
ఉష
ఖమ్మం, వైరా: సాధారణంగా గుండె ఎడమ చేతి వైపు ఛాతి భాగంలో ఉంటుంది. కానీ.. వైరాలోని ఓ మహిళ కు కుడి వైపున గుండె ఉంది. వైరా సంత బజార్‌కు చెందిన బాసాటి ఆనంద్, ఉష దంపతులకు పెళ్లయి ఐదేళ్లయింది. పిల్లలు కలగకపోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మంగళవారం పరీక్షల నిమిత్తం వెళ్లారు. అక్కడ ఆమెకు స్కానింగ్ చేసిన సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఎడమ వైపున ఉండాల్సిన గుండె కుడి వైపున ఉన్నట్లు గుర్తించారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు.