Omicron Variant Updates In Telugu టోక్యో: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించిన కేసులు మరో 8 నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో మొత్తం 12 కేసులకు పెరిగనట్లు ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు తెల్పింది. నవంబర్ చివరి నుంచి ఈ నెల ప్రారంభం వరకు వచ్చిన ప్రయాణికులకు ఈ వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెప్పింది. కాగా జపాన్‌లో నవంబర్ 30న మొదటి కేసు నమోదైన సంగతి తెలిసిందే.
కొత్తగా వైరస్ సోకిన వారిలో 30 ఏళ్ల మహిళ, పురుషుడు కూడా ఉన్నారని చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ సీజీ కిహారా తెలిపారు. వీరిద్దరూ నవంబర్ 28న నమీబియా నుంచి వచ్చారు. అదే విమానంలో జపాన్‌కు వచ్చిన నమీబియా దౌత్యవేత్తలకు కూడా వ్యాధి సోకినట్లు గుర్తించారు. జపాన్‌లో ఓమిక్రాన్ ఇన్‌ఫెక్షన్‌కు గురైన మొదటి కేసు ఇది. దీంతో జపాన్ మరోసారి విదేశీ ప్రయాణాల పట్ల కఠినంగా వ్యవహరించక తప్పలేదు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే ప్రయాణాకులపై జపాన్ నిషేధం విధించింది. కొత్తగా ఒమిక్రాన్ బారీనపడ్డ వ్యక్తులు ఈ వారం ప్రారంభంలో యుఎస్, మొజాంబిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దక్షిణ కొరియాలో గణనీయంగా నమోదవుతున్న కరోనా కేసులు
దక్షిణ కొరియాలో కరోనా కొత్త కేసులు శుక్రవారం కూడా వరుసగా మూడవ రోజు 7000 కంటే ఎక్కువ నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని త్వరగా తగ్గించడంలో విఫలమైతే దేశం అసాధారణమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని ప్రధాని కిమ్ బూ-క్యుమ్ ఒక సమావేశంలో అన్నారు. కోవిడ్ చికిత్స కోసం మరో రెండు వేల పడకలను సంయుక్తంగా ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చాలామటుకు మైనర్ కేసులకు ఇంట్లోనే చికిత్స చేసేలా మెడికల్ రెస్పాన్స్ విధానాన్ని మెరుగుపరిచామని తెలిపారు.
చదవండి: బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు!
Comments
Please login to add a commentAdd a comment