నిశ్చితార్థం జరిగాక పెళ్లికి నో చెప్పాడు | One held for rejected marriage after engagement | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం జరిగాక పెళ్లికి నో చెప్పాడు

Published Sun, Jan 10 2016 1:45 PM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

One held for rejected marriage after engagement

వైరా (ఖమ్మం జిల్లా) : నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి నిరాకరించినందుకు ఓ యువకుడిపై ఆదివారం వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. కొణిజర్ల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడికి కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ యువతితో ఈ నెల 3న నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచి పెళ్లి ఇష్టం లేదని మొండికేశాడు.

కారణమేమిటని అడిగితే.. తాను వేరొక యువతిని ప్రేమించినట్లు తెలిపాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియజేయగా.. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎలా రద్దు చేసుకుంటారని వారు వైరా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడితోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement