న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంతో వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ బాధితులు పెగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కొత్త వేరియంట్‌పై అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను అలెర్ట్ చేశాయి. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్న విదేశాల నుంచి వస్తున్న వారిలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో అధికశాతం విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.
తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య సెంచరీని దాటేసింది. ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లో 101 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో అనవసర ప్రయాణాలు, సామూహిక సమావేశాలకు దూరంగా ఉండాలని తెలిపింది. మరోవైపు డెల్టా వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగే డెల్టా వేరియంట్‌ను ఓమిక్రాన్ అధిగమించే అవకాశం ఉందని తెలిపింది.
చదవండి: తమిళనాడు: పాఠశాలలో గోడ కూలి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
గుబులు పుట్టిస్తున్న ఒమిక్రాన్
ఢిల్లీలో శుక్రవారం పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య 20కు చేరినట్లు డిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. 20 మందిలో 10 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలో శుక్రవారం కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య తొమ్మిదికి పెరిగినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు.
చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మళ్లీ ఆంక్షలు
Comments
Please login to add a commentAdd a comment