వైరా : ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో మతిస్థిమితం లేని ఓ బాలుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయ్ (15) అనే బాలుడికి మతిస్థిమితం సరిగా లేదు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా, తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులకు ఇతడు ఒక్కడే సంతానం.