South korea
-
అమెరికా ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు
సియోల్ : అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఉత్తర కొరియా ఒకదాని తర్వాత ఒకటిగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. తూర్పు సముద్రం వైపు పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.అయితే ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనేది దక్షిణ కొరియా సైన్యం తెలియజేయలేదు. కాగా క్షిపణులు ఇప్పటికే సముద్రంలో పడిపోయాయని భావిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొద్ది రోజుల క్రితం కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఆ దేశం ఇప్పటివరకు పరీక్షించిన క్షిపణుల కంటే బాలిస్టిక్ క్షిపణి ఎంతో శక్తివంతమైనది. ఈ క్షిపణి ద్వారా అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని ఉత్తర కొరియా గతంలో పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా యూఎస్ఏ తాజాగా దక్షిణ కొరియా, జపాన్‌లతో కలసి దీర్ఘ శ్రేణి బీ-వన్ బీ బాంబర్లను ప్రయోగించింది.ఉత్తర కొరియాకు చెందిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ)ఈ క్షిపణిని 'హ్వాసాంగ్-19' ఐసీబీఎంగా పేర్కొంది. దీనిని ప్రపంచంలోని బలమైన వ్యూహాత్మక క్షిపణి అని పేర్కొంది. ఈ క్షిపణి పరీక్షను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారని, ఉత్తర కొరియాకు చెందిన విశిష్ట వ్యూహాత్మక అణు దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారని కేసీఎన్ఏ పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉత్తర కొరియా జరిగిపిన క్షిపణుల ప్రయోగాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో కిమ్‌తో భేటీ అయ్యారు. ఇది కూడా చదవండి: అన్ని ప్రైవేటు ఆస్తులు ప్రభుత్వానివి కావు: సుప్రీం కీలక తీర్పు -
షావోమీ నుంచి అదిరిపోయే మడత ఫోన్, శాంసంగ్‌కు దెబ్బే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఆగస్ట్ 11న (గురువారం) సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ (మడత ఫోన్) ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. 'షావోమీ మిక్స్ ఫోల్డ్2' పేరుతో గతంలోనే విడుదల కావాల్సి ఉండుగా..కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తుంది. ఈ తరుణంలో గురవారం ఫోల్డబుల్ ఫోన్‌ను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు షావోమీ ప్రతినిధులు తెలిపారు. గత కొన్నేళ్లుగా శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో సత్తా చాటుతుంది. కానీ మిక్స్ ఫోల్డ్ 2తో ఈక్వేషన్ త్వరగా మారే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కంటే షావోమీ ఫోన్ ధర తక్కువ ఉంటే ►షావోమీ సైతం శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ తరహాలో ఈ మిక్స్ ఫోన్2 ఫోన్లో ఆల్ట్రా థిన్ స్క్రీన్‌తో వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హై రిఫ్రెష్ రేట్‌తో ఈ ఫోన్ స్క్రీన్లు యూజర్లను అట్రాక్ట్ చేయనున్నాయి. ►ఫ్లాగ్ షిప్ వెర్షన్ కాపోయినప్పటికీ పవర్ ఫుల్ హార్డవేర్ యూనిట్‌గా పేరొందిన స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 1 చిప్ సెట్‌తో రానుంది. ►షావోమీ ఫోల్డబుల్ ఫోన్ స్లీక్ డైమన్షన్ (పాలిష్డ్ స్మూత్ గ్లాస్)తో హైక్వాలిటీ డిస్ప్లే ఉందని షావోమీ విడుదల చేసిన ఫోన్ టీజర్‌ను చూస్తే అర్ధం అవుతుంది. ►ఆగస్టు 10న (నేడు) శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్4ని ఆవిష్కరించనుంది. రేపు షావోమీ మిక్స్ ఫోల్డ్ 2ని విడుదల చేస్తుండడం ఈ ఫోన్ మరి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ►దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ 4జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తుంది. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్ విభాగంలో మార్కెట్‌ను శాసిస్తున్న శాంసంగ్‌కు పోటీగా ఒప్పో, షావోమీలు ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. చదవండి👉 వన్‌ఫ్లస్ నుంచి మడత ఫోన్.. త్రీ ఫోల్డ్స్, ఇక గెలాక్సీకి గట్టి పోటీనే! -
నార్త్ కొరియా కిమ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. తగ్గేదేలే అంటున్న కొత్త అధ్యక్షుడు
సియోల్: దక్షిణ కొరియాలో అధ్యక్షుడి ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఈ ఎన్నికల్లో సౌత్ కొరియాకు పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్ యోల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పోరులో అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యూంగ్ ఓటమిని అంగీకరించారు. ఈ సందర్భంగా యూన్ సుక్ మాట్లాడుతూ.. మే నెలలో తాను పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిపారు. అనంతరం తన విదేశాంగ విధానం గురించి వెల్లడిస్తూ అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా కవ్వింపులను సమర్థంగా ఎదుర్కొంటామని కిమ్‌కు వార్నింగ్ ఇచ్చారు. ప్రజల భద్రత, దేశ సార్వభౌమాధికార రక్షణ కోసం శక్తిమంతమైన సైన్యాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌పై ఆయన షాకింగ్ ఆరోపణలు చేశారు. చైనా, ఉత్తర కొరియావైపు మూన్ జే ఇన్ మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. ఎన్నికల్లో విజయం సాధించిన సుక్ యోల్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సుక్యోల్కు బైడెన్ శుభాకాంక్షలు చెప్పినట్టు తెలిపింది. -
జపాన్‌లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..!
Omicron Variant Updates In Telugu టోక్యో: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించిన కేసులు మరో 8 నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో మొత్తం 12 కేసులకు పెరిగనట్లు ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు తెల్పింది. నవంబర్ చివరి నుంచి ఈ నెల ప్రారంభం వరకు వచ్చిన ప్రయాణికులకు ఈ వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెప్పింది. కాగా జపాన్‌లో నవంబర్ 30న మొదటి కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొత్తగా వైరస్ సోకిన వారిలో 30 ఏళ్ల మహిళ, పురుషుడు కూడా ఉన్నారని చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ సీజీ కిహారా తెలిపారు. వీరిద్దరూ నవంబర్ 28న నమీబియా నుంచి వచ్చారు. అదే విమానంలో జపాన్‌కు వచ్చిన నమీబియా దౌత్యవేత్తలకు కూడా వ్యాధి సోకినట్లు గుర్తించారు. జపాన్‌లో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్కు గురైన మొదటి కేసు ఇది. దీంతో జపాన్ మరోసారి విదేశీ ప్రయాణాల పట్ల కఠినంగా వ్యవహరించక తప్పలేదు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే ప్రయాణాకులపై జపాన్ నిషేధం విధించింది. కొత్తగా ఒమిక్రాన్ బారీనపడ్డ వ్యక్తులు ఈ వారం ప్రారంభంలో యుఎస్, మొజాంబిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియాలో గణనీయంగా నమోదవుతున్న కరోనా కేసులు దక్షిణ కొరియాలో కరోనా కొత్త కేసులు శుక్రవారం కూడా వరుసగా మూడవ రోజు 7000 కంటే ఎక్కువ నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని త్వరగా తగ్గించడంలో విఫలమైతే దేశం అసాధారణమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని ప్రధాని కిమ్ బూ-క్యుమ్ ఒక సమావేశంలో అన్నారు. కోవిడ్ చికిత్స కోసం మరో రెండు వేల పడకలను సంయుక్తంగా ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చాలామటుకు మైనర్ కేసులకు ఇంట్లోనే చికిత్స చేసేలా మెడికల్ రెస్పాన్స్ విధానాన్ని మెరుగుపరిచామని తెలిపారు. చదవండి: బూస్టర్ డోస్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు! -
BWF World Tour Final: ఫైనల్లో ఓడిన పీవీ సింధు..
PV Sindhu Loses Women Singles Title Clash BWF World Tour Finals: ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి చెందింది. సౌత్ కొరియాకు చెందిన యాన్ సియాంగ్ చేతిలో 21-16,21-12 తేడాతో ఓటమి పాలైంది. సింధు మొదటి గేమ్‌ను 16-21 కోల్పోయింది. సింధు మొదటి గేమ్ చివరి దశలలో పోరాడినప్పటికీ, దక్షిణ కొరియా స్టార్ యాన్ సియాంగ్ అవకాశం ఇవ్వలేదు. ఇక రెండువ గేమ్‌లో సింధుకు సియాంగ్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కాగా ఫైనల్స్‌లో ఓడిన సింధు సిల్వర్ మెడల్ సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సింధు 21-15 15-21 21-19 తేడాతో జపాన్‌కు చెందిన అకానె యమగుచిని ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్ టైటిల్‌ను చివరగా 2018లో కైవసం చేసుకుంది. చదవండి:Ind Vs Nz 2nd Test: ఫోర్ కొట్టిన గిల్.. సచిన్ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే! -
Kia India New Logo: సరికొత్తగా కియా ఇండియా బ్రాండ్
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్‌లో కొత్త బ్రాండింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్తగా రూపొందించిన లోగో, బ్రాండ్ స్లోగన్‌ను ఆవిష్కరించింది. కేవలం కార్ల తయారీకే పరిమితం కాకుండా పర్యావరణ అనుకూలమైన అధునాతన వాహనాల సంస్థగా కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు ఇది తోడ్పడగలదని కంపెనీ పేర్కొంది. కొత్త లోగో సెల్టోస్, సోనెట్ వాహనాలను మే తొలి వారంలో ఆవిష్కరించనున్నట్లు కియా ఇండియా ఎండీ కూక్యున్ షిమ్ తెలిపారు. ప్రధాన కార్యాలయం ఉన్న దక్షిణ కొరియా వెలుపల తాము కొత్త బ్రాండింగ్‌కి మారిన తొలి దేశం భారత్ అని ఆయన వివరించారు. తాజా వ్యూహంలో భాగంగా తమ సేల్స్ నెట్‌వర్క్‌ను 218 నగరాల్లో (తృతీయ, చతుర్థ శ్రేణి పట్టణాలతో పాటు) 360 టచ్ పాయింట్లకు విస్తరించుకోనున్నట్లు షిమ్ వివరించారు. కియాకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 3 లక్షల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కార్ల ప్లాంటు ఉంది. Join in to experience the inspirational journey of Kia's bold transformation live #MovementThatInspires https://t.co/JrmNKyNfvP — Kia India (@KiaMotorsIN) April 27, 2021 చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! -
అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా?
సియోల్: ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు 5జీ వచ్చేస్తుంది. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీలైనంత త్వరగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే 5జీ ఇంటర్ నెట్ దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది. తాజాగా తెలిసిన నివేదికల ప్రకారం అక్కడ 5జీ వినియోగం రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. 2020 రెండో అర్ధ భాగంలో ఎస్కె టెలికాం, కెటి కార్ప్, ఎల్జి అప్లస్ కార్ప్ నెట్వర్క్ యొక్క 5జీ హై-స్పీడ్ ఇంటర్నెట్ డౌన్లోడ్ వేగం 690.47 ఎంబిపిఎస్ గా ఉంది. అదే తొలి ఆరు నెలల కాలంలో డౌన్లోడ్ వేగం 33.91 ఎంబీపీఎస్‌గా నమోదవగా.. ఆ వేగం ఇప్పుడు ఇరవై రెట్లకు పైగా పెరిగింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్, ఐసీటీ గణాంకాలు వెల్లడించాయి.(చదవండి: 5జీ మొబైల్స్ సందడి షురూ) ఆ దేశంలోని మూడు ప్రధాన మొబైల్ నెట్ వర్క్ లైన ఎస్కె టెలికాం 5జీ ఇంటర్ నెట్ డౌన్లోడ్ వేగం 795.57 ఎమ్‌బిపిఎస్, కెటి 667.48 ఎమ్‌బిపిఎస్, ఎల్జి అప్లస్ 608.49 ఎమ్‌బిపిఎస్ వద్ద ఉన్నాయి. అలాగే ఆ దేశంలో 4జీ ఎల్‌టిఇ డౌన్లోడ్ వేగం 153.1 ఎమ్‌బిపిఎస్‌గా ఉంది. 