
రామకృష్ణను ఆసుపత్రికి తరలిస్తోన్న పోలీసులు
వైరారూరల్: మండలంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన సట్టి రామకృష్ణ, బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై తాండ్ర నరేష్ తెలిపిన వివరాలు.. తనను రామకృష్ణ వేధిస్తున్నాడంటూ రెబ్బవరం గ్రామస్తురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇందులో భాగంగా అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అతడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనతోపాటు తెచ్చుకున్న పురుగు మందును తాగాడు. పోలీసులు గమనించి, వెంటనే వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.