ఉక్రేయిన్ సర్కస్‌లో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. మాస్టర్ చెప్పినట్లు ఆడాల్సిన సింహం కాస్తా.. అతని పాలిట మృత్యుదేవతగా మారింది. చచ్చన్రా దేవుడా అనుకున్న సమయంలో అనూహ్యంగా సింహం బారి నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రముఖ సర్కస్ ట్రైనర్ హమడా కౌత సర్కస్‌లో ప్రదర్శన నిర్వహిస్తుండగా సింహం ఒక్కసారిగా అతని మీద దాడి చేసింది.