4జీ ఎల్‌టిఇ వేగం కంటే 5జీ ఇంటర్ నెట్ స్పీడ్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అక్కడి యోన్హాప్ వార్తా సంస్థ నివేదించింది. గత ఏడాది ఏప్రిల్‌లోనే 5జీని మొట్టమొదటి సారిగా కమర్షయలైజ్ చేసిన దేశం దక్షిణ కొరియానే. అలాగే అక్టోబర్ చివరి నాటికి దాదాపు 10 మిలియన్ల 5జీ యూజర్ నెట్ వర్క్ ను త్వరగా నిర్మించింది. దక్షిణ కొరియా దేశంలోని మొత్తం 70 మిలియన్ల మొబైల్ చందాదారుల వాటాలో 14 శాతం 5జీ చందాదారులే.(చదవండి: షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్ ఇదే..!) అయితే, మొదట్లో సాంకేతిక లోపం, లిమిటెడ్ కవరేజ్, క్వాలిటీ సమస్యలు, తక్కువ ఇంటర్ నెట్ స్పీడ్ 4జీ కంటే తక్కువగా ఉండటంతో మొదట్లో వినియోగదారులు ఎవరు ఆసక్తి చూపలేదు. అయితే ఈ సమస్యలన్నింటిని అక్కడి ప్రభుత్వ సహాయంతో టెలికాం నెట్ వర్క్ లు పరిష్కారించాయి. దింతో అక్కడి 5జీ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయింది. 2022 నాటికల్లా దేశవ్యాప్తంగా 5జీ కవరేజీని అందించాలని లక్ష్యంగా దక్షిణ కొరియా పెట్టుకుంది. దీనికోసం అక్కడి ప్రముఖ టెలీకాం సంస్థలు 5జీ నెట్వర్క్ కోసం 25.7ట్రిలియన్ (24 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. భారత్‌లో కూడా ఈ ఏడాది రెండో అర్ధభాగంలో 5జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. -
దక్షిణ కొరియాకు షాక్.. భారీగా కేసులు
సియోల్: కరోనా మహమ్మారిని సమర్థవంతంగా కట్టడి చేసినట్లు వెల్లడించిన దక్షిణ కొరియాలో తాజాగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసులు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సియోల్ ప్రాంతంలో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సగం జనాభా అనగా సుమారు 51 మిలియన్ల మంది ఇక్కడే నివసిస్తున్నారు. శనివారం ఇక్కడ 166 కొత్త కరోనా కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 11 నుంచి చూస్తే.. ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. శుక్రవారం 103 కేసులు వెలుగు చూశాయి. వరుసగా రెండు రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 100 దాటడంతో జనాలు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త కేసులలో 11 మినహా మిగిలినవి లోకల్ ట్రాన్స్మిషన్ వల్ల సంక్రమించాయని.. అవి కూడా చాలావరకు సియోల్ ప్రాంతంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. (కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..) దక్షిణ కొరియాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం ప్రకటించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో 15,039 కేసులు నమోదు కాగా 305 కరోనా మరణాలు సంభవించాయి. కొత్తగా వెలుగు చూసిన కేసులలో 155 స్థానికంగా నమోదయ్యాయన్నారు అధికారులు. ఇవన్ని కూడా ఎక్కువ జనసాంద్రత కల్గిన సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే నమోదయ్యయని తెలిపారు. ఈ ప్రాంతంలో వేలాది చర్చిలను మూసివేయలేదు. దాంతో వైరస్ వ్యాప్తికి ఇవి కేంద్రాలుగా నిలిచాయి. చర్చి నిర్వహకులు కరోనా నివారణ చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యారంటున్నారు అధికారులు. ఆరాధకులు మాస్క్ తీసేసి ప్రార్థనల్లో పాల్గొనడమే కాక.. పాటలు పాడే సమయంలో, భోజన సమయంలో గుంపులుగా చేరడం, మాస్క్ ధరించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందన్నారు అధికారులు. అంతేకాక నర్సింగ్ హోమ్‌లు, పాఠశాలలు, రెస్టారెంట్లు, బహిరంగ మార్కెట్లు, డోర్ టూ డోర్ సేల్స్ పర్సన్ల వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. (ఏంటి డాక్టర్ ఇదీ..) నేడు దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవం. యుఎస్, సోవియట్ దళాలు కొరియాపై దశాబ్దాలుగా ఉన్న జపాన్ ఆక్రమణను ముగించిన రోజు కాబట్టి దక్షిణ, ఉత్తర కొరియా రెండింటిలోనూ ఆగస్టు 15న ప్రతి సంవత్సరం పండుగలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా వేడుక నిర్వహించారు. అయితే నిర్వహకులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని అధికారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దక్షిణ కొరియాలో సామాజిక దూరం అమలు చేయలేదు. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన నియమాలు అమలు చేస్తుందని భావిస్తున్నారు జనాలు. -
