌బుక్‌లో ఎంత మేర భూమి ఉందో.. దానికి తగినంత మాత్రమే ధాన్యం కొంటామని చెప్తుండటంతో దిగాలు పడుతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఈ కొత్త నిబంధనలు ఏమిటని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు భారం తగ్గించుకునేందుకే కొత్త రూల్స్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అడ్డుకునేందుకే ఈ కొత్త విధానం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. రైతు బంధుతో లింక్ అయిన ఖాతాల్లోకే.. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములన్నింటికీ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా రెండుసార్లు ఎకరానికి రూ.5 వేల చొప్పున సదరు భూయజమానుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఇప్పుడు పంట కొనుగోళ్లు, ధాన్యం డబ్బులను జమ చేయడానికి అవే వివరాలను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. జిల్లా కలెక్టర్లు పౌరసరఫరాల శాఖ అధికారులు/సిబ్బందిని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన సుమారు 4 వేల కొనుగోలు కేంద్రాల వద్ద లాప్టాప్/ట్యాబ్లెట్లతో పౌరసరఫరాల శాఖ తరఫున ఒక్కో వ్యక్తిని నియమించారు. ఆ వ్యక్తి ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల నుంచి ఆధార్ నంబర్ తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయగానే సదరు రైతుకున్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఆ రైతు పేరు మీద ఎంత భూమి ఉంది, ఏమేం పంటలు వేశారు, రైతుబంధుకు లింక్ అయిన బ్యాంక్ ఖాతా తదితర వివరాలు వస్తాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. ఆ వివరాలు అన్నీ సరి చూసుకున్నాకే వడ్లను తూకానికి వేస్తున్నారు. వివరాల్లో ఎక్కడ తేడా వచ్చినా కొనడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్మును రైతుబంధు జమవుతున్న బ్యాంకు ఖతాల్లోనే జమ చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ డేటాతో అనుసంధానించి.. రైతులకు ఉన్న భూమి విస్తీర్ణం, వేసిన పంట, రైతుబంధు కింద రైతుకు అందుతున్న సొమ్ము వివరాలన్నీ మండలాల వారీగా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉంటాయి. వానాకాలం, యాసంగి పంటలు వేసిన తర్వాత మండలాల ఏఈవోలు.. రైతుల భూమి విస్తీర్ణం, వేసిన పంటల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇప్పుడు ఆ డేటాను పౌర సరఫరాల శాఖ తరఫున నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లకు అనుసంధానం చేశారు. దీనివల్ల కొనుగోలు కేంద్రంలో రైతుల ఆధార్ నంబర్ నమోదు చేయగానే.. వారికి ఉన్న భూమి, వారు వేసిన పంటల వివరాలు కనిపిస్తున్నాయి. అయితే రైతుల ఆధార్ నంబర్ నమోదు చేసినప్పుడు దానికి లింక్ అయి ఉన్న రైతుల ఫోన్‌కు ఓటీపీ (వన్‌టైం పాస్వర్డ్) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాకే.. వివరాలన్నీ కనిపిస్తాయి. భూమికి తగినంతే కొనుగోళ్లు.. రైతులకు ఎంత భూమి ఉంటే.. దానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. గరిష్టంగా ఎకరానికి 36 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని లెక్కలు వేసింది. రైతులు తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి, కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యానికి లెక్క కుదిరితేనే సేకరిస్తోంది. దీనివల్ల కౌలు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి పాస్‌బుక్ ఆధారంగా.. కౌలు పంట అంతా విక్రయించుకునే పరిస్థితి ఉండదు. భూయజమానులను బతిమాలి పాస్‌బుక్, ఇతర వివరాలు తెచ్చుకోవాల్సిందే. పంట డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాక వెళ్లి తీసుకోవాల్సిందే. ఆధార్ ఫోన్ నంబర్లు, ఓటీపీల సమస్యతో.. చాలా మంది రైతులు తాము ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు.. తమ పిల్లల ఫోన్ నంబర్లు, తెలిసిన వారి నంబర్లను ఇచ్చారు. గ్రామాల్లో అయితే మీసేవ సెంటర్ల ఓనర్ల నంబర్లు కూడా ఇచ్చి నమోదు చేసుకున్నారు. వీటిలో చాలా వరకు ఫోన్ నంబర్లు మారిపోవడమో, ఏ నంబర్ ఇచ్చామన్నది మర్చిపోవడమో జరిగింది. ఇప్పుడా రైతులంతా ఓటీపీ ఏ నంబర్‌కు వచ్చిందో తెలియక.. ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. విరాసత్, మ్యుటేషన్ భూములు.. ధరణి సమస్యలు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయ భూముల వివరాలు చాలావరకు వ్యవసాయ శాఖ రికార్డుల్లో నమోదుకాలేదు. రైతుబంధుకు దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల మ్యూటేషన్, విరాసత్ అయిన భూములు వ్యవసాయ శాఖ రికార్డుల్లో లేవు. సదరు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తమ ఆధార్ నంబర్ ఇస్తే.. కేవలం రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న భూముల వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వ్యవసాయశాఖ పరిధిలోని డేటా (వేసిన పంటలు, రైతుబంధు ఖాతా నంబర్ వంటివి) చూపించడం లేదు. అలాగే ధరణి పోర్టల్‌లో అప్డేట్ కాని వ్యవసాయ భూములకు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఈ రైతులెవరూ కూడా తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. కౌలు రైతులనే అంశమే లెక్కలోకి రాదు పంట పండించిన రైతులకు ధాన్యం సొమ్ము చేరేలా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులు అనే అంశమే మా లెక్కలోకి రాదు. అందుకే రైతు ఖాతాలోకే ధాన్యం సొమ్మును జమ చేస్తున్నాం. అలాగే రైతుకు ఉన్న భూమికి తగిన మేర పంటను మాత్రమే కొంటాం. రెండెకరాల పొలంలో 200 క్వింటాళ్లు దిగుబడి రాదు కదా. ఎకరానికి గరిష్టంగా 36 క్వింటాళ్లుగా నిర్ణయించాం. పీడీఎస్ బియ్యాన్ని కూడా కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా చూపించే పరిస్థితి ఉండకూడదనే కఠినంగా వ్యవహరిస్తున్నాం. విరాసత్, మ్యుటేషన్ అయిన భూముల వివరాలను వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేయించుకుంటే ధాన్యం కొనుగోలు చేస్తాం. గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన కౌలు రైతు తంగెళ్ల శ్రీనివాస్. రెండెకరాలు కౌలుకు తీసుకుని పండించిన ధాన్యాన్ని 15 రోజుల కిందే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. రెండు రోజుల క్రితమే కొనుగోళ్లు మొదలవడంతో కాంటా వేసేందుకు సిద్ధమయ్యారు. భూయజమాని పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చిన శ్రీనివాస్.. పంట సొమ్మును జమచేసేందుకు తన బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీ ఇచ్చాడు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ఓ వ్యక్తి ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా.. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డేటాలోని బ్యాంకు ఖాతా నంబర్‌తో సరిపోలలేదు. దానితో వడ్లు కాంటా వేసేందుకు నిరాకరించారు. భూయజమాని బ్యాంకు ఖాతా నంబర్‌ను నమోదు చేశాకే.. కొనుగోలుకు ఓకే అయింది. ఇప్పుడు పంట డబ్బులు భూయజమాని ఖాతాలోనే పడనున్నాయి. వారి నుంచి శ్రీనివాస్ డబ్బులు తీసుకోవాల్సి రానుంది. -తంగెళ్ల శ్రీనివాస్) ఎక్కడికని పోవాలె..? రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నవారిలో 20శాతం నుంచి 30 శాతం వరకు కౌలు రైతులే. ఎక్కడో హైదరాబాద్‌లోనో, ఇతర జిల్లాలు, దూర ప్రాంతాల్లోనో ఉన్నవారి భూములను స్థానికంగా ఉన్నవారు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నారు. ఇప్పుడు కౌలు రైతులు ఎక్కడో ఉన్న భూయజమానుల నుంచి ఆధార్, పట్టా పాస్‌బుక్, ఇతర వివరాలు తీసుకోవడం.. వారి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ అడిగి తెలుసుకుని నమోదు చేయించడం తప్పడం లేదు. ఇంతా చేసి ధాన్యం డబ్బులు భూయజమాని బ్యాంకు ఖాతాలో పడితే.. మళ్లీవారి వెంటపడి తీసుకోవాల్సిన పరిస్థితి. దీనితో కౌలు రైతులు దిగాలు పడుతున్నారు. అగ్గువకు అమ్ముకోవాల్సిన దుస్థితి కౌలు రైతులు అయితే తాము కౌలుకు తీసుకున్న భూయజమానుల నుంచి ఆధార్, ఇతర వివరాలు తీసుకుని ఇవ్వాల్సి వస్తోంది. పంట డబ్బులు కూడా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. భూయజమానులు వివరాలు ఇవ్వకున్నా, ఆ వివరాల్లో ఏవైనా తేడాలు ఉన్నా.. కౌలు రైతులకు ఇబ్బందే. చివరికి ఏ దిక్కూ లేక.. మిల్లర్లు, దళారుల వద్దకు వెళ్లి అగ్గువకో సగ్గువకో ధాన్యం అమ్ముకోక తప్పని పరిస్థితి. మిగతాది ఎవరు కొనాలి? పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి తగినట్టే ధాన్యాన్ని కొనాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అయితే చాలా మంది కౌలు రైతులకు సొంతంగా కొద్ది గుంటలో, అర ఎకరం వరకో భూమి ఉంటుంది. వారు మరింత భూమిని కౌలుకు తీసుకుని పంట వేస్తుంటారు. ఇప్పుడు తమ పాస్‌బుక్‌లో ఉన్న కొద్దిపాటి భూమికి అనుగుణంగా కొంత పంటనే కొనుగోలు చేస్తే.. మిగతా ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలని కౌలు రైతులు వాపోతున్నారు. మా పైసలు మాకియ్యరా? రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్‌కు చెందిన ఏనుగుల రాజు ఓ కౌలు రైతు. 12 ఎకరాల్లో వేసిన పంట కోతకు రాగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ పంట కొనుగోళ్ల కోసం ఆధార్ అడుగుతుండటం, డబ్బులను భూ యజమాని ఖాతాలో వేస్తామంటుండటంతో ఆందోళనలో పడ్డాడు. అసలు తమ ధాన్యం కొంటరా లేదా, తమ వడ్ల పైసలు తమకు రావంటే ఎట్లాగని ప్రశ్నిస్తున్నాడు. -
Telangana: పొలం నుంచి మిల్లుకు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వానాకాలపు వరి కోతలు ఊపందుకున్నాయి. చాలా జిల్లాల్లో 40శాతం వరకు కోతలు, నూర్పిడి పూర్తయి ధాన్యం రాశులు పోగుపడ్డాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. అవసరాలకు, అప్పులు తీర్చడానికి డబ్బులు లేక.. ఇంకా వేచి చూడలేక.. దళారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న దళారులు, మిల్లర్లు అగ్గువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రకాన్ని బట్టి మద్దతు ధరకన్నా మూడు వందల నుంచి ఆరు వందలదాకా తక్కువ రేటు చెల్లిస్తున్నారు. దీనికితోడు తేమశాతం, తాలు పేరుతో తరుగుతీస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో పౌరసరఫరాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నవిమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడో వంతు కేంద్రాలే.. ప్రస్తుత వానాకాలంలో పెరిగిన వరి సాగుకు అనుగుణంగా 6,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. కోటీ రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వానాకాలం కోతలు మొదలై 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు తెరిచిన కొనుగోలు కేంద్రాలు 2,142 మాత్రమే. ముఖ్యంగా నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో వరికోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ కొనుగోలు కేంద్రాలు తెరిచే విషయంలో పౌరసరఫరాల శాఖ తాత్సారం చేస్తోంది. తెరిచిన కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి రోజులు గడుస్తున్నా.. వడ్లు కొనే పరిస్థితి లేదు. నల్లగొండ నుంచి పెద్దపల్లి దాకా పెద్ద సంఖ్యలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. తమ టోకెన్ నంబర్ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడటంతోనే గడిచిపోతోందని నల్లగొండకు చెందిన రమేశ్ అనే రైతు వాపోయారు. రాష్ట్రంలో కోటి టన్నులకుపైగా ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 2.36 లక్షల టన్నులు మాత్రమే సేకరించారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయి ఉన్నాయి. వానలు పడితే తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధరకన్నా తక్కువతో.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం, ఏర్పాటైన చోట కొనుగోళ్లకు రోజుల తరబడి వేచి చూసే పరిస్థితి కారణంగా రైతులు నేరుగా మిల్లర్లను, దళారులకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వెంటనే కొనుగోలు చేస్తుండటం, డబ్బులు చెల్లిస్తుండటంతో.. అగ్గువ సగ్గువకైనా ధాన్యాన్ని అప్పగిస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొంటున్న దళారులు, మిల్లర్లు.. రకం, తేమశాతం, ఇతర అంశాలను బట్టి క్వింటాల్‌కు రూ.1,360 నుంచి రూ.1,650 వరకే చెల్లిస్తున్నారు. వరి ఏ గ్రేడ్‌కు రూ.1,960.. బీ గ్రేడ్‌కు రూ.1,940గా కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల కంటే ఇవి ఐదారు వందలదాకా తక్కువ కావడం గమనార్హం. సన్న వడ్లకే కాస్త ధర.. వచ్చే యాసంగి నుంచి దొడ్డు బియ్యం, ఉప్పుడు (పారాబాయిల్డ్ రైస్)ను కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు పలు సూచనలు చేసింది. దీంతో వానాకాలం పంట విషయంలో కూడా మిల్లర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే దొడ్డు వడ్లను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సన్న వడ్లను మాత్రం నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సన్నరకాలకు క్వింటాల్ రూ.1,600 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తుండగా.. రైతులెవరైనా దొడ్డు వడ్లను తెస్తే మరో రెండు, మూడు వందలు తక్కువగా ఇస్తున్నారు. దీనికితోడు తేమ, తాలు అంటూ మరింత కోత పెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఇప్పటికే వరి దిగుబడి దశకు చేరింది. కోతలు వేగంగా సాగుతున్నాయి. కానీ ఇప్పటికీ భువనగిరి, సూర్యాపేటల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం పలు కొనుగోలు కేంద్రాలను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో శనివారం మొదలు కానున్నాయి. కానీ ఇప్పటికే ఆలస్యం కావడంతో చాలా మంది రైతులు ధాన్యాన్ని మిల్లులకు విక్రయిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ పూర్తికాకున్నా.. గత యాసంగికి సంబంధించిన లక్షల టన్నుల ధాన్యం ఇప్పటికీ మిల్లుల్లో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ఆ ధాన్యాన్ని మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి పంపించాల్సి ఉంది. కానీ ఆ పని ఆపేసి.. రైతుల నుంచి వానాకాలం పంటను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకే సన్నరకాల ధాన్యం కొనవచ్చని.. డిమాండ్ వచ్చినప్పుడు రెట్టింపు రేటుకు అమ్ముకోవచ్చన్నది మిల్లర్లు ఆలోచన అని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి. రూ.1,650కే అమ్ముకోవాల్సి వచ్చింది నాకున్న ఒకటిన్నర ఎకరం భూమిలో సన్నరకం వరి వేశాను. పదిహేను రోజుల కింద పంటకోసి నూర్పిడి పూర్తయింది. ప్రభుత్వ కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు కాలేదు. వానలు పడతాయన్న భయంతో వడ్లను వ్యాపారులకు అమ్ముకున్నా. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.1,650 రేటుకే అమ్ముకోవాల్సి వచ్చింది. – షేక్ నిస్సార్, బర్ధీపూర్ గ్రామరైతు, బోథ్ మండలం -
వరి సాగు చేస్తే ఊరుకునేది లేదు: సిద్ధిపేట కలెక్టర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, మెదక్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తాజాగా ఘాటైనా వ్యాఖ్యలు చేశారు. వరి సాగు చేస్తే ఊరుకునేది లేదని, రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో ఎవరైనా ఒక్క కేజీ వరి విత్తనాలు విక్రయించినా ఊరుకునేది లేదని.. అమ్మితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వ్యాపారం రద్దు చేసి షాపుని మూయిం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. డీలర్లు సుప్రీం కోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా షాపు ఓపెన్ చేసేది లేదని తేల్చిచెప్పారు. ‘నేను చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీం కోర్టు జడ్జి చెప్పినా, రాష్ట్ర హైకోర్టు జడ్జి చెప్పినా, ప్రజా ప్రతినిధులు చెప్పినా నేను కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఎటువంటి పరిస్థితులలో షాపులు తెరుచుకోవు. ఒకవేళ డీలర్లు విత్తనాలు అమ్మితే సంబంధిత ఏఈవోలు, అధికారులు సస్పెండ్ అవుతారు.’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కాగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదంగా మారాయి. -
ధాన్యం రైతు 'ధర'హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) భారీగా కొనుగోలు చేస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. ఉన్న ఊళ్లోనే ధాన్యాన్ని అమ్ముకోగలుగుతున్నారు. తద్వారా రవాణా ఖర్చు ఆదా అవుతోంది. ప్రస్తుత రబీలో ధాన్యాన్ని విక్రయించేందుకు ఆర్బీకేల ద్వారా 3.55 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. శనివారం నాటికి 2,11,320 మంది రైతుల నుంచి రూ.4,521.08 కోట్ల విలువైన 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రబీ పంట కోతలు పూర్తయ్యాయి. దాంతో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధిక భాగం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నెల్లూరు, ప్రకాశం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రాంతాల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఆర్బీకేల ద్వారా కళ్లాల వద్దే కొనుగోలు చేయడమే కాకుండా 21 రోజుల్లోగా అన్నదాతల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారు. ప్రభుత్వమే భారీ ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లోనూ అదే ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 24,14,969.28 టన్నులు కొనుగోలు ► రబీలో రైతులు 21.75 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. దిగుబడి అయిన ధాన్నాన్ని వీలైనంతంగా కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే 24,14,969.28 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ► ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు సాధారణ రకానికి రూ.1868, ఏ–గ్రేడ్ రకానికి రూ.1888 ఎమ్మెస్పీగా ప్రకటించి, అదే ధరకు కొనుగోలు చేస్తోంది. రైతుల కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో గ్రామాల్లోని 7,706 ఆర్బీకేలతో పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని 3,936 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేశారు. ► ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తమ పేర్లను ఆయా గ్రామాల్లోని ఆర్బీకేల్లో నమోదు చేయించుకోవాలి. ఈ–పంటలో ఆ రైతులు వరి సాగు చేశారా లేదా అన్నది సరి చూసుకుని, కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలుకు కూపన్లు జారీ చేస్తారు. ఏ రోజున ఏ సమయంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తారన్నది ఆ కూపన్లలో స్పష్టంగా ఉంటుంది. ► ఆ మేరకు ఆర్బీకేలోని వీఏఏ (గ్రామ వ్యవసాయ సహాయకుడు) కళ్లం వద్దకు వెళ్లి ధాన్యం నాణ్యతను పరిశీలించి, కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రమాణాల మేరకు నాణ్యత లేకపోతే.. ధాన్యంలో తేమ శాతం తగ్గే వరకు అరబెట్టాలని వీఏఏ సూచిస్తారు. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన 21 రోజుల్లోగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. గిట్టుబాటుధర దక్కకపోతే అమ్ముకోవద్దు బహిరంగ మార్కెట్లో కనీస మద్ధతు ధర దక్కకుంటే ధాన్యాన్ని అమ్ముకోవద్దు. ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోండి. కళ్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేయడానికి కూపన్లు జారీ చేస్తాం. కూపన్లలో పేర్కొన్న రోజున ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు రాకపోతే.. మరో కూపన్ జారీ చేసి, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. మిల్లర్లు, దళారీలకు ధాన్యాన్ని అమ్ముకోవద్దు. – కోన శశిధర్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ రైతులకు అన్ని విధాలా భరోసా ► దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పంటల సాగులో సూచనలు, సలహాలు ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ► అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల పంటకు నష్టం వాటిల్లితే బీమా పథకం ద్వారా పరిహారం అందజేస్తూ రైతులకు బాసటగా నిలుస్తోంది. తుదకు పండించిన పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తోంది. -
ఐదు రోజులుగా ఇలాగే.. కొంటారా? కొనరా?
అయితే ధాన్యం కొనుగోలు కేంద్రంలో.. లేదంటే రోడ్డుపై.. ఎక్కడైనా రైతులకు పడిగాపులు తప్పట్లేదు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాల సమీపంలోని వరంగల్ – ఖమ్మం హైవేపై ఐదురోజులుగా కిలోమీటర్ మేర నిలిచిపోయిన ధాన్యం లోడు ట్రాక్టర్లివి. అక్కడి హరిచందన రైస్‌మిల్లు యజమానులతో పాటు అధికారులను ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని రైతులు కోరుతున్నా స్పందన లేదు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్ అర్బన్ కొంటారా? కొనరా? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ధాన్యాన్ని కాంటా పెట్టించుకున్న రైతులు.. 20 రోజులుగా లారీల కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం కురిసిన వర్షంతో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. దీంతో ఆగ్రహించిన రైతులు తడిసిన ధాన్యం కొనాలంటూ.. బస్తాల్ని ప్రధాన రహదారిపైకి చేర్చి ఆందోళనకు దిగారు. అంతకుముందు ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు. – మహబూబాబాద్ రూ.2 లక్షల నష్టం నీళ్లుతోడుతూ వడ్లగింజల్ని ఒడిసిపట్టే యత్నంలో ఉన్న ఈ రైతు పేరు మారబోయిన స్వామి (చీటకోడూరు). స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు 250 బస్తాల ధాన్యం తెచ్చాడు. బుధవారం అర్ధరాత్రి వర్షానికి 150 బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మరికొన్ని కొట్టుకుపోయాయి. ఈ ఒక్క రైతే రూ.2 లక్షల మేర నష్టపోయాడు. ఈ మార్కెట్లో పలువురు రైతులకు చెందిన పదివేలకు పైగా బస్తాల ధాన్యం వర్షాలకు దెబ్బతింది. – జనగామ ధాన్యం.. మొలకెత్తిన దైన్యం చేతికొచ్చిన పంట చెదలుపడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టార్జితం నీళ్లపాలై మొలకలెత్తుతోంది. ఈ ఫొటోలోని రైతు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ముత్యాలగూడెంకు చెందిన బడేటి పుల్లయ్య. నెలన్నర క్రితం స్థానిక కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకెళ్లాడు. ఇన్నాళ్లూ కాంటా కూడా వేయలేదు. అప్పట్నుంచి పట్టాలు కప్పి ధాన్యాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటున్నా.. అడపాదడపా పడిన అకాల వర్షాలు అతని శ్రమను తుడిచిపెట్టేశాయి. ఫలితంగా ధాన్యం ఇలా మొలకలెత్తింది. మరికొంత ధాన్యం బూజుపట్టిపోయింది. – కూసుమంచి చదవండి: బండెనక బండి.. ధాన్యం లెండి ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం -
Photo Feature: అన్నదాతల ఆవేదన.. కరోనా యాతన
అకాల వర్షం రైతులను కష్టాలను పాల్జేస్తోంది. ఆరుగాలం పండిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ‘టౌటే’ తుపాను అత్యంత తీవ్ర తుపానుగా మారి పలు రాష్ట్రాలను వణికిస్తోంది. గుజరాత్, కేరళ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక కరోనా విజృంభణతో దేశ ప్రజలు అల్లాడుతున్నారు. -
పాడిరైతులకు 45 సీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: పాడిరైతులకు అద్దె ప్రాతిపదికన ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం పశుసంవర్ధకశాఖ డివిజన్‌స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ (యంత్ర సేవాకేంద్రాలు–సీహెచ్‌సీలు) ఏర్పాటు చేస్తోంది. ఈ నెలాఖరులోగా అర్హతగల జాయింట్ లయబుల్ గ్రూపు (జేఎల్‌జీ)లకు రుణాలు మంజూరు చేసి మే మొదటి వారంలో వీటిని ప్రారంభించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 కోట్ల మేకలు, గొర్రెలు ఉన్నాయి. వీటికి నాణ్యమైన మేతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తోంది. పశుగ్రాసానికి అవసరమైన యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 45 పశుసంవర్ధక శాఖ డివిజన్లలో సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నారు. నలుగురికి తక్కువ కాకుండా పాడి రైతులతో ఏర్పాటైన జేఎల్‌జీ గ్రూపుల్లో అర్హత ఉన్న గ్రూపుల ఎంపిక 39 డివిజన్లలో పూర్తయింది. ఈ కేంద్రాలను క్రమంగా ఏరియా వెటర్నరీ ఆస్పత్రి, డిస్పెన్సరీ స్థాయికి విస్తరిస్తారు. 40 శాతం సబ్సిడీ ఈ కేంద్రాలకు రూ.14.70 లక్షల విలువైన 8 రకాల యంత్రపరికరాలను సమకూర్చనున్నారు. వీటిలో గడ్డిని ముక్కలు చేసే యంత్రాలు, కట్టలు కట్టే యంత్రాలు తదితరాలున్నాయి. కంకిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీలో డెమో ప్రదర్శనకు ఉంచిన ఈ యంత్రాలను పరిశీలించి గ్రూపు సభ్యులు తమకు అవసరమైనవే కొనుక్కునే వెసులుబాటు కల్పించారు. ఈ మొత్తంలో 10 శాతం జేఎల్‌జీ భరించాలి. 40 శాతం సబ్సిడీ రూపంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలిన 50 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రతి యంత్ర పరికరానికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. యూనిట్ గ్రౌండ్ కాగానే సబ్సిడీ విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆర్కేవీవై నిధుల నుంచి రూ.2.65 కోట్లు కేటాయించారు. నెలాఖరులోగా జేఎల్‌జీ గ్రూపుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిచేసి వచ్చేనెలలో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ డీడీ అమరేంద్రకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
రైతులను బ్లాక్మెయిల్ చేస్తారా?
సాక్షి, వైరా: కరోనా కష్టకాలంలో తెలంగాణ రైతాంగాన్ని తరుగు పేరుతో మిల్లర్లు, సొసైటీలు వేధిస్తున్నాయని.. ఇది ఎంతమాత్రం ఆయోదయోగ్యం కాదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శనివారం ఖమ్మం జిల్లా వైరాలో పర్యటించిన ఆయన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైరా సొసైటీకి సంబంధించి కాంటా వేసి, బస్తాలు వరంగల్ మిల్లుకు పంపితే.. ఆరేడు రోజులుగా వాటిని దించకుండా క్వింటాలకు ఏడెనిమిది కిలోలు తరుగు తీయాలని రైతులను పిలిపించారు. అలాగే మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండంలోని సఖినవీడు కొనుగోలు కేంద్రంనుంచి కొసుగోలు చేసిన ధాన్యాన్ని పెద్దపల్లి మిల్లుకు పంపారు. అక్కడా ఒక లోడుకు 14 క్వింటాల తరుగు తీస్తామని రైతులతో అన్నారని భట్టి విక్రమార్క చెప్పారు. ఇది ముమ్మాటికి రైతులను భయభ్రాంతులను చేయడమేనని సీఎల్పీ నేత అన్నారు. ఈ పరిణామాలు ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. (సాయం అంతలోనే మాయం!) సాధారణంగా ఒక్కసారి కాంటా వేసిన తరువాత ఆ ధాన్యంతోనూ, బస్తాలతో రైతులకు సంబంధం ఉండదని భట్టి చెప్పారు. కేవలం ఆ సొసైటీ లేదా కాంటా వేసే ఆర్గనైజేషన్ దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రవాణా నుంచి లేదా మిల్లర్లకు అందించే వరకూ.. ధాన్యం తరుగుతోనూ ఇక వారిదే బాధ్యత తప్ప రైతులకు ఉండదని భట్టి స్పష్టం చేశారు. చాలాగ్రామాల్లో కాంటా వేసి, రవాణ జరిగి, మిల్లర్లకు చేరిన తరువాత కూడా తరుగు తీస్తున్నారని రైతులను నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది రైతులను బ్లాక్ మెయిల్ చేయడమేనని భట్టి చెప్పారు. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బందినుంచి మొత్తం యంత్రాంగం వరకూ స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయాలని అన్నారు. (తెలంగాణ: రాగల మూడు రోజులు వర్ష సూచన) -
పది నిమిషాలకే గేట్లు మూసేస్తారా.!
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు సోమవారం నిరసన తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మార్కెట్‌కు సరుకులు తీసుకు రావాలనే నిబంధన విధించారు. రెండు సంవత్సరాలుగా సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కురిసిన జోరు వర్షాలు.. ఉదయం 10 గంటల వరకు వాతావరణం పొడిగా ఉంటుండడంతో.. కోతలు ఆలస్యమవుతున్నాయి. రైతులు యంత్రాల సహాయంతో వరిపంటను కోసి.. మార్కెట్‌కు వచ్చే సరికి కొంతమేర ఆలస్యమవుతుంది. 12 గంటలకు గేట్లు మూసివేస్తుండగా..పదినిమిషాలు ఆలస్యంగా వచ్చినా... లోనికి అనుమతి నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చెరువులు వెలవెల.. రైతులు విలవిల
సాక్షి, మెంటాడ (విజయనగరం): వరుణుడు ముఖం చాటేయడంతో మండలంలోని చెరువులు చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయి. ఖరీఫ్ వరిసాగుకు సిద్ధపడే రైతులను వర్షాభావ పరిస్థితి సందిగ్ధంలోకి నెట్టేసింది. ఇటీవల అడపా, దడపా వర్షాలు కురిసినా చెరువుల్లోకి నీరు చేరే స్థాయిలో కురవకపోవడంతో రైతన్నలు దిగులుచెందుతున్నారు. వరినార్లు పోసేం దుకు సాహించడం లేదు. దమ్ముల సంగతి పక్కనపెడితే నారుమడులకు కూడా నీరందుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ప్రభుత్వం ఉపాధి హామీ పనులు చేపట్టి చెరువులను లోతు చేయిస్తున్నా వర్షాలు లేకపోవడంతో ఆ పనులవల్ల ఎటువంటి ఫలితం దక్కడం లేదని రైతులు అంటున్నారు. మండలంలో చిన్న పెద్ద చెరువులు, బందలు కలిపి సుమారు 400 వరకు ఉన్నాయి. వీటి కింద సుమారు 3,600 ఎకరాల వరకు ఖరీఫ్ వరి సాగు చేసేవారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆసన్నమవుతున్నా నేటికీ సరైన వర్షాలు కురవకపోవడంతో వరి విత్తనాలు రైతుల వద్ద సిద్ధంగా ఉన్నప్పటికీ చల్లేందుకు సాహసించలేకపోతున్నారు. గోపీ పట్నాయిక్ చెరువు మండలంలోని గోపీ పట్నాయిక్ చెరువు పరిధిలో సుమారు 500 ఎకరాల ఆయకట్టు ఉంది. బడేవలస, మీసాలపేట, కొంపంగి, ఇద్దనవలస రాబం ద గ్రామాలకు చెందిన భూములను ఈ చెరువు ఆధారంగానే సాగుచేస్తుంటారు. ప్రస్తుతం ఈ చెరువులో చుక్క నీరు లేకపోవడం ఆయకట్టు రైతులను ఆందోళనలోకి నెట్టింది. పొట్టి బంద చెరువు అమరాయివలస,కైలాం గ్రామాల పొలాలకు పొట్టి బంద చెరువు ద్వారానే నీరు అందుతుంది. ఈ చెరువు కింద సుమారు 250 ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం ఈ చెరు వు ఎడారిని తలపిస్తోంది. ఆయకట్టు రైతులు కనీసం నారు మడులు కూడా తయారు చేయలేదు. గండివాని, పినా చెరువులు కైలాం గ్రామ రైతులు గండివాని చెరువు ఆధారంగానే వరి సాగు చేస్తుంటారు. సుమారు 400 ఎకరాల ఆయకట్టు ఈ చెరువు కింద సాగువుతోంది. ఈ ఏడాది నేటికీ చెరువులోకి చుక్క నీరు చేరలేదు. చింతలవలస రెవెన్యూ పరిధిలో ఉన్న పినా చెరువు కింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరవు పరిస్థితి కూడా అలాగే ఉంది. విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఈ ఏడాది ఉభాలు జరిగేలా లేవని రైతులు అంటున్నారు. -
ఖర్చు బారెడు... ఆదాయం మూరెడు
సాక్షి, సోంపేట (శ్రీకాకుళం): దేశానికి వెన్నెముక రైతని, రైతులకు న్యాయం చేస్తామని కేంద్ర పాలకులు హామీలు గుప్పించడం తప్ప ఆచరణ కనిపించడం లేదని ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్‌లో పండించిన వరికి మద్దతు ధర కంటితుడుపుగా పెంచుతున్నాయని రైతులు వాపోతున్నారు. వరికి మద్దతు ధర పెంచాలని రైతు సంఘాలు, రైతులు ప్రభుత్వాలను కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మద్దతు ధర పెరుగుతుందని ప్రతీ సంవత్సరం ఎదురు చూస్తున్న రైతుకు ప్రతీ సంవత్సరం నిరాశ తప్పడం లేదు. ఈ ఏడాది కూడా మద్దతు ధర క్వింటాకు 65 రూపాయలు పెంచి రైతులకు నిరాశ శమిగిల్చిందని రైతులు తెలియజేస్తున్నారు. ఆశించినస్థాయిలో మద్దతు ధర పెరగకపోవడంతో నిరాశతోనే రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆదాయానికి మించి ఖర్చు వరి క్వింటాకు సాగు వ్యయం రైతు లెక్క ప్రకారం గ్రేడ్–1 రకానికి రూ.2,500లు, సాధారణ రకానికి రూ.2,200 అవుతుంది. ప్రభుత్వం మాత్రం క్వింటాకు ఖర్చు రూ.1,208 అని లెక్కలు చెబుతుంది. ప్రభుత్వం పెంచిన అత్యధిక మద్దతు ధర రూ.1,835గా ఉంది. గతేడాది వరి సాధారణ రకం క్వింటాకు రూ.1,750 ఉండగా ఈ ఏడాది రూ.1,815కు పెరిగింది. మేలు రకం రూ.1,770 ఉండగా రూ.1,835కు చేరింది. దీంతో రైతు సాగు వ్యయం ప్రకారం చూసినా వరి పండించే రైతు సుమారు రూ.600 నష్టపోవాల్సి వస్తుంది. వరికి కనీస మద్దుతు ధర క్వింటాకు రూ.3000 ఉండాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం వద్ద మొర పెట్టుకుంటున్నారు. అవి ఏమీ పట్టనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతీసారి కంటితుడుపుగా మద్దతు ధర పెంచుతుందని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019–20వ సంవత్సరాకి వరి పంటకు క్వింటాకు రూ.65 పెంచింది. వరి పంట పండించే రైతులు కష్టాలు కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని నియోజకవర్గంలోని పలువురు రైతులు వాపోతున్నారు. సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని రైతులకు వరి పంటే ప్రధాన పంట. ప్రతీ సంవత్సరం వరి పండించడం వల్ల నష్టాలు చవిచూడడం జరుగుతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 45 వేల ఎకరాల్లో సుమారు 50 వేల మంది రైతులు వరి పంటను పండిస్తుంటారు. ప్రభుత్వాలు వ్యయం ప్రకారమైనా మద్దతు ధర పెంచాలని, దీనిపై కేంద్ర పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం వరి పంట సాగు చేయాలంటే రైతులు భయ పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కౌలుకు సాగు చేయడానికి కూడా కౌలు రైతులు ముందుకు రావడం లేదు. ఎకరా వరి సాగు చేయడానికి, నారు మడి తయారి, పొలం తయారి, నాట్లు వేయడం, ఎరువులు, కోతలు, నూర్పు చేయడం, కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం చేర్చే వరకు ఎకరానికి సుమారు రూ.25 వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు తెలుపుతున్నారు. సక్రమంగా దిగుబడి వస్తే రూ. 30 వేలకు పైగా ఆదాయం వస్తుందని రైతులు తెలుపుతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటనాశనం అయితే రైతులు కోలుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. కంటి తుడుపు చర్యే ప్రభుత్వం పెంచిన మద్దతు ధర కంటి తుడుపు చర్యగా ఉంది. వరి పంట సాగు చేయడానికి శ్రమతో పాటు కూలీల ఖర్చు, పెట్టుబడి కూడా ఎక్కువుగా అవసరం. ప్రభుత్వాలు రైతులకు లాభాలు వచ్చే స్థాయిలో మద్దతు ధర పెంచకపోవడం దారుణం. వరి పంట మద్దతు ధర పెంపుపై పునరాలోచించాలి. – యు.తిరుపతిరావు, రైతు, తాళభద్ర పున:సమీక్షించాలి వరి మద్దతు ధర విషయంలో ప్రభుత్వాలు పునఃసమీక్ష చేసుకోవాలి. మిగతా పంటల కంటే వరి పంట చేతికందే వరకు రైతు కష్టనష్టాలు ఎదుర్కోవడంతో పాటు, పెట్టుబడులు కూడా ఎక్కువుగా ఉంటాయి. వరి పంటకు మద్దతు ధర పెంచడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. – పల్లి సదానందం, రైతు, బుసాభద్ర -
