lion attack
-
తిరుపతి జూ ఘటన.. తేలని ప్రశ్నలు!
తిరుపతి (మంగళం): మద్యం మత్తు వల్లే జరిగిందా? సెల్ఫీ కోసమే అంతటి సాహసానికి పూనుకున్నాడా? లేదంటే చావడానికే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా?.. తిరుపతి జూ పార్క్ దుర్ఘటనలో పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివే. రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద గుర్జర్(38) జూ సందర్శనకు వెళ్లి.. సింహానికి బలి కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. కుటుంబ సభ్యుల్ని విచారిస్తేనే.. ఈ కేసు ముడి వీడుతుందని తిరుపతి పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, శ్రీ వేంకటేశ్వర జూ సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం.. గుర్జర్ గురువారమే హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చాడు. మధ్యాహ్న సమయంలో సిబ్బంది వారిస్తున్నా వినకుండా.. సింహాల ఎన్‌క్లోజర్ వైపు వెళ్లే యత్నం చేశాడు. తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి దూకాడు. కొంత దూరంలోని వాటర్‌ట్యాంక్ మీదుగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. అంతటితో ఆగకుండా.. వంద మీటర్ల దూరంలో ఉన్న సింహాన్ని చూసి గట్టిగా అరిచాడు. జూలో మూడు సింహాలు ఉన్నాయి. వాటిల్లో దుంగాపూర్ అనే సింహం తనవైపు చూడగానే తొడగొట్టి పిలిచాడు. సింహం కూడా అంతే వేగంగా స్పందించింది. అది తనవైపు రావడంతో భయంతో ఉలిక్కిపడ్డాడు. పక్కనే ఉన్న చెట్టెక్కే ప్రయత్నంలో కాలుజారి కిందపడ్డాడు. వెంటనే సింహం ప్రహ్లాద్ గుర్జర్ మెడను నోటితో పట్టుకుని వంద మీటర్లకుపైగా దూరం లాక్కెళ్లి చంపేసింది. సిబ్బంది గమనించి పరుగున వచ్చి సింహాన్ని బోనులో బంధించాడు. కానీ, ఈలోపే అంతా జరిగిపోయింది. ఎస్వీ జూ పార్క్ లో సింహం దాడిలో మృతి చెందిన ప్రహ్లాద్ గుల్జార్ డెడ్ బాడీ రుయా మార్చురీకి తరలించారు పోలీసులు. ఆధార్ కార్డు ఆధారంగా రాజస్థాన్‌లో ప్రహ్లాద్ కుటుంబీకులకు సమాచారం అందించారు. అయితే అంత ఎత్తులో ఉన్న కంచె ఎక్కి లోపలికి దూకేంత సాహసం చేయడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నా.. అంత ఎత్తును అంత చాకచక్యంగా దూకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రహ్లాద్ ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు సిబ్బంది చెప్పడం లేదు. పైగా శవ పరీక్షలో మద్యం తీసుకున్న ఆనవాళ్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ప్రహ్లాద్ మానసిక స్థితి సరిగ్గా లేదా? లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉండి ఆత్మహత్యకు యత్నించాడా? అనే కోణంలోనూ విచారించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేశామని.. కుటుంబీకులు వస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. -
సింహం నోట్లో తల పెట్టిన వ్యక్తి
-
14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు!
ఒకటి రెండు సింహాలు ఉంటేనే మిగిలిన జంతువులు హడలిపోతాయి. అలాంటిది ఒంటరిగా ఉన్నప్పుడు పదికిపైగా సింహాలు ఒక్కసారిగా వెంటపడితే అంతే ఇక.. వాటికి ఆహారమైపోయినట్లేనని భావించాల్సిందే. అయితే.. తనను వేటాడేందుకు 14 ఆడ సింహాలు వెంటపడుతున్నా జవలేదు ఓ గజరాజు. ఒంటరిగా ఉన్న బెదరకుండా వాటి బారి నుంచి తప్పించుకుంది. సింహాలను గజరాజు ఏవిధంగా ఎదిరించిందనే విషయాన్ని చెబుతూ ఆ దృశ్యాలను అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఒంటరిగా ఉన్న ఏనుగును 14 ఆడ సింహాలు వేటాడేందుకు ప్రయత్నించినా.. వాటిపై గెలిచింది. ఇక్కడ అడవికి రాజు ఎవరు అని ఊహిస్తున్నారు?’ అని రాసుకొచ్చారు. వీడియోలో.. ఓ నదిలోకి నీళ్లు తాగేందుకు వచ్చిన గజరాజుపై దాడి చేశాయి సింహాలు. ఓ సింహం దానిపైకి ఎక్కి అధిమిపట్టే ప్రయత్నం చేయగా.. మిగిలినవి కాళ్లు, ఇతర భాగాలను నోట కరిచేందుకు యత్నించాయి. వాటిబారి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది ఏనుగు. కాళ్లతో తంతూ తొండంతో కొడుతూ చెదరగొట్టింది. అయినా.. అవి వెనక్కి తగ్గకపోవటంతో నీటిలోకి వెళ్లింది. కొంత దూరం వరకు వెళ్లిన సింహాలు.. ఇక ఏనుగు తమకు చిక్కదని భావించి వెనుదిరిగాయి. Lone tusker takes on 14 lionesses & wins… Who should be than king of forest ? Via Clement Ben pic.twitter.com/kYbZNvabFv — Susanta Nanda IFS (@susantananda3) August 27, 2022 ఇదీ చదవండి: పొలంలో నిద్రిస్తున్న మహిళపైకి నాగుపాము.. ఎలా తప్పించుకుందంటే? -
సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది
A shocking video Bull forceful way To Lift Lion: సహజంగా జంతవుల దాడి చేసుకుంటుంటాయి. అవి ఒక్కోసారి ఘోరంగా కూడా ఉంటాయి. అయితే పులి వేట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది వేటాడిందంటే ఏ జంతువైన దాని పంజా దెబ్బకి పడిపోవాల్సింది. చాలా వరకు ఏ జంతువునైనా అది సునాయాసంగా పట్టుకుని దాడి చేస్తుంది. ఏమైందో ఏమో ఈ ఎద్దు వద్ద ఆ సింహం ఆటలు సాగలేదు. పైగా దాన్ని చూసి పారిపోయింది. వివరాల్లోకెళ్తే...టాంజానియాలోని తరంగిరే నేషనల్ పార్క్‌లో ఒక ఎద్దు పైకి సింహం దాడి చేస్తుంది. ఆ ఎద్దుని గట్టిగా పట్టుకుంటుంది. కానీ ఆ ఎద్దుని విపరీతమైన కోపంతో ఆ సింహాన్ని కొమ్ములతో ఎత్తిపడేసి ఒక్కసారిగి దాడి చేసింది. ఆ సింహాన్ని పరిగెట్టెంత వరకు తరిమి తరిమి కొట్టింది. అయితే ఈ ఆ పార్క్ వద్దకు వచ్చిన కొంత మంది పర్యాటకు ఈ ఘటనను చిత్రించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Tanzania destination safari (@tanzania_destination_vacations) (చదవండి: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!) -
Viral Video: సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో వేటాడేస్తా
-
సింహం సైలంట్‌గా ఉందని వేళాకోళం చేశావో..
మన సరదాగా వన్యమృగాలతో చూడాలనో లేక సరదాగడుపదామనో మనం నేషలనల్ జూలాజికల్ పార్క్‌లు వంటి రకరకాల పార్కులకి వెళ్తాం. అయితే పార్క్‌లో ఉండే సంరక్షణాధికారులు సూచించినట్లుగా అక్కడ ఉన్న జంతువులతో జాగ్రత్తగా మసులుకోకపోతే చేదు అనుభవాలను ఎదర్కొక తప్పదు. (చదవండి: ఇదేం ట్రెండ్....చెత్త వేసే సంచిని ధరించడం ఏమిటి ?) అంతేకాదు ఇలాంటి చేదుఅనుభవాలను ఎదుర్కొన్న వాళ్ల గురించి ఇటీవల కాలంలో చాలానే విని ఉన్నాం. అయినప్పటికి పర్యాటకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి ఎందుకు తెచ్చకుంటారో అర్ధంకాదు. అట్లాంటి చేదు అనుభవమే టాంజానియా పార్క్‌కి వెళ్లిన ఒక పర్యాటక బృందానికి ఎదురైంది. అసలు ఎక్కడ జరిగింది ఏమైంది చూద్దాం రండి. వివరాల్లోకెళ్లితే....టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో ఒక పర్యాటక బృందం కారులో కూర్చోని సింహాన్ని చూస్తుంటారు. అయితే ఆ సింహం వాళ్ల కారు పక్కనే ఉన్నప్పటికీ అది ఆ కారుని గమనించ కుండా అటువైపుకి తిరిగి ఉంటుంది. దీంతో ఒక పర్యాటక బృందంలోని ఒక వ్యక్తి కారు కిటకి డోరు తీసి సింహాన్ని తాకడానికి ప్రయత్నించడమే కాక ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఇక అంతే ఒక్కసారిగా సింహం పెద్దగా గాండ్రిస్తూ కిటికిలోకి తల దూర్చడానికి ప్రయత్నిస్తుంది. దీంతో సదరు పర్యాటకుడు షాక్‌కి గురై సీటు వెనక్కి వెళ్లి పోతాడు. ఇంతలో కారులో ఉన్న మిగతావాళ్లంతా కిటికి మూసేయ్ అంటూ కేకలు వేయడంతో కిటికిని మూసేయడానికి చాలా కష్టపడతాడు. ఏది ఏమైనా ఇలాంటి క్రూర జంతువులతో తస్మాత్ జాగ్రత్త. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’
డొడొమా: అడవిలో ఉండే జంతువులు కూడా, మనుషుల్లాగానే నిరంతరం మనుగడ కోసం పోరాడుతుంటాయి. ఈ క్రమంలో మాంసాహార జంతువులు శాఖాహర జంతువులను.. శాఖాహర జంతువులు గడ్డి, చెట్ల ఆకులను, ఫలాలను తిని జీవిస్తాయనే విషయం మనకు తెలిసిందే. అయితే, ఈ పోరాటంలో ఒక జీవి వేటలో మరొక జీవి బలవ్వాల్సిందే.. ఇదే ఆటవిక ధర్మం. కాగా, ఇప్పటికే అడవిలోని సింహం, పులులు, చిరుత పులులు తదితర జంతువులు, ఇతర జీవులను వేటాడటాన్ని మనం అనేక వీడియోల్లో చూస్తూ ఉంటాం. ఈ పరస్పర దాడుల్లో ఒక్కొసారి.. క్రూరమృగాల వేటకు శాఖాహార జీవులు బలైతే, మరోసారి శాఖాహర జంతువులు మాంసాహార జంతువుల బారి నుంచి తెలివిగా తప్పించుకున్న వీడియోలను మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే, ప్రస్తుతం ఈ వీడియో కూడా ఆ కోవకు చెందినదే. ఈ సంఘటన టాంజానియాలోని అడవిలో జరిగింది. దీనిలో ఒక జీబ్రా దట్టమైన అడవిలో గడ్డిని మేస్తుంది. ఈ క్రమంలో ఒక ఆడ సింహం జిబ్రాను దూరం నుంచి గమనించింది. ఈ జీబ్రా ఒక్కటే ఉండటంతో.. మెల్లగా ఒక్కొ అడుగు ముందుకు వేస్తు జీబ్రా దగ్గరకు వచ్చింది. పాపం.. జీబ్రా ధ్యాస మాత్రం మేత మీదే ఉంది. అప్పుడు సివంగి వెంటనే జీబ్రామీద దాడి చేసింది. దీంతో జీబ్రా ఒక్కసారిగా తేరుకొని.. సింహనికి చిక్కకుండా అక్కడి నుంచి పరిగెత్తింది. ఈ క్రమంలో ఆడసింహం అమాంతం జీబ్రాపైకి దూకింది. అప్పుడు.. జీబ్రా .. తన బలమైన వెనుక కాళ్లతో ఆడసింహన్ని బలంగా ఒక్క తన్నుతన్నింది. దీంతో పాపం..ఆ ఆడసింహం గాల్లో ఎగిరి దూరంగా పడింది. పాపం... సివంగి ఈ ప్రతి దాడిని ఊహించి ఉండదు. కాగా, ఈ వీడియోను మాసాయి లెజెండ్ అనే సఫారీ టీమ్ ఇన్‌స్టాలోని వావో ఆఫ్రికా పేజీలో పోస్ట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఏమన్నా తన్నిందా..’, ‘ పాపం.. సివంగి.. నాలుగైదు అడుగుల దూరం పడుంటుంది..’,‘ సివంగి వేట మిస్..’, ‘గాల్లో బంతిలాగా ఎగిరి కింద పడింది..’ ‘జీబ్రా ఆయుష్యు గట్టిదే..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: వైరల్: జాలరికి జాక్‌పాట్.. చేప కడుపలో ఊహించని బహుమతి View this post on Instagram A post shared by Waow Africa (@waowafrica) -
మహిళపై సింహాల దాడి
సిడ్నీ: ఆస్ట్రేలియా జూలో పని చేసే మహిళపై రెండు సింహాలు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జూ ఆవరణను శుభ్రపరుస్తుండగా సింహాలు దాడి చేయడంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం... పారామెడిక్స్ న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యు) రాష్ట్రంలోని షోల్హావెన్ జూ లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి మూసివేశారు. ఈ నేపథ్యంలో జూ ఆవరణను బాధితురాలు శుభ్రం చేస్తుండగా సింహాలు ఆమెపై దాడి చేశాయి. ఇది గమనించిన ఇతర జూ సిబ్బంది సింహాలను గుహలోకి తరిమి ఆమెను రక్షించారు. అయితే అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనలో బాధితురాలి మెడ, తల భాగంలో గాయలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. ‘‘నేను గత కొంతకాలంగా జూలో పనిచేస్తున్నా. ఇలాంటి ఘటన జూలో ఎప్పుడు జరగలేదు. ఇది చాలా భయంకరమైనది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జూ వద్ద హై అలర్ట్ ప్రకటించామని, ఘటనపై జూ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని పోలీసులు తెలిపారు. -
సింహం ఎన్‌క్లోజర్‌లో చేయి పెడితే..
కొన్నిసార్లు మనం ప్రదర్శించే అత్యుత్సాహం.. ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి సౌత్ఆఫ్రికాలో చోటుచేసుకుంది. పీటర్ నార్జే తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి సౌత్ ఆఫ్రికాలోని ఓ పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఎన్‌క్లోజర్‌లోకి తన చేతిని చాచిన పీటర్.. అందులో ఉన్న ఓ సింహాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది విడిపించుకునేందుకు ప్రయత్నించిన కూడా అదిమి పట్టడానికి యత్నించాడు. ఇంతలోనే ఆ పక్కనే ఉన్న ఆడ సింహం అతని వద్దకు చేరుకుంది. దానిని కూడా దగ్గరకు తీసుకుందామనుకున్న పీటర్‌కు గట్టి షాకే తగిలింది. ఆడ సింహం పీటర్ చేతిని ఒక్కసారిగా నోటిలో పెట్టుకుంది. ఆడ సింహం నోటిలో నుంచి చేతిని విడిపించుకోవడానికి పీటర్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అతని భార్య బిగ్గరగా కేకలు వేసింది. కొన్ని సెకన్ల తరువాత ఆడ సింహం నోటి నుంచి పీటర్ తన చేతిని బయటకు తీసుకోగలిగాడు. ఆ తర్వాత చికిత్స కోసం అతను ఆస్పత్రిలో చేరాడు. కాగా, ఆ పార్కు యాజమాన్యం ఈ ఘటనకు బాధ్యత వహించేందుకు నిరాకరించింది. పార్క్‌లో ప్రతి చోట సైన్ బోర్డ్‌లు ఉన్నాయని.. కానీ పీటర్ వాటిని అతిక్రమించారని పార్క్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సింహం దాడి నుంచి భయటపడ్డ సర్కస్ ట్రైనర్
-
వైరల్ వీడియో : చావు నోట్లో నుంచి బయటపడ్డాడు
కియెవ్ : ఉక్రేయిన్ సర్కస్‌లో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. మాస్టర్ చెప్పినట్లు ఆడాల్సిన సింహం కాస్తా.. అతని పాలిట మృత్యుదేవతగా మారింది. చచ్చన్రా దేవుడా అనుకున్న సమయంలో అనూహ్యంగా సింహం బారి నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రముఖ సర్కస్ ట్రైనర్ హమడా కౌత సర్కస్‌లో ప్రదర్శన నిర్వహిస్తుండగా సింహం ఒక్కసారిగా అతని మీద దాడి చేసింది. అతని కంఠం వద్ద పట్టుకుని.. దాడి చేయడానికి ప్రయత్నించింది. అంతసేపు దీన్ని కూడా సర్కస్‌లో విన్యాసంగానే భావించారు జనాలు. కానీ మ్యూజిక్ ఆగిపోయాక భయంతో కేకలు వేస్తోన్న హమడా అరుపులు ప్రేక్షకులకు వినిపించాయి. కళ్లేదుట జరుగుతున్న దారుణాన్ని చూసి ప్రేక్షకులు కూడా స్థంభించిపోయారు. అదృష్టవశాత్తు హమడా సింహం దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘షోలో భాగంగా నేను ఒక సింహాన్ని పిలుస్తుండగా మరో సింహం నా మీద డాడి చేసింది. అది నా మీదకు దూకింది.. కానీ అదృష్టవశాత్తు నా మెడ మీద దాడి చేయలేదు. దేవుడి దయ వల్ల నా కాలు, చేతికి మాత్రమే చిన్న చిన్న గాయాలయ్యాయి. కాకపోతే అప్పటికే నా శరీరం పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. ఈ సంఘటన చూసి ప్రేక్షకులు భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. నేను వారిని ప్రశాంతంగా ఉండమని కోరాను. ఆ తర్వాత ఎలానో సింహం బారి నుంచి తప్పించుకోగలిగాను. అనంతరం యధావిధిగా ప్రదర్శన నిర్వహించామ’ని చెప్పుకొచ్చారు. -
సింహాల దాడి నుంచి యజమానిని రక్షించిన శునకం
రాజ్‌కోట్ : కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు.. అని నిరూపించింది ఓ శునకం. ఏకంగా సింహాలకే ఎదురు నిలిచి తన యజమానిని ఓ శునకం కాపాడింది. ఈ సంఘటన గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా సవెర్కుండ్ల తాలుకా అంబార్డి గ్రామంలో చోటు చేసుకుంది. గొర్రెల కాపరి భవేశ్ హమిర్ భర్వాద్(25) రోజూలానే మేకలు, గొర్రెలను గడ్డి కోసం ఊరి చివరకు తీసుకెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మూడు సింహాలు మేకలు, గొర్రెల మందపై దాడికి దిగాయి. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ఏం చేయాలో తెలియక, మేకలను రక్షించడానికి సింహాలను అక్కడి నుంచి తరమాలని ప్రయత్నించాడు భవేశ్. వాటిని అక్కడి నుంచి పోయేలా ప్రయత్నం చేయడంతో సింహాలకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఓ సింహం భవేశ్‌పై పంజావిసరడానికి ప్రయత్నించగా అతను తృటిలో తప్పించుకున్నాడు. అంతలోనే అతని పెంపుడు కుక్క క్షణాల్లో అక్కడికి చేరింది. తన యజమానికి సింహానికి అడ్డుగా నిలుచుని అరవడం ప్రారంభించింది. కుక్క అరుపులు విని పెద్ద మొత్తంలో జనం రావడంతో సింహాలు అక్కడి నుంచి జారుకున్నాయి. సింహాల దాడిలో భవేశ్‌కు స్వల్పగాయాలవ్వగా, మూడు మేకలు మృతిచెందాయి. కుక్క అడ్డుగా రాకపోతే సింహం దాడిలో భవేశ్ మృతిచెంది ఉండే వాడని, కుక్క చూపించిన తెగువను గ్రామస్తులు అభినందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సింహాల దాడి సంఘటనపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
వైరల్ వీడియో.. మనిషిపై లయన్ అటాక్
-
ప్రిడేటర్ పార్కులో సింహం పంజా..
కేప్‌టౌన్ : అనుకోకుండా స్థావరం వైపు వెళ్లిన వ్యక్తిపై సింహం దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలోని ప్రిడేటర్ జాతీయ పార్కులో ఓ వ్యక్తి దారి తప్పి వన్య ప్రాణుల పార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వచ్చాడు. పారిపోతున్న అతడిని వెంబడించిన సింహం దాడి చేసింది. గత నెల 28న సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి అకస్మాత్తుగా వచ్చాడు. ముందు సింహం ఉన్న చోటుకి ఎదురుగా వెళ్లాడు. అంతలోనే వెనక్కు పరుగెత్తుతూ కనిపించాడు. ఏం జరుగుతోంది అని తెలుసుకునే లోపే ఓ సింహం అతడిని తరమడం ప్రారంభించింది. ప్రాణ భయంతో అతను ‘కాపాడండి.. కాపాడండి’ అంటా అరవడం ప్రారంభించాడు. అతనిపై ఒక్కసారిగా విరుచుకుపడిన సింహం తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
కాసేపట్లో రగ్బీ.. సింహం నోట్లోకి చేయి
సౌత్ ఆఫ్రికా: బోనులో ఉన్నా.. బయట ఉన్నా సింహం సింహమే.. ఆ విషయం ఆదమరిచారో అంతే సంగతులు.. బహుషా ఈ విషయం మరిచినట్లున్నాడు ఓ రగ్బీ ప్లేయర్.. ఏం చక్కా మరికాసేపట్లో రగ్బీలో ప్రత్యర్థిపై తలపడాల్సిన ఆ క్రీడాకారుడు సింహం చేత కరిపించుకొని ఆస్పత్రి పాలయ్యాడు. సింహాన్ని చూసేందుకు వెళ్లి దాని తలపై చేయిపెట్టి దువ్వుతూ అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. స్కాట్ బల్ద్విన్ అనే రగ్బీ క్రీడాకారుడు తన టీంతో కలిసి దక్షిణాప్రికాలో జరిగే రగ్బీ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. సరదాగా అక్కడ పెంపుడు సింహాలను పెంచుతున్న చోటకు వెళ్లాడు. ఆ తర్వాత అవి బోనులో తిరుగుతుండగా ఫొటో తీసుకోవడంతోపాటు బోను పక్కనే కూర్చున్న సింహంపై తలపెట్టి కొద్ది సేపు దువ్వాడు. సరిగ్గా దాని ముఖంపై చేతితో తడిమే లోగానే వెంటనే సింహం చేతినందుకుంది. దీంతో అబ్బా అంటూ గారు కేకలు వేశాడు. ఏదోలా తన చేతిని లాక్కున్నాడుగానీ గాయాలు మాత్రం అయ్యాయి. అతడి చేతికి కుట్లు కూడా పడ్డాయి. దీంతో చివరకు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా కూడా అందుకే అత్యుత్సాహం పనికిరాదంటూ హితవు పలుకుతున్నారు. -
కాసేపట్లో రగ్బీ.. సింహంతో పెట్టుకున్నాడు
-
పార్క్‌లో సింహం దాడి.. మహిళ మృతి
జొహాన్నెస్‌బర్గ్: విహార యాత్ర విషాదంగా మారింది. సరదాగా పార్క్‌కు వెళ్లిన యువతి ఆకస్మికంగా సింహం బారినపడి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డారు. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లోని వన్యప్రాణుల పార్క్ చూసేందుకు ఓ అమెరికా యువతి వెళ్లింది. ఈ పార్క్‌లో సింహాలను బంధించకుండా స్వేచ్చగా వదిలేస్తారు. కార్లు, ఇతర వాహానాలలో వెళ్లి వీటిని చూడవచ్చు. అమెరికా యువతి కారులో వెళ్లి సింహాలను చూస్తూ సరదగా ఫొటోలు తీయసాగింది. కాగా ఆ సమయంలో కారు అద్దాలు వేసుకోకపోవడంతో సింహం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆమెను రక్షించేందుకు కారు డ్రైవర్ ప్రయత్నించగా అతణ్ని కాలి గోళ్లతో గాయపరిచింది. పార్క్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై సింహాన్ని అక్కడి నుంచి దరిమేశారు. వెంటనే అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అమెరికా యువతి చనిపోగా, డ్రైవర్ చికిత్స పొందతున్నాడు. పార్క్ తిలకించేందుకు వచ్చేవారికి తగిన జాగ్రత్తలు తెలియజేస్తామని, కారు అద్దాలు వేసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పార్క్ సిబ్బంది చెప్పారు.