శాంసంగ్ గెలాక్సీ ఏ 90 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్
సియోల్ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ‘ఎ’ సిరీస్‌లో మరో ఫోన్‌ను పరిచయం చేసింది. అందరూ ఊహించినట్టుగా శాంసంగ్ గెలాక్సీ ఏ 90 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను నేడు (మంగళవారం, సెప్టెంబరు 3) దక్షిణ కొరియాలో తీసుకొచ్చింది. ఇది గెలాక్సీ ఏ సిరీస్‌లో మొట్ట మొదటి 5జీ డివైస్ కాగా, శాంసంగ్ డెక్స్ సపోర్ట్‌తో వచ్చిన తొలి ఫోన్ కూడా. అంతేకాదు శాంసంగ్ ఎస్10, శాంసంగ్ నోట్ 10, నోట్ 10 ప్లస్ తరువాత వస్తున్న నాల్గవ 5జీ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఏ 90 కావడం మరో విశేషం. స్లిమ్ బెజెల్స్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 64, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. అయితే 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ను 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించింది. రేపటి నుంచి కొరియన్ మార్కెట్లలో విక్రయానికి లభ్యం. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఇండియాలో 5జీ వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ ఏ 90 4జీ వేరియంట్‌ను ఇండియాలో తీసుకొస్తుందా లేదా, వచ్చే ఏడాది దాకా వెయిట్ చేస్తుందా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. శాంసంగ్ ఏ 90 ఫీచర్లు 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఆక్టా-కోర్ చిప్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+8+5 ఎంపీ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500 ఎంఏహెచ్ బ్యాటరీ -
68 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : రెండూ మూడేళ్ల క్రితం తప్పిపోయిన లేదా దూరమైన పిల్లవాడిని కలుసుకుంటే ఓ తల్లి హృదయం తన్మయత్వంతో పరవశించి పోతుంది. ఇక 68 ఏళ్ల క్రితం తన నుంచి దూరమైన కొడుకును కలసుకుంటే ఆ తల్లి హృదయం ఎలా ఉప్పొంగిపోతుందో చెప్పలేం! అది ఆ తల్లికే తెలియాలి. 68 ఏళ్ల క్రితం కొరియన్ల యుద్ధం కారణంగా ఉత్తర కొరియాలోనే ఉండిపోయిన తన కొడుకు లీ సంగ్ చుల్‌ను దక్షిణ కొరియాకు తరలిపోయిన తల్లి లీ కియమ్ సియంకు అదృష్టవశాత్తు లభించింది. ప్రస్తుతం 92 ఏళ్ల వయస్సు గల ఆ తల్లి 72 ఏళ్ల వయస్సు గల తన కొడుకును సోమవారం నాడు కలుసుకొంది. ఆ వృద్ధ తల్లి తన రెండు చేతులను ఆప్యాయంగా చాచగా, కొడుకు వచ్చి తల్లిని హత్తుకుంటాడు. తనతోనే ఉత్తర కొరియాలో ఉండిపోయి ఎప్పుడో చనిపోయిన తన తండ్రి ఫొటోను కూడా లీ సంగ్ ఈ సందర్భంగా తల్లికి చూపిస్తారు. ఆ ఫొటోను చూసిన తల్లికి పాత జ్ఞాపకాలతో కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ తల్లీ తనయుల అరుదైన కలయికకు సంబంధించిన సన్నివేశాన్ని వీడియో తీసిన సీఎన్ఎన్ ఛానల్ దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కొరియన్ల యుద్ధం సందర్భంగా విడిపోయిన రక్త సంబంధీకులు తిరిగి కలుసుకున్న సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అయితే గత మూడేళ్ల కాలంలో రక్త సంబంధీకులు ఇలా కలుసుకోవడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో 89 మంది వృద్ధులు ఇలా తమ పిల్లలను కలుసుకోవడం కోసం నిరీక్షిస్తున్నారు. వారిలో నుంచి లాటరీ పద్ధతి ద్వారా లీ కియమ్‌కు తనయుడిని కలుసుకునే అవకాశం లభించింది. అది గట్టి నిఘా మధ్యన. తల్లి కొడుకులు కలుసుకున్న ఆనందం కూడా వారికి ఎక్కువ సేపు ఉండదు. మూడు రోజుల్లో రోజుకు కొన్ని గంటలు మాత్రమే రక్తసంబంధీకులను కలుసుకునే అవకాశాన్ని దక్షిణ కొరియా కల్పిస్తోంది. ఆ తర్వాత దక్షిణ కొరియా పౌరులు తమ దేశానికి తరలిపోవాల్సిందే. -
వైరల్: గంటల తరబడి సైలెంట్‌గా చదువుకుంటున్నాడు!
ఈ కాలంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో.. ఎందుకు అవుతుందో తెలియనే తెలియదు. కుర్రకారు ఇష్టాయిష్టాలు ఎప్పుడు, ఎలా మారతాయో కూడా అంత ఈజీగా అంచనా వేయలేం. వైరల్ అవడం అంటే ఏంటి.. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడం అంతేకదా! ఒక్కోసారి యూట్యూబ్‌లో పెట్టే వీడియోలకు క్షణాల్లో వీక్షకుల సంఖ్య కోట్లకు చేరుకుంటుంది. ఆ వీడియోలకు క్రేజ్ అలా ఉంటుంది మరి. సాధారణంగా పాటలు.. డ్యాన్స్ షోలు.. కామెడీ.. ఆట పట్టించే వీడియోలు, సమాచారం ఉన్న వీడియోలు.. ఇలా చాలా రకాల వీడియోలను యువత ఇష్టపడుతుంది. అయితే వీటన్నింటికీ భిన్నంగా దక్షిణ కొరియాకు చెందిన ఓ కుర్రాడు యూట్యూబ్‌లో తెగ హల్చల్ చేస్తున్నాడు. మరోలా చెప్పాలంటే సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంతకీ ఆ పిల్లాడు ఆ వీడియోల్లో ఏం చేస్తున్నాడనే కదా మీ అనుమానం. చదువుకుంటున్నాడు.. అవును గంటల తరబడి సైలెంట్‌గా చదువుకుంటున్నాడు. తాను చదువుకునేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాడు. అంతే వేల మంది అతడి వీడియోలను తెగ చూసేస్తున్నారు. ఆ అబ్బాయి పేరు బోట్ నో జామ్. యూట్యూబ్‌లో తన చానెల్‌కు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 3.3 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారట. తాను పోలీస్ అధికారి అయ్యేందుకు పరీక్షల కోసం సిద్ధం అవుతున్నానని చెబుతున్నాడు. ఇప్పుడు దక్షిణ కొరియాలో బోట్ ఒక సెన్సేషన్ అయ్యాడు. చూశారా.. సైలెంట్ కూడా ఎలా సెన్సేషన్ అయిపోతుందో. -
నార్త్ కొరియా ఓ నరకం.. అందుకే దేశం విడిచాం..
సియోల్, దక్షిణకొరియా : సొంత దేశంలో పిల్లల చదువులు సాగవనుకున్న ఓ కుటుంబం పొరుగు దేశానికి పారిపోయింది. అయితే, ఇందుకు ఆ కుటుంబం దాటిన సవాళ్లు అన్ని ఇన్నీ కావు. ఉత్తరకొరియాలో చేపలు పట్టుకునే ఓ జాలరి తన బిడ్డలకు మంచి చదువు చెప్పించాలనుకున్నారు. పిల్లలు కూడా కంప్యూటర్ విద్యపై ఆసక్తిని కనబర్చుతుండటంతో ఆయన తాపత్రయం మరింతగా పెరిగింది. సొంత దేశంలో విద్య కోసం ఉపాధ్యాయులకు లంచాలు ఇవ్వాల్సిన దీనస్థితి. వారికి లంచాలు ఇచ్చి బిడ్డలను చదివించలేనని భావించిన ఆయన కుటుంబంతో కలసి చైనా, వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్‌ల మీదుగా దక్షిణకొరియా చేరుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా వారిని సాదరంగా దేశంలోకి ఆహ్వానించి తగిన వసతులు కల్పించింది. తమ దేశంలోనే ఉండి పిల్లలకు మంచి చదువులు చెప్పించుకోండని అండగా నిలిచింది. అయితే, దక్షిణ కొరియా చేరేందుకు జాలరి కుటుంబం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. తెలిసిన వారి ఆర్థిక సహాయంతో 70 రోజుల పాలు కష్టనష్టాలకు ఒనగూర్చి వారు దక్షిణ కొరియా చేరుకున్నారు. -
అట్టహాసంగా వింటర్ ఒలింపిక్స్ వేడుకలు
ప్యాంగ్‌చాంగ్ : దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్‌లో వింటర్ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్ ఒలింపిక్ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య దక్షిణ కొరియా స్కేటింగ్ క్రీడాకారిణి యూనా కిన్ వింటర్ ఒలింపిక్స్ జ్యోతి వెలిగించారు. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే యిన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 92 దేశాల జట్లు ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నాయి. ప్రతి దేశానికి చెందిన జట్టు ఆటగాళ్లు వేడుకల్లో పాల్గొన్నారు. తమ జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని స్టేడియంలో సందడి చేశారు. స్కీయింగ్, స్కేటింగ్, లుజ్, ఐస్ హాకీ సహా 15 క్రీడల్లో 102 ఈవెంట్లలో నిర్వాహకులు పోటీలు నిర్వహించనున్నారు. భారత్ నుంచి ఇద్దరు క్రీడాకారులు శివ్‌కేశవన్, జగదీశ్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 25 వరకు వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. -
చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు!
పియాంగ్ చాంగ్ : వందల కోట్ల ఖర్చుతో నిర్మితమైన భారీ స్టేడియం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు వేడుకల తర్వాత నిర్వీర్యంగా మారనుందా అంటే అవుననే చెప్పాలి. కొత్త హంగులతో, అద్భుతంగా నిర్మించిన కట్టడం చరిత్రలో కలిసిపోనుంది. శీతాకాల ఒలింపిక్స్-2018 కోసం పియాంగ్ చాంగ్ (దక్షిణ కోరియా) ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ వేడుకలను అట్టహాసంగా జరపాలని ఉద్దేశంతో పియాంగ్ చాంగ్ లో భారీ స్టేడియాన్ని నిర్మించారు. కానీ ఆ తర్వాత తాము చేసిన పనికి అధికారులు తలలు పట్టుకున్నారు. అదేంటి స్డేడియాన్ని నిర్మించడం తప్పేమి కాదుగా.. ఎందుకీ అవస్థ అంటారా. ఆ స్టేడియం నిర్మాణానికి అక్షరాల వంద మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు 635కోట్లు) ఖర్చు చేసింది. ఒకేసారి 35000 మంది వీక్షించే సదుపాయం కలదు. ఇంత భారీ ఖర్చుతో నిర్మించిన స్టేడియాన్ని కేవలం నాలుగంటే నాలుగు సార్లు మాత్రమే ఉపయోగిస్తారు. శీతాకాల ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలకు మాత్రమే వేదిక కానుంది. ఆ తర్వాత స్టేడియాన్ని ఏ అవసరాలకు వినియోగించాలో అర్థంకాక అధికారులు తికమక పడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలింపిక్స్ స్టేడియాల పరిస్థితి ఇలానే ఉన్నాయి. రియో, అట్లాంట ఒలింపిక్స్ స్టేడియాలు శిథిలావస్థకు చేరగా, మరికొన్ని స్టేడియాలు ఆటగాళ్ల వసతులకు ఉపయోగపడుతున్నాయి. పియాంగ్ చాంగ్ లో స్డేడియం సామర్థ్యం కంటే కేవలం 10 వేల మంది ఎక్కువ ప్రజలు ఉన్న దేశంలో భవిష్యత్తులో దాని నిర్వహణకు చేసే ఖర్చు తలుచుకుంటే అధికారులకు వారి తప్పిదం అర్థమవుతోంది. -
కాసేపట్లో రగ్బీ.. సింహం నోట్లోకి చేయి
సౌత్ ఆఫ్రికా: బోనులో ఉన్నా.. బయట ఉన్నా సింహం సింహమే.. ఆ విషయం ఆదమరిచారో అంతే సంగతులు.. బహుషా ఈ విషయం మరిచినట్లున్నాడు ఓ రగ్బీ ప్లేయర్.. ఏం చక్కా మరికాసేపట్లో రగ్బీలో ప్రత్యర్థిపై తలపడాల్సిన ఆ క్రీడాకారుడు సింహం చేత కరిపించుకొని ఆస్పత్రి పాలయ్యాడు. సింహాన్ని చూసేందుకు వెళ్లి దాని తలపై చేయిపెట్టి దువ్వుతూ అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. స్కాట్ బల్ద్విన్ అనే రగ్బీ క్రీడాకారుడు తన టీంతో కలిసి దక్షిణాప్రికాలో జరిగే రగ్బీ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. సరదాగా అక్కడ పెంపుడు సింహాలను పెంచుతున్న చోటకు వెళ్లాడు. ఆ తర్వాత అవి బోనులో తిరుగుతుండగా ఫొటో తీసుకోవడంతోపాటు బోను పక్కనే కూర్చున్న సింహంపై తలపెట్టి కొద్ది సేపు దువ్వాడు. సరిగ్గా దాని ముఖంపై చేతితో తడిమే లోగానే వెంటనే సింహం చేతినందుకుంది. దీంతో అబ్బా అంటూ గారు కేకలు వేశాడు. ఏదోలా తన చేతిని లాక్కున్నాడుగానీ గాయాలు మాత్రం అయ్యాయి. అతడి చేతికి కుట్లు కూడా పడ్డాయి. దీంతో చివరకు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా కూడా అందుకే అత్యుత్సాహం పనికిరాదంటూ హితవు పలుకుతున్నారు. -
'మళ్లీ యుద్ధం వద్దనుకుంటున్నాం'