గుండె మండిన రైతు
సాక్షి, వెంకటగిరి: రుతుపవనాలు గతి తప్పి ఇబ్బంది పెడుతున్నా.. రైతులు కాడి పడేయడం లేదు. అనుకూలంకాని పరిస్థితులకు ఎదురొడ్డి బాధ్యతగా పంట పండిస్తూనే ఉన్నారు. తీరా పంట చేతికొచ్చి అమ్ముదామనే సమయానికి ధర అమాంతం పడిపోతుంది. ఈ పరిస్థితే అన్నదాతల్ని రగిలిపోయేలా చేస్తోంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న గిట్టుబాటు ధరకు, ఉత్పత్తి వ్యయానికి ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. కనీసం ఆ ధర అయినా అన్ని పంటలకు దక్కుతుంగా అంటే లేదు. ఫలితంగా ఆర్థికంగా కుదేలవుతున్నారు. అప్పులు తీర్చలేక కుటుంబ భారం మోయలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న నియోజకవర్గంలోని కుటుంబాల్లో అధికశాతం మంది రైతు కుటుంబాలే. నియోజకవర్గంలో కండలేరు జలాశయం నుంచి తమ ప్రాంతాల గుండా చెన్నై, తిరుపతి పట్టణాలకు తాగునీరు నెపంతో పదుల సంఖ్య టీఎంసీల నీరును చిత్తూరు జిల్లా రైతులు ప్రతిఏటా చెరువులకు పెట్టుకుని పంటలు సాగుచేసుకుంటున్నారు, జిల్లాలోని డెల్టా ప్రాంత రైతులు రెండు పంటలకూ నీరు సంమృద్ధిగా లేకుంటే సోమశిల నుంచి కండలేరును చుక్కనీరు వదలరు. నాలుగేళ్లుగా ఒక్క పంటకూడా పెట్టుకోలేని మెట్టప్రాంత వెంకటగిరి నియోజకవర్గ రైతులకు ఏళ్లుగా మారని ఈ పరిస్థితులే వారిని సాగుజలాల కోసం రోడ్డెక్కిస్తున్నాయి. వెంకటగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగే ఎస్ఎస్ కెనాల్‌ను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నా.. అన్ని బాధలని పంటి బిగువన భరిస్తున్నారు ఈ ప్రాంత రైతులు. జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి అయినప్పటికీ ఈ ప్రాంతంలో సాగునీటి రంగం మెరుగు పరచడం, మద్దతు ధర అందించడంలో ఏ మార్పు లేకపోవడంతో గత ఐదేళ్లుగా నష్టాల పాలవుతున్నారు. రైతులకు అమలు చేయాల్సినవి ఎంఎస్ స్వామినాథన్ కమిచేసిన సిఫార్సులను అమలు చేస్తామని, పంట ఉత్పత్తి వ్యవయానికి 50 శాతం జోడించి మద్దతు ధర నిర్ణయిస్తామని రైతులకు పాలకులు ఇచ్చిన హమీని అమలు చేయాలి. గత నాలుగేళ్లుగా నామమాత్రంగా ప్రభుత్వం ఆహార ధాన్యాల మద్దతు ధర పెంచింది. మరికొంత సహకారం అందజేయాలి. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతుకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడానికి ప్రత్యేక హెల్త్‌కార్డు సదుపాయం కల్పించాలి. వ్యవసాయ ధరల కమిషనర్ (సీఏసీపీ) పంట ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసే విధానం సరిగా లేదని రైతులకు నష్టం చేసేలా ఉందని, స్వామినాథన్, రమేష్ చంద్ కమిటీలు చెప్పిన దాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి , అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీగా ఎకరాకు రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలన్న భూపేంద్రసింగ్ హుడా కమిటీ చేసిన సిఫార్సులను అమలుచేయాలి. ఇదీ సంక్షోభం భూమినే నమ్ముకున్న రైతులు బజారున పడడానికి బాధ్యులు ఎవరు? ఇది రాష్ట్రానికి క్షేమదాయకం కాదు. ఎన్నాళ్లనీ.. ఎన్నేళ్లనీ రైతులు తమ బాధలు దిగమింగుతూ బతకాలి? నాలుగేళ్లుగా రైతులకు పాలకులు ప్రకటించే రైతు రథం, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు వంటి పథకాలు తెలుగు తమ్ముళ్లకే పరమితమయ్యాయి. పంట వేసేందుకు సరైన విత్తనాలు అందించడం లేదు. ప్రకృతి ప్రకోపానికి గురైతే సాయం అందదు. బ్యాంకుల నుంచి రుణాలు అందక సాగు కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ఆరుగాలం కష్టించి బోరుబావుల కింద కొద్దో గొప్పో సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధరలు అందవు. కోతల సమయంలో 30 శాతం వరకూ తగ్గిపోతున్నాయి. సాగు ఖర్చులు, పురుగుమందులు, ఎరువుల ధరలు మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. 2016 నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో నాలుగేళ్లుగా కరువు తాండవిస్తుంది. వాతావరణ అననుకూలతతో పంటలు సాగుచేయడం తలకు మించిన భారంగా పరణమించింది. నియోజకవర్గంలో అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాల్లో 60 శాతం మందికి వ్యవసాయమే అధారం. టిడిపి అధినేత గత ఎన్నికల్లో రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హమీ ఇచ్చి గద్దెనెక్కారు. తొలి సంతకం రైతురుణమాఫీపై చేసి ఆపై కొర్రీలు పెట్టి ఎకరా భూమికి రూ.15000 వరకూ మాఫీ అంటూ కోతపెట్టడమే కాకుండా ఐదు విడతల్లో ఐదేళ్లపాటు ఇస్తానని చెప్పి ప్రతి ఏటా ఎకరాకు రూ 3000 వంతున మూడు దఫాలు చెల్లించారు. అయితే 4,5 విడతల రుణమాఫీ సొమ్ము ఇప్పటికీ రైతుల చేతికందలేదు. చాన్నాళ్ల తర్వాత రైతుల్లో ఆగ్రహాన్ని గమనించిన టిడిపి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఎన్నికల ముందు తీసుకొచ్చింది. అంతకు ముందే తెలంగాణలో ఈ పధకం ద్వారా అక్కడి తెరాస ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో రైతులే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపబోతున్నారని గ్రహించి 3,4 విడతల రుణమాఫీ సోమ్మును ఎన్నికలకు ముందుగానే జమ చేస్తానని వెంకటగిరి సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యం చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారు. వ్యవసాయంపై ఆయన ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ఎస్‌ఎస్‌కెనాల్ పూర్తిచేస్తామని ఎన్నికల సంధర్భంగా ఇచ్చిన హమీలు విస్మరించారు. దీనివల్ల వేలాది ఎకరాలు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. – మామిడి ప్రభాకర్, మార్లగుంట, డక్కిలి మండలం నీరందక సాగు ప్రశ్నార్థకం అయింది తెలుగుగంగ ద్వారా సాగునీరందక ఈ ఏడాది పంటలు వేయలేదు. మా గ్రామంలోనే సుమారు 250 ఎకరాలు బీడు భూములుగా మారాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే సాగునీటి ప్రాజెక్టర్లను అభివృద్ది చేస్తానని ప్రకటించడం ఆనందగా ఉంది. – కె రామిరెడ్డి, కుప్పంపల్లి, వెంకటగిరి మండలం జగన్‌తో మంచి రోజులు జలయజ్ఞం పేరిట సాగునీటి ప్రాజెక్ట్‌లు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వేలకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆయన హయాంలోనే ఎస్ఎస్ కెనాల్ నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసినా టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. జగన్‌తో మళ్లీ మంచిరోజులు వస్తాయని ఎదురు చూస్తున్నాం. – ఆవుల గిరియాదవ్, సిద్ధవరం, వెంకటగిరి మండలం వైఎస్సార్ హయాంలో సాగుకు స్వర్ణయుగం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా తెలుగుగంగ బ్రాంచి కాలువలు పూర్తి, మెట్టప్రాంతాలకు సాగునీరందించే సుమారు 350 కోట్లుతో నియోజకవర్గంలోని రాపూరు వద్ద ఎస్‌ఎస్‌కెనాల్ నిర్మాణ పనులకు శంకుస్దాపన చేశారు. ఆయన మరణం తరువాత వచ్చిన పాలకులు ఆ ప్రాజెక్ట్‌లను విస్మరించారు. – మేకల శ్రీనివాసులు, వెంకటగిరి రాజన్న ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే జలయజ్ఞం ద్వారా ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేసేవారు. తెలుగుగంగ బ్రాంచి కాలువలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేవారు. రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. – ఆర్ వీరరాఘవులు, వెంకటగిరి -
విత్తు.. చిత్తు
మెదక్‌జోన్ : పలు విత్తన కంపెనీలకు చెందిన ఏజెంట్లు ఇష్టారీతిగా రైతులతో విత్తనోత్పత్తి చేయిస్తున్నారు. కానీ ఆయా కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం లేదు. విత్తనాలను సాగు చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఒప్పందం సాగును చట్టబద్ధం చేస్తూ రైతులకు నష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల పర్యవేక్షణ కొరవడడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నూతన చట్టం ప్రకారం కంపెనీ లేదా వ్యక్తి రైతుతో పంటను పండించాలనుకుంటే మార్కెటింగ్‌శాఖ వద్ద లైసెన్స్ తీసుకోవాలి. పండించాలనుకున్న పంట విస్తీర్ణం రైతులతో చేసుకున్న ధరల ఒప్పందం వంటివన్నీ ప్రభుత్వ అధికారులకు నెల రోజుల్లోపు సమర్పించాలి. ప్రభుత్వ మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కొనకూడదు. పంట పండిన తరువాత ఒప్పందం ప్రకారం రైతుకు డబ్బులు చెల్లించాలి. రైతుల భూములపై ఆయా కంపెనీలకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఏవైనా వివాదాలు తలెత్తితే మార్కెటింగ్‌శాఖ సంచాలకుడికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. తద్వారా అధికారులు పరిశీలించి నెల రోజుల్లోపు సమస్యను పరిష్కరించాలి. రబీలో ఒప్పందసాగు అధికంగా ఉంది కాబట్టి కంపెనీలన్నీ ఒప్పంద లైసెన్స్ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు జిల్లాలో పెద్ద ఎత్తున విత్తన పంటలు వేసినా ఎవరూ ఒప్పందం చేసుకోలేదు. దీంతో రైతులకు చట్టంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. చాలాకాలంగా సాగు.. మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట, రామాయంపేట, వెల్దుర్తి, మెదక్, హవేలిఘణాపూర్, చేగుంట, నార్సింగ్‌తోపాటు పలు మండలాల్లో విత్తన కంపెనీదారులు చాలా కాలంగా రైతులతో విత్తనాలను ఉత్పత్తి చేయించి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వరి పంటల రకాలను అధికంగా సాగు చేస్తున్నారు. విత్తనోత్పత్తి ద్వారా ఎకరాకు రూ. 8 నుండి రూ. 10 వేల వరకు అదనపు ఆదాయం వస్తుండడంతో రైతులు కూడా విత్తనోత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో హైబ్రిడ్ వరితోపాటు టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గం, పెద్దశంకంపేట తదితర మండలాల్లో పత్తి, మొక్కజొన్నలాంటి విత్తనాలను సాగు చేయిస్తున్నారు. విత్తనోత్పత్తి సాగు సమయంలో వాతావరణం అనుకూలించకపోతే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ క్రమంలో రైతుతో ముందుగా కంపెనీ యజమాని ఒప్పందం చేసుకున్న ప్రకారం డబ్బులను చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా సదరు కంపెనీలు రైతులకు డబ్బులు తక్కువగా చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల మాయాజాలం.. విత్తనోత్పత్తి విషయంలో వివిధ కంపెనీల ఏజెంట్లు రైతులతో ఒప్పందం చేసుకున్న విధంగా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. 2013వ సంవత్సరంలో చేగుంట మండలంలోని మాసాయిపేటలో ఓ రైతు ఐదు ఎకరాల పొలంలో వరి విత్తన రకాన్ని సదరు కంపెనీ యజమాని సూచన మేరకు సాగు చేశాడు. కానీ వాతావరణ మార్పులతో పంటకు తెగులు సోకింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో విత్తన కంపెనీ ఏజెంట్ పత్తాలేకుండా పోవడంతో బాధిత రైతు నెత్తీనోరు బాదుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. అయినా రాతపూర్వకంగా ఎలాంటి ఒప్పంద పత్రం లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తివేశారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. వెయ్యి ఎకరాల్లో సాగు.. జిల్లావ్యాప్తంగా 20 వేల హెక్టార్లలో సాధారణ వరి పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18 వేల హెక్టార్లలో సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా విత్తన కంపెనీదారులు సుమారు 1000 ఎకరాల్లో వరి విత్తనాలను సాగు చేయించినట్లు తెలిసింది. ఒప్పంద పత్రం రాసుకుని సాగు చేయిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. పాటించాల్సిన నిబంధనలు... విత్తనోత్పత్తి చేసే కంపెనీలు రైతుతో సాగు చేయించే విత్తనాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. విత్తిన తరువాత రైతుల పొలాలను ఎన్నిసార్లు పరిశీలించారు. పంట చేతికందే సమయంలో నిబంధనలు పాటించడంతోపాటు ఎప్పటికప్పుడు విత్తనాల నమూనా పరీక్షలు చేసి ప్యాకింగ్ వరకు సంబంధిత అధికారులు పర్యవేక్షించి సీడ్ సర్టిఫికెట్ ట్యాగ్ లేబుల్, సీళ్లను ఇస్తారు. అధికారుల పర్యవేక్షణ లేకపోతే మోసగాళ్లకు ఆడిందే ఆటగా మారుతుంది. ఈ క్రమంలో రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలి.. కంపెనీలు రైతులతో విత్తనోత్పత్తి చేయాలనుకుంటే ముందుగానే బాండ్ పేపర్‌పై రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా లేదా మరేమైనా కారణాలతో పంటలు నష్టపోయిన సందర్భాల్లో ఒప్పందం మేరకు రైతుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేనట్లయితే సదరు కంపెనీలపై కేసు వేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ప్రతీ కంపెనీదారుడు తప్పని సరిగా నిబంధనల ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి.– జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం -
అన్నదాతకు ‘మద్దతు’ ఏదీ?
తెనాలిటౌన్, న్యూస్‌లైన్: తుపానులు, తెగుళ్ల బారి నుంచి తప్పించుకున్న వరి రైతులు మార్కెట్లో ధాన్యానికి ధర లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు. ఖరీఫ్ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా లేక రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఫ్రభుత్వం 75 కిలోల ధాన్యం బస్తాకు ప్రకటించిన మద్దుతు ధర రూ.1150లు కూడా దక్కేలా లేదు. ఖరీఫ్ సీజన్లో సంభవించిన హెలెన్ తుపాను దాటికి నేలకొరిగి, నీట మునిగిన వరి పంటను ఒబ్బిడి చేసుకున్న రైతులు యంత్రాల సాయంతో నూర్పిళ్లు చేశారు. తీరా ధాన్యం ఇంటికి చేరేసరికి ధర లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం బస్తా రూ.1275-1300 మించి ధర పలకడం లేదు. అయితే ధాన్యం తడిసిందనే సాకు చూపుతూ వ్యాపారులు రైతులతో బేరమాడుతున్నారు. రూ.900-1000కి మించి ధర చెల్లించలేమని చెబుతున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 5.71 లక్షల ఎకరాల్లో అధిక సంఖ్యలో రైతులు బీపీటీ 5204 రకం వరి సాగు చేశారు. గుంటూరు జిల్లాలో 4.91 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలో 80 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇక తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్లో 93,750 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత ఏడాది నవంబర్ 21,22 తేదీల్లో వచ్చిన హెలెన్ తుపాను ధాటికి డివిజన్లో 50 వేల ఎకరాలు, జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. పంట దెబ్బతినడంతో తడిసిని ధాన్యం కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. నూర్పిళ్ల అనంతరం ఎకరాకు 20-25 బస్తాలకు మించి దిగుబడి రావటం లేదని రైతులు చెబుతున్నారు. కొల్లిపరలో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేసిన రైతు చెంచాల రామిరెడ్డి ఎకరాకు కేవలం 20 బస్తాలే చేతికొచ్చాయని చెప్పారు. 20 బస్తాల చొప్పున కౌలుకు తీసుకున్న రైతు వుయ్యూరు వేమారెడ్డి తన పొలంలో వచ్చిన దిగుబడి కౌలు చెల్లించేందుకు సరిపోయిందన్నారు. చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. తుపాను కారణంగా సగటున ఎకరాకు 7-8 బస్తాల ధాన్యాన్ని కోల్పోయారు. మద్దతు ధర కరువు.. చేతికొచ్చిన ధాన్యానికి మార్కెట్లో మద్దతు ధర కరువైంది. 75 కిలోల బస్తాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1150 వుం డగా, తడిసి నాణ్యత తగ్గిందన్న సాకుతో రూ.900-1000 లకు వ్యాపారులు అడుగుతున్నారు. ఇంటికొచ్చిన ధాన్యాన్ని అమ్మితే కౌల ు చెల్లింపులకే సరిపోతోంది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు అలాగే ఉండిపోతున్నాయి. సొంత భూమి కలిగిన రైతులకు వచ్చిన దిగుబడులు పెట్టుబడి ఖర్చులకు సరిపోతుందని చెబుతున్నారు. పంట తడిసిన కారణంగా వరిగడ్డి దెబ్బతిని అటు పశుగ్రాసానికీ ఇబ్బంది ఏర్పడే ఆస్కారముంది. కౌలు కూడా రాలేదు... మూడు ఎకరాలు కౌలుకు చేశాను. దోమ పోటు వల్ల కొంత, వర్షం వల్ల మరి కొంతపంట దెబ్బతింది. ఎకరాకు 20 బస్తాలు మాత్రమే చేతికి వచ్చాయి. 21 బస్తాలకు కౌలుకు తీసుకున్నా. - ఔతు బసివిరెడ్డి, కౌలు రైతు, కొల్లిపర మద్ధతు ధర ఇవ్వాలి రెండు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. ఎకరానికి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. గత ఏడాది ఎకరానికి 38 బస్తాలు దిగు బడులు వచ్చాయి. ఈ ఏడాది ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వం బస్తాకు రూ.1800లు మద్దతు ధర ప్రకటించాలి. - ఉప్పాల పెద్ద శివయ్య, కౌలు రైతు, కొల్లిపర -
ఎలా బతకాలి..!
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: అరకొర దిగుబడితో వరి రైతులు అల్లాడిపోతున్నారు. ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేసినా కనీసం రెండు పుట్లు కూడా ధాన్యం పండక పోవడంతో అప్పులపాలవుతున్నారు. ఇలాగైతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో వందల ఎకరాల్లో వరి(జగిత్యాల) సాగు చేస్తున్నారు. కొందరు భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరాకు 4-5 పుట్లు పండితే కానీ రైతుకు పెట్టుబడి రాదు. ఎకరాకు రూ.20 వేల ఖర్చుపెట్టినా ఎర్ర తెగులు ఆశించడంతో 15 రోజులకోసారి 5 సార్లు మందులు కొట్టాల్సి వస్తోంది. దీంతో ఖర్చు మరింత పెరిగింది. రైతు కుటుంబ సభ్యులే పనులు చేసుకుంటున్నా కూలీల అవసరం తప్పడంలేదు. మందులు కొట్టేందుకు, నాట్లు వేసేందుకు రోజుకు రూ.150 ఇవ్వాల్సి వ స్తోందని వాపోతున్నారు. మరోవైపు పంట దిగుబడి బాగా వచ్చిందనుకుంటే వడ్లల్లో బియ్యం గింజలు లేక పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 14 బస్తాల దిగుబడి రావడంతో కనీసం ఖర్చులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి రైతులకు ఏర్పడింది. అయినా ఏ అధికారి కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోలేకపోయిందని అన్నదాతలుఆరోపిస్తున్నారు. పుట్టి వడ్లను గత ఏడాది రూ.6,800లకు విక్రయించగా ఈ ఏడాది ధర మరింత పడిపోయిందని వాపోతున్నారు. పొలాలను పరిశీలించిన అగ్రికల్చరల్ జాయింట్ డైరక్టర్ జయచంద్ర రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. గిట్టుబాటు ధర లేదు..పంట దిగుబడి లేదు ఏడేళ్లుగా మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. నా భర్త సుబ్బరాయుడు, నేను, కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేస్తున్నాం. ఎకరాకు రూ.22వేలుపైగానే ఖర్చయింది. ఈ ఏడాది ఎర్రతెగులు సోకడంతో నాలుగైదు సార్లు మందులు కొట్టాల్సి వచ్చింది. ఎకరాకు 5 పుట్లు పండితే ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం ఖర్చులు పోను కూళ్లు గిట్టుబాటు అవుతాయి. కౌలు చెల్లించడం కూడా ప్రస్తుత పరిస్థితిలో భారమైంది. ఎకరాకు 1040 కిలోల వడ్లు దిగుబడి వచ్చాయి. ఈ లెక్కన కనీసం రెండు పుట్లు కూడా దిగుబడి రాలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.