ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య | BJP Leader Nelavelli Ramarao Attacked by Unknown Persons In Wyra | Sakshi
Sakshi News home page

వైరాలో బీజేపీ నేతపై కత్తులతో దాడి

Published Sat, Dec 26 2020 9:33 AM | Last Updated on Sat, Dec 26 2020 11:55 AM

BJP Leader Nelavelli Ramarao Attacked by Unknown Persons In Wyra - Sakshi

సాక్షి, వైరా: ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ నేత నేలవెల్లి రామారావు దారుణ హత్యకు గురయ్యారు. బీజేపీ ఆర్టీఐ సెల్ కన్వీనర్ రామరావు నివాసానికి శనివారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్స్ ధరించి బైక్‌పై వచ్చారు. ఇంట్లోకి చోరబడి అయిదు నిమిషాల వ్యవధిలోనే ఆయనపై కత్తులతో అతి దారుణంగా దాడి చేశారు. ఇంట్లో ఉన్న రామరావు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దాడి చేసిన వెంటనే నిందితులు బైక్‌పై పారిపోయారు. 

దాడిలో తీవ్రంగా గాయపడిన రామరావును కుటుంబ సభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే రామరావు హత్యకు ఆర్థిక లావాదేవిలే కారణంగా తెలుస్తుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రామరావు మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ కోనసాగుతుంది. అటు జిల్లా బీజేపీ నేతలు సైతం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు రామరావు హత్య వెనుక రాజకీయ కోణం కూడ ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు  మాడపాటి రాజేశ్‌ మధిర కోర్టులో లొంగిపోయాడు.

ప్రధాన నిందితుడు రాజేశ్‌ (ఫైల్‌ ఫోటో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement