రగ్బీ ప్లేయర్ స్కాట్ బల్‌ద్విన్ చేతిని అందుకుంటున్న సింహం
సౌత్ ఆఫ్రికా: బోనులో ఉన్నా.. బయట ఉన్నా సింహం సింహమే.. ఆ విషయం ఆదమరిచారో అంతే సంగతులు.. బహుషా ఈ విషయం మరిచినట్లున్నాడు ఓ రగ్బీ ప్లేయర్.. ఏం చక్కా మరికాసేపట్లో రగ్బీలో ప్రత్యర్థిపై తలపడాల్సిన ఆ క్రీడాకారుడు సింహం చేత కరిపించుకొని ఆస్పత్రి పాలయ్యాడు. సింహాన్ని చూసేందుకు వెళ్లి దాని తలపై చేయిపెట్టి దువ్వుతూ అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. స్కాట్ బల్‌ద్విన్ అనే రగ్బీ క్రీడాకారుడు తన టీంతో కలిసి దక్షిణాప్రికాలో జరిగే రగ్బీ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లాడు.
సరదాగా అక్కడ పెంపుడు సింహాలను పెంచుతున్న చోటకు వెళ్లాడు. ఆ తర్వాత అవి బోనులో తిరుగుతుండగా ఫొటో తీసుకోవడంతోపాటు బోను పక్కనే కూర్చున్న సింహంపై తలపెట్టి కొద్ది సేపు దువ్వాడు. సరిగ్గా దాని ముఖంపై చేతితో తడిమే లోగానే వెంటనే సింహం చేతినందుకుంది. దీంతో అబ్బా అంటూ గారు కేకలు వేశాడు. ఏదోలా తన చేతిని లాక్కున్నాడుగానీ గాయాలు మాత్రం అయ్యాయి. అతడి చేతికి కుట్లు కూడా పడ్డాయి. దీంతో చివరకు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా కూడా అందుకే అత్యుత్సాహం పనికిరాదంటూ హితవు పలుకుతున్నారు.