బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బారినపడిన మొదటి ఇద్దరిలో ఒకరైన బెంగళరు వైద్యుడి(46)కి మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. ఆ వైద్యుడికి మొదటగా నవంబర్ 22న కరోనా పాజిటివ్‌గా తేలింది. నిర్థారణ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలడంతో మూడు రోజులపాటు ఇంట్లోనే గడిపారు. అనంతరం అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మరోసారి ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు చేశారు.
(చదవండి: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. లాక్‌డౌన్ తప్పదా..?)
ఈ పరీక్షల్లో ఆయనకు మళ్లీ కరోనా సోకినట్లు తేలిందని బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. వారం తర్వాత ఆయనకు మరోసారి ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కోవిషీల్డ్ టీకా రెండు డోసులు ఆయన తీసుకున్నప్పటికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని చెప్పారు. దేశంలోనే ఒమిక్రాన్ రెండో బాధితుడైన దక్షిణాఫ్రికా వాసి(66) ఫైవ్‌స్టార్ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటనే నిబంధనలకు విరుద్ధంగా అధికారుల కళ్లుగప్పి దుబాయ్‌కి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment