circus
-
‘జెమిని సర్కస్’ శంకరన్ కన్నుమూత
కన్నూర్ (కేరళ): దేశంలో సర్కస్ ఇండస్ట్రీకి ఆద్యుల్లో ఒకరైన జెమిని శంకరన్ (99) ఇక లేరు. వయో సంబంధ రుగ్మతలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జంతువుల విన్యాసాలు, సాహస బృందాల ప్రదర్శనలతో తరాల పాటు ప్రేక్షకులకు వినోదం పంచిన జెమిని, జంబో సర్కస్ కంపెనీలు ఆయన స్థాపించినవే. 1924లో కేరళలోని కొలస్సెరీ గ్రామంలో పుట్టిన శంకరన్ సర్కస్ కళాకారుడిగా శిక్షణ పొందారు. సైన్యంలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రిటైరయ్యాక మళ్లీ సర్కస్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తాడుపై, ఐరన్ బార్‌పై నడవడంలో ప్రావీణ్యం సంపాదించారు. 1951లో విజయ్ సర్కస్ కంపెనీని కొనుగోలు చేసి జెమినిగా పేరు మార్చారు. నిపుణులతో, విదేశాల నుంచి తెప్పించిన జంతువులతో తీర్చిదిద్దారు. 1964లో రష్యా అంతర్జాతీయ సర్కస్ ఫెస్టివల్లో శంకరన్ సారథ్యంలోని భారత్ బృందం పాల్గొంది. -
Pooja Hegde: పొట్ట చెక్కలవుతుందేమో అనిపించింది!
హిట్టూ, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కొన్ని సినిమాల షూటింగ్ అనుభూతి ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అంటున్నారు పూజా హెగ్డే. ఈ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌కు ముందు హిందీ మూవీ ‘సర్కస్’ షూట్లో పాల్గొన్నాను. ఈ సినిమా సెట్లో బాగా ఎంజాయ్ చేశాను. అసలు వర్క్ చేస్తున్నామా? అనిపించేది. షూటింగ్ అంత సరదాగా జరిగింది. లొకేషన్లో అందరూ వేసిన జోక్స్‌కి పొట్ట చెక్కలవుతుందేమో అనిపించింది. ఈ మధ్య కాలంలో నేను ఒక షూటింగ్ లొకేషన్లో ఇంతగా నవ్వింది ఈ సెట్లోనే. రణ్వీర్ సింగ్, జాక్వెలిన్ ఎంతో ఫన్ క్రియేట్ చేశారు. రణ్వీర్ ఎనర్జీ నాలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా పూజా మాట్లాడుతూ– ‘‘సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’ సినిమా చేయనున్నాను. షూటింగ్ స్టార్ట్ అయ్యాక సల్మాన్‌తో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. అంత ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు. -
జనం పరుగో పరుగు.. ఇండియన్ ఏనుగు అంతే!
మాస్కో : సర్కస్‌లో ఫీట్లు చేయాల్సిన ఓ ఇండియన్ ఏనుగు అసూయతో భీకర ఫైట్‌కు తెర తీసింది. సర్కస్ మధ్యలో తోటి ఏనుగుపై కలబడి కుమ్ములాడింది. దీంతో పడిపడి నవ్వటానికి వచ్చిన జనం.. భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన రష్యాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం రష్యాలోని కాజన్‌లో ‘ సర్కస్ మాయాజాలం.. ఏనుగుల ప్రదర్శన’ పేరిట ఓ సర్కస్ జరిగింది. దీన్ని చూడటానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. షో ప్రారంభమైన తర్వాత ఇండియాకు చెందిన రెండు ఆడ ఏనుగులు జెన్నీ, మగదలు ఫీట్లు చేయటానికి రింగులోకి వచ్చాయి. వాటి ట్రైనర్ సూచనలు చేస్తూ వాటితో ఫీట్లు చేయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ట్రైనర్ తనకంటే ఎక్కువగా మగదకు ప్రాధాన్యత ఇస్తున్నాడని భావించిన జెన్నీ మగదపై దాడికి దిగింది. దాన్ని కిందపడేసి కుమ్మటం మొదలుపెట్టింది. రింగ్ అవతలకు తోయటానకి ప్రయత్నించింది. దీంతో బెంబేలెత్తిపోయిన జనం భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సర్కస్ సిబ్బంది జెన్నీని అదిలించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ట్రైనర్ తన కంటే మగదకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే అసూయతోనే జెన్నీ దాడికి దిగిందని సర్కస్ నిర్వహకులు చెబుతున్నారు. ఈ సంఘటనలో ఏనుగులు కానీ, జనం కానీ గాయపడలేదని తెలిపారు. చదవండి : వైరల్‌గా మారిన ప్రపంచ కుబేరుల పాత ఫొటో -
జాని లీవర్ నటించిన తెలుగు సినిమా గుర్తుందా?
ఏ దేశమేగినా ఎందుకాలిడినా తెలుగువాడు తన సత్తా చూపిస్తే మనకు సంతోషం వేస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి తండ్రి హయాంలో వలస వెళ్లి ముంబైలో ఎన్నో కష్టాలు పడి టాప్ కమెడియన్‌గా ఎదిగిన నటుడు జాని లీవర్. అతను ఉంటే సినిమాకు ప్లస్ అనే పేరు సంపాదించాడు. మధ్యలో కొంతకాలం బ్రేక్ వచ్చినా రోహిత్ శెట్టి ‘గోల్మాల్ అగైన్’లో నటించి ఆ సినిమా హిట్లో భాగం అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శెట్టి రణ్వీర్ సింగ్‌తో కలిసి ‘సర్కస్’ అనే కామెడీ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని భోగట్టా. తాజాగా రణ్వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పెట్టి ‘జాని లీవర్ సర్కస్ టీమ్‌తో జాయిన్ అయ్యారు’ అని అనౌన్స్ చేశాడు. అందుకు నిదర్శనంగా వానిటీ వ్యాన్‌పై ‘ది ఒన్.. ది ఓన్లీ జాని లీవర్’ అని రాసి ఉన్న నోటీస్ ఫొటో పెట్టాడు. సాధారణంగా వానిటీ వ్యాన్‌పై అలా ప్రత్యేకమైన నోటీస్‌లు పెట్టారు. జాని లీవర్ ఆ సినిమాకు ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి ఇలా పెట్టారు. జాని లీవర్ ఇంట్లో తెలుగు పిలుపులు నేటికీ వినపడతాయి. జాని లీవర్ పిల్లలు తండ్రిని ‘నాన్నా’ అనే పిలుస్తారు. అప్పుడప్పుడు జాని లీవర్ తన ఊరికి వచ్చి వెళుతుంటాడు. అన్నట్టు ఆయన నటించిన తెలుగు సినిమా మీకు గుర్తుందా? క్రిమినల్. అక్కినేని నాగార్జున, మనీషా కొయిరాల, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో జాని లివర్ నటించాడు. (చదవండి: చాలా రోజుల తర్వాత.. సంతోషంగా ఉంది!) -
డీడీ నంబర్ వన్
కేబుల్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్ టీవీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ‘డీడీ నేషనల్’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్. పీ రేటింగ్స్ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లాక్ డౌన్ కి ముందు వారాల్లో టాప్ 10లో లేకపోయినా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్ సంఖ్యతో పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్ 3) దూరదర్శన్ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్ బక్షి వంటి పాపులర్ సీరియళ్లు, ప్రోగ్రాములు తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్ సంస్థ తెలిపింది. -
ట్రైనర్ పై దాడి చేసిన ఎలుగుబంటి
-
గుండెల్లో గుడారం
సాయంత్రమైతే గిర్రున తిరిగే సర్కస్ లైటు ఫోకస్ ఊరిమీద పడుతుంది.పిల్లలూ పెద్దలూ సంబరంగా బయలుదేరి వెళతారు.పులులూ సింహాలు హంసల్లా అటు నుంచి ఇటుకు ఇటు నుంచి అటుకు ఎగిరే మనుషులు జోకర్లు...సర్కస్ గుడారం ఇచ్చే ఆనందం ఎంతో.కాని ఆ గుడారాన్నే జీవితం చేసుకున్న వాళ్ల మధ్య ఎన్నో అనుబంధాలు ఉంటాయి. ఉద్వేగాలు ఉంటాయి. నవ్వులూ ఏడుపులూ ఉంటాయి.వాటిని మొదటిసారి చూపించి ప్రేక్షకుల గుండెల్లో గుడారం వేసిన సీరియల్ ‘సర్కస్’. ఊయలలూగుతున్న రంగు రంగుల చిలుకలు.. సైకిల్ తొక్కుతూ గిరి గిరా తిరగేసే భారీ ఏనుగు.. రింగ్ మాస్టర్ చెప్పినట్టు ఆడే పులులు.. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సన్నని తీగలమీద జెండాలు పట్టుకొని మరీ అవలీలగా తిరిగే అమ్మాయిలు.. ఒక వైపు నుంచి మరో వైపుకు గాల్లోనే ఫల్టీలు కొట్టే అబ్బాయిలు..ఇవన్నీ చూస్తున్న పిల్లలు నవ్వులతో కేరింతలు కొట్టారు. పెద్దలు ఊపిరి బిగబట్టి చూశారు. ఇది సినిమా కాదు.. సర్కస్. ఈ పేరు వింటూనే మీ చెవుల్లో ఓ పాట ‘సర్కస్ హై భాయ్ సర్కస్ హై.. ఏ దునియా ఏక్ సర్కస్ హై.. రంగ్ బిరంగీ సర్కస్ హై.. ’ అంటూ రింగులుగా తిరుగుతుండాలి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పెద్ద పెద్ద పట్టణాల్లో సినిమా కాకుండా జనాలకు ఎంటర్టైన్మెంట్కు సర్కస్ పెద్ద వేదికగా ఉండేది. కొన్ని సర్కస్ కంపెనీలు చిన్నా పెద్ద టౌన్లకు కూడా వెళ్లి నెలా రెండు నెలలు వినోదాన్ని పంచి తిరిగి మరో చోటుకు వెళ్లేవి. అలాంటి రోజుల్లో ప్రతి ఇంటికి సర్కస్‌ను మోసుకొచ్చింది దూరదర్శన్. 1989లో పంతొమ్మిది వారాల పాటు సర్కస్ ఫీట్లతో ఇంటిల్లిపాదినీ తన ప్రపంచంలోకి లాక్కొచ్చింది. ప్రపంచంలో ఉన్నదంతా సర్కస్‌లో ఉందని చూపింది. ఎందుకంటే సర్కస్ అనేదే ఓ ప్రపంచం కాబట్టి. అక్కడ రాగద్వేషాలున్నాయి, గుండెదాటని కష్టాలున్నాయి, ఎగిసిపడే కెరటాలున్నాయి. మంచి ఉంది. చెడు ఉంది. దీని కోసం రచయిత దర్శకులు అజీజ్ మిర్జా, కుందన్ షాహ్‌లు కలిసి ఒక సర్కస్ ట్రూప్నే తయారుచేశారు. దీంట్లో షారూఖ్ ఖాన్, రేణుకా సహానే, అశుతోష్ గోవరికర్ వంటి ముఖ్యులు నటించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రసారమైన ఈ సీరియల్‌ని పిల్లలు సర్కస్‌కి వెళ్లినంతగా ఎంజాయ్చేశారు. కళాకారుల నిలయం సర్కస్ అనేది కొంతమంది కలిసి పనులు చేసుకుంటూ, తమకు వచ్చిన కళను ప్రదర్శిస్తూ ఉండే ఒక కంపెనీ మాత్రమే కాదు. కొంతమంది చుట్టూత కలిసి ఉండే జీవితం. అది అపోలో సర్కస్. దాని యజమాని బాబూజీ. సర్కస్ కంపెనీలో ఉన్నవారందరినీ తన బిడ్డల్లానే చూసుకునేంత ఉదాత్తుడు. పై చదువుల కోసం కొడుకు శేఖరన్ని వేరే చోట ఉంచి చదివిస్తుంటాడు. సర్కస్‌లోని కష్టనష్టాలేవీ కొడుకుకు తెలియవు. రోజు రోజుకూ సర్కస్‌ను నడపడం భారంగా అనిపిస్తుంటుంది బాబూజీకి. అయినా, దాంట్లోనే పుట్టి పెరిగిన బాబూజీ సర్కస్ని కాపాడుకోవడమే ధ్యేయంగా జీవిస్తుంటాడు. ఒకసారి జంతువులను అమ్మే సింగ్ బాబూజీని కలిసి, తన దగ్గర ఉన్న ఎలుగును కొనుగోలు చేయమని అడుగుతాడు. కానీ, బాబూజీ తనకున్న ఆర్థిక కష్టాల గురించి చెప్పి వద్దంటాడు. చదువు పూర్తయి తన కొడుకు శేఖరన్ సర్కస్‌కి వస్తున్నాడని అందరికీ చెబుతాడు బాబూజీ. శేఖరన్ చిన్ననాటి నేస్తం మరియతో పాటు అంతా సంతోషిస్తారు. శేఖరన్ వచ్చాక సర్కస్‌లో అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ముందు వద్దనుకున్న ఎలుగును శేఖరన్ కోసం కొనడానికి సిద్ధమవుతాడు బాబూజీ. అయితే, శేఖరన్ సర్కస్ తనకు వద్దని, సొంతంగా ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెడుతుంటాడు. కొడుకు మాట కాదనలేక బాబూజీ మౌనంగా బాధపడుతుంటాడు. సర్కస్ పనులు వదిలేసి తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి తిరిగి స్నేహితుల వద్దకు వెళ్లిపోతాడు శేఖరన్. కొడుకు మీద ఆశ వదులుకున్న బాబూజీ సర్కస్‌లో క్లిష్టమైన ఫీట్ చేయడానికి సాహసిస్తాడు. ఆ సమయంలో గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చేరుతాడు. విషయం తెలిసి శేఖరన్ తండ్రి వద్దకు వస్తాడు. తండ్రి బాగు కోసం సర్కస్ ఎప్పటిమాదిరిగానే నడుస్తుందని, తానే దగ్గరుండి చూసుకుంటానని మాట ఇవ్వడంతో అంతా సంతోషిస్తారు. శేఖరన్ ఆధ్వర్యంలో సర్కస్‌కి కొత్త రూపు వస్తుంది. ప్రమాదాల ప్రయత్నం తాగుబోతైన జొనాథన్‌ని బాబూజీ సర్కస్ నుంచి బయటకు వెళ్లగొట్టకుండా, తాగడానికి డబ్బులు కూడా ఇవ్వడం కంపెనీలో చాలా మందికి అర్థం కాదు. అతని వల్ల కంపెనీకి ఎలాంటి ప్రయోజనం లేదని కొందరు భావిస్తారు. అయితే, జొనాథన్ అపోలో సర్కస్‌కు విశ్వసనీయుడని తెలుసుకుంటారు. జొనాథన్ యువకుడిగా ఉన్నప్పుడు అపోలో సర్కస్‌లో ట్రపీజ్ ఆర్టిస్ట్. ప్రదర్శన సమయంలో జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోతాడు. దీంతో తప్పనిసరిగా అతను తన కళ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కూతురు మరియను తనలా ట్రపీజ్ ఆర్టిస్ట్ కావాలని, సర్కస్ ఫీట్లు చేయాలని బలవంతం చేస్తాడు. సర్కస్‌లోని వారంతా జొనాథన్ తపనను అర్ధం చేసుకొని, సర్దిచెబుతారు. కూతురుని క్షమించమని అడుగుతాడు జొనాథన్. తండ్రి తపించే కళను తనూ నేర్చుకోవాలని రోజూ ఫీట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటుంది మరియ. కానీ, తన వల్ల కాకపోవడంతో బాధపడుతుంది. మాజీ ట్రపీజ్ ఆర్టిస్ట్ షామిలీ మాటలతో స్ఫూర్తి పొందిన మరియ మళ్లీ ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంతో మరియ విజయవంతం అవడంతో జొనాథన్ సంతోషంతో పొంగిపోతాడు. సర్కస్‌లోని వారంతా అభినందిస్తారు. ప్రియమైన సర్కస్ సర్కస్ కంపెనీయే తమ ఇల్లుగా భావించే అందరి మధ్య ఒక విడదీయ లేని ప్రేమ ఉంటుంది. పెద్దవాళ్లు పిల్లల ఆలనపాలనా చూడడటం, పిల్లలు పెద్దవాళ్లతో కలిసిపోవడం.. కుటుంబాన్ని తలపిస్తుంది. అయితే, సర్కస్ సీరియల్ అనగానే షారూఖ్, రేణుకా సహానే ప్రేమే మన కళ్ల ముందు కదులుతుంది. అయితే, అంతకు ముందే షామిలీ– ఆదిత్య ప్రేమ కళ్లకు కడుతుంది. సర్కస్‌లోనే వయోలిన్ ఆర్టిస్ట్ ఆదిత్య, ట్రపీజ్ ఆర్టిస్ట్ షామిలీ ప్రేమించుకుంటారు. అయితే, షామిలీని రింగ్ మాస్టర్ సుబృద్ ప్రేమిస్తాడు. ఆదిత్య మీద తప్పుడు నేరం మోపి జైలు శిక్ష పడేలా చేస్తాడు సుబృద్. ఆ తర్వాత షామిలీని పెళ్లి చేసుకుంటాడు. పదేళ్ల తర్వాత ఆదిత్య జైలు నుంచి తిరిగి వస్తాడు. విషయం తెలిసిన షామిలీ చాలా బాధపడుతుంది. షామిలీ తిరస్కారం సుబృద్ని బాధిస్తుంది. ప్రదర్శన మధ్యలో సుబృద్ పులి పంజా బారిన పడతాడు. పెళ్లి తర్వాత ట్రపీజ్ ఆర్ట్‌కు దూరమైన షామిలీ పదేళ్ల తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేసి తన ఫీట్లతో తిరిగి పాత వైభవాన్ని పొందుతుంది. శారీరక వైకల్యంతో బాధపడే కళందర్ తల్లిదండ్రుల నుంచి ఎలా దూరమయ్యాడో గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటాడు. దూరమైన తల్లిదండ్రులు ఒకరోజు కళందర్ని సర్కస్‌లో కలుసుకుంటారు. కళందర్ తమ కొడుకు జగదీష్ అని, చిన్నప్పుడే తమ నుంచి దూరమైన బిడ్డ అని, తమతో పాటు రమ్మంటారు. ఈ సర్కసే తన ఇల్లు అని, ఇదే తన ప్రపంచం అని చెప్పి కంటతడిపెట్టిస్తాడు కళందర్. అపోలో సర్కస్‌లో జరుపుకునే పండగలు, జంగూమంగూ చేసే కామెడీ సర్కస్ అంతా సందడిని నింపుతుంది. మనస్ఫూర్తిగా బాధ్యత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన∙బాబూజీ సర్కస్‌లో వచ్చిన మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు. సంబరంగా జరుగుతున్న సర్కస్ ప్రదర్శన మధ్యలోనే బాబూజీ ప్రాణాలు వదలుతాడు. సర్కస్‌ను నడపడం తన వల్ల కాదంటాడు శేఖరన్. అంతా బాధలో మునిగిపోతారు. అర్థరాత్రి నిద్రపట్టక కూర్చున్న శేఖరన్‌కి తన తండ్రి ఆ సర్కస్‌లోనే కనిపిస్తుంటాడు. శేఖరన్ వద్దకు వచ్చిన మరియ తెల్లవారేసరికి సర్కస్‌ను వదిలిపెట్టి నీదైన ప్రపంచంలోకి వెళ్లిపొమ్మంటుంది. శేఖరన్ని తీసుకెళ్లడానికి అతని స్నేహితుడు వస్తాడు. బయటి వరకు వచ్చిన శేఖరన్‌కి తండ్రి ఫొటో లోపలే మర్చిపోయానని గుర్తొచ్చి తిరిగి సర్కస్‌లోకి వెళతాడు. అక్కడ తండ్రి తనను విడిచి వెళ్లద్దని అదృశ్యంగా చెప్పే మాటలు శేఖరన్లో మార్పు తీసుకువస్తాయి. శేఖరన్ మనస్ఫూర్తిగా సర్కస్ బాధ్యతలు స్వీకరించడంతో సీరియల్ ముగుస్తుంది. ఒక యువకుడు ఇబ్బందుల్లో ఉన్న తండ్రి సర్కస్‌ను తను తీసుకొని ఎలా మేనేజ్ చేశాడన్నదే ఈ కథ. సర్కస్ కంపెనీతో తండ్రికి ఉండే బంధం, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కొడుకుతో పాటు కంపెనీలో ఉన్నవారిందరూ పడే తపన మన కళ్ల ముందు కదలాడుతుంది. – ఎన్.ఆర్ బాలీవుడ్ బాద్షా, సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ముప్పై ఏళ్ల క్రితం అప్పుడప్పుడే నటనలో నిలదొక్కుకోవడానికి శ్రమిస్తున్న రోజులు. షారూఖ్‌కి ఫస్ట్ బ్రేక్ ఫౌజీ సీరియల్‌తో టీవీ అవకాశం ఇచ్చినా ఇప్పటికి షారూఖ్ ఇండస్ట్రీలో ఫస్ట్ డేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సర్కస్ సీరియల్ ప్రస్తావనే వస్తుంది. దూరదర్శన్ షారూఖ్ నటనకి సర్కస్‌తో ఓ పెద్ద వేదికనిచ్చింది. -
సింహం దాడి నుంచి భయటపడ్డ సర్కస్ ట్రైనర్
-
వైరల్ వీడియో : చావు నోట్లో నుంచి బయటపడ్డాడు
కియెవ్ : ఉక్రేయిన్ సర్కస్‌లో ఓ భయానక సంఘటన చోటు చేసుకుంది. మాస్టర్ చెప్పినట్లు ఆడాల్సిన సింహం కాస్తా.. అతని పాలిట మృత్యుదేవతగా మారింది. చచ్చన్రా దేవుడా అనుకున్న సమయంలో అనూహ్యంగా సింహం బారి నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ప్రముఖ సర్కస్ ట్రైనర్ హమడా కౌత సర్కస్‌లో ప్రదర్శన నిర్వహిస్తుండగా సింహం ఒక్కసారిగా అతని మీద దాడి చేసింది. అతని కంఠం వద్ద పట్టుకుని.. దాడి చేయడానికి ప్రయత్నించింది. అంతసేపు దీన్ని కూడా సర్కస్‌లో విన్యాసంగానే భావించారు జనాలు. కానీ మ్యూజిక్ ఆగిపోయాక భయంతో కేకలు వేస్తోన్న హమడా అరుపులు ప్రేక్షకులకు వినిపించాయి. కళ్లేదుట జరుగుతున్న దారుణాన్ని చూసి ప్రేక్షకులు కూడా స్థంభించిపోయారు. అదృష్టవశాత్తు హమడా సింహం దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయం గురించి అతను మాట్లాడుతూ.. ‘షోలో భాగంగా నేను ఒక సింహాన్ని పిలుస్తుండగా మరో సింహం నా మీద డాడి చేసింది. అది నా మీదకు దూకింది.. కానీ అదృష్టవశాత్తు నా మెడ మీద దాడి చేయలేదు. దేవుడి దయ వల్ల నా కాలు, చేతికి మాత్రమే చిన్న చిన్న గాయాలయ్యాయి. కాకపోతే అప్పటికే నా శరీరం పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. ఈ సంఘటన చూసి ప్రేక్షకులు భయంతో కేకలు వేయడం ప్రారంభించారు. నేను వారిని ప్రశాంతంగా ఉండమని కోరాను. ఆ తర్వాత ఎలానో సింహం బారి నుంచి తప్పించుకోగలిగాను. అనంతరం యధావిధిగా ప్రదర్శన నిర్వహించామ’ని చెప్పుకొచ్చారు. -
రాకెట్ తేజ్‌బలి
అలీబాగ్‌లో ఎర్రటి సంధ్యాసమయపు సుదీర్ఘమైన సముద్రతీరంలో దూరంగా ఒక్కడే నడుస్తున్న రాకెట్ తేజ్‌బలి కాస్త ఎక్కువ ఎర్రగా మెరుస్తున్నాడు. చప్పున చూస్తే అతను ఇటువైపు వస్తున్నాడో లేదా అటువైపు వెళుతున్నాడో తెలియటం లేదు. ఒకింత భేల్పురి, ఐస్‌క్రీం స్టాళ్ళున్న ఈ రద్దీస్థలం నుంచి అతను చాలా దూరంలోనే ఉన్నాడు. ఊరిజనానికి ఈ సముద్రం, సూర్యాస్తమయం ఏవీ కొత్త కాదు. అందువల్ల ఇక్కడ అంతగా జనసంచారం ఉండలేదు. అయినా నగరంలోని గులాభా నుంచి తాత్కాలికంగా తప్పించుకునే భ్రమలో వంద కిలో మీటర్ల దూరంలోని ముంబయి నుంచి వచ్చిన కొన్ని పిక్నిక్ బృందాలు సాయంత్రపు ఎరట్రి నీటిలో ఈతకొడుతున్నాయి. కోలాహలం వల్ల ఊపిరి కట్టివేసే ముంబై సముద్రతీరాలనే చూసినవారికి ఈ నిరాటంకమైన పొడవైన తీరం, భయం పుట్టించేంత నిర్జనంగా అనిపిస్తోంది. ఈ అరుదైన వ్యక్తులకు కూడా కావలసినంత దూరంలో వున్న తేజ్‌బలి నడుస్తున్నాడు. లేదా నుంచున్నాడు. అప్పుడప్పుడు సముద్రం నుంచి వేగంగా వీస్తున్న గాలికి నిప్పులా ధగధగ మెరుస్తున్నాడు. అలీబాగ్ బీచ్ సమీపంలోనే క్యాంప్ వేసిన ‘మిలన్ డెత్ వెల్’లోని ప్రధాన మోటర్ సైకిల్ నడిపే తేజ్‌బలికి, రాకెట్ తేజ్‌బలి అనే విశేషణం ఏనాటినుంచి ప్రాప్తమైందో అతనికీ గుర్తులేదు. ఇప్పుడతనికి యాభై సమీపిస్తోంది. బహుశా పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం డైమండ్ సర్కస్ నుంచి వేరుపడినపుడే అతను రాకెట్ తేజ్‌బలి అయివుండాలి. అప్పుడు ‘మృత్యుగోళపు’ శరవేగపు మోటర్‌బైక్ వీరుడయ్యాడు. అక్కడి నుంచి బయటపడ్డ తరువాత విశాలమైన బావిలాంటి మృత్యుకూపాల వివిధ కంపెనీలను మార్చుతూ ఇప్పుడు గత ఐదారేళ్ళ నుంచి ఈ ‘మిలన్ డెత్ వెల్’లో చూపరుల ఒళ్ళు జలదరించేలా మోటర్‌బైక్ నడుపుతున్నాడు. చెవిపక్కన సైడ్‌లాక్‌లు నెరిసిన తేజ్‌బలి, కూపంపైనున్న వేదికమీద సకలజనుల దృష్టిని ఆకర్షించాలనే పెట్టినటువంటి మడ్గార్డ్లేని, విచిత్రమైన మూపులాంటి ఎర్రటిఎరుపు పెట్రోలు ట్యాంకు కలిగిన పాత మోటర్‌సైకిల్ మీద కూర్చోని యాక్సిలరేటర్ తిప్పి దిక్కులు పిక్కటిల్లే చప్పుడు రేపేటప్పుడు, పాత వెస్టర్న్ ఇంగ్లిషు చిత్రాల నాయకుడిలా కనిపిస్తాడు. ఇక ఆకాశంలో విస్ఫోటించే రాకెట్లా ఏకాగ్రచిత్తంతో ఒంటరిగా నిశ్చలంగా ఉంటాడు. ఇవాళ అలీబాగ్ క్యాంప్‌లో చిట్టచివరి రోజు. రాత్రి పదిగంటల ఆటే చివరిది. గత పదిహేను రోజుల ఈ క్యాంపులో ఒక్కరోజూ తప్పించకుండా, తేజ్‌బలి సూర్యాస్తమయ సమయంలో ఈ తీరానికి వచ్చేవాడు. పది సెకండ్లయినా సరే, నల్లతేలులా ఉన్నటువంటి పాత యెజ్డీ బైక్‌లో ఫట్‌ఫట్‌మని చిమ్ముకొచ్చి తీరంలో పల్లంవుంటే, తడిసినప్పటికీ గట్టిగా ఉన్న రేవు పొడవునా పరుగెత్తించి తిరిగొస్తాడు. అతడి వెనుక పిల్లలు పరుగెత్తుకు వస్తే– కేకలు వేసి, వేగంగా బైక్ నడిపి, చీకటి కమ్ముకోసాగిన వాడిన పొదలగుంపు వెనుక కనుమరుగైపోతాడు. చాలాసేపటి వరకు సైలెన్సర్ లేని ఆ నల్లతేలు ఫట్ఫట్మంటూ సద్దు చేస్తూ తీరంలోని గాలిలో నిలిచిపోతుంది. రేపటి నుంచి ఈ సాయంత్రపు సూర్యాస్తమయంలోని ఈ క్షణం మళ్ళీ ఇక్కడ ఉండదనే ఆలోచన అతను ఊహించిన దానికన్నా అధికంగా అతడిని ఆవరించుకుందా అన్నట్టు, ఇవాళ అతను తన నల్లతేలును కొబ్బరిబోండాలవాడి పక్కన నిలిపి, మౌనంగా రేవు తీరంలో నడిచిపోయాడు. ప్రవాహం తగ్గటంవల్ల సముద్రం వెనక్కి జరిగింది. తడి తీరంలో సాయంత్రపు ఎరుపు ప్రతిఫలిస్తూ ప్రత్యేకమైన ఓ మెరుపు అంచుమీద తేజ్‌బలి అడుగులు మృదువుగా ఏర్పడ్డాయి. కళ్ళనిండా నీళ్ళు వచ్చినట్టు, ఈ అడుగులు ఏర్పరిచిన ఇసుక చెలమలలో నీరు ఉబికి వస్తోంది. ఎదురుగా ఉన్న సముద్రంలో నిలబడిన పాతకోట ఇటువైపు నుంచి నీడను తొడుక్కుంటూ నల్లబారుతోంది. ప్రతిరోజూ దాన్ని చూశాడు. ఇక్కడి నుంచే. అయినా అక్కడికి వెళ్ళాలనిపించలేదు. ప్రవాహం మరీ తక్కువగా ఉన్నప్పుడు కోటవరకూ ఇసుక తీరం ఏర్పడి ప్రజలు అక్కడికి నడుచుకుంటూనే వెళతారట. ఆటుపోట్లు ఉన్నప్పుడే ఏవేవో రేవుల నుంచి చిన్నపడవల్లో, లాంచీలలో వచ్చిన జనం ఈ కోట నడిగడ్డవైపు ఊగుతూ సాగుతారు. ఈ కోట ఎప్పుడో ఎక్కడో పడిన స్వప్నంలా ఉంది. దాని అస్పష్టమైన కిటికీలలో చీకటి కమ్ముకుంటోంది. దాని ప్రాంగణంలోని చెట్లనిండా