సియోల్ : వచ్చే నెలలో ఉత్తర కొరియా మరిన్ని కవ్వింపుచర్యలకు పాల్పడవచ్చని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు అణు క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లుగానే అక్టోబర్‌లో కూడా అలాంటి పరంపరనే కొనసాగించే అవకాశం ఉందన్నారు. వచ్చే నెలలో కమ్యూనిస్టు పార్టీ వార్షికోత్సవం నేపథ్యంలో దానికి సమాంతరంగా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో ఆ దేశ రక్షణశాఖ సలహాదారు సమావేశం అయిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. అక్టోబర్ 10 నుంచి 18 వరకు వరుసగా ఉత్తర కొరియా ఏదో ఒక చర్యలకు దిగబోతోందని తమ వద్ద సమాచారం ఉందన్నారు. పూర్తి వివరాలు అందించేందుకు నిరాకరించారు. అయితే, సైనిక చర్యలు, దౌత్యం ద్వారా ఉత్తర కొరియాతో సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోందని, అయితే, మరోసారి యుద్ధానికి వెళ్లడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఇటీవల వరుసగా అణు కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉభయ కొరియా ప్రాంతాలతోపాటు అటు ప్రపంచ అగ్ర దేశాల్లో కూడా గుబులు బయలుదేరిన విషయం తెలిసిందే. -
భారత్ పట్ల ప్రపంచం తీరు మారింది
సియోల్ : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కొరియాకు చేరుకున్న సియోల్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు సౌత్ కొరియాలో ఘన స్వాగతం లభించింది. సియోల్ విమానాశ్రయానికి చేరుకున్న వందలాదిమంది భారతీయులు ప్రధానితో చేయి కలపడానికి ఉత్సాహం చూపారు. అనంతరం సౌత్ కొరియా జాతీయ సమాధిని ప్రధాని సందర్శించిన ఆ తర్వాత కొరియా కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. సౌత్ కొరియాలోని భారత సమాజం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్ హాల్ మోదీ మోదీ... నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ సంవత్సరాల కాల పాలనలో దేశంలో ఎంతో అభివృద్ధిని సాదించిందనీ, అందుకే మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులందరూ తిరిగి భారతదేశానికి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. పెద్ద పెద్ద భవనాలు,మంచి రోడ్లు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని, ప్రజలకు మంచి జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నాని మోదీ అన్నారు. దేశంలోని మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఇంకా ఆరుబైటకు వెళ్లడం సిగ్గు చేటంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్ లేకుండా బ్రిక్స్ లేదన్నారు. భారత్ అభివృద్ధి పథాన్నిఎంచుకుందనీ ప్రపంచంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారత్ రావాలన్నారు. దేశం పట్ల ప్రపంచ దృక్పథం మారిందని, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా అవతరిస్తుందని ప్రధాని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ.. కొరియా ప్రెసిడెంట్ పార్క్ జియోన్ హై తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అటు వివిధ కంపెనీల సీఈవోలతోనూ సమావేశం కానున్నారు.