న్యూఢిల్లీ : ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్‌లోనూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1000కి సమీపిస్తోంది. తాజాగా కేసులతో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 961కి చేరింది. వీరిలో 320 మంది కోలుకున్నారు. అత్యధికంగా 263 కేసులతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. 252 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. మొత్తం 22 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఈ వేరియంట్ పాకింది.
భారీగా పెరిగిన కోవిడ్ కేసులు
అదే విధంగా భారత్‌లో కరోనా వైరస్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. గత కొంత కాలంగా రోజువారీ కేసులు 10వేలకు దిగువన నమోదవుతుండగా.. నిన్న ఒక్కరోజే 13 వేల కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 13,154 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం వెల్లడించింది. ఈ సంఖ్య ముందు రోజు కంటే 43శాతం అధికంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం 82,402 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకు 3.48 కోట్ల మంది వైరస్ బారిన పడగా.. రికవరీలు 3.42 కోట్లకు చేరాయి.
చదవండి: వామ్మో.. చుక్క పడకపోతే ఎలా... కరోనా టీకా వద్దంటే వద్దు..
Comments
Please login to add a commentAdd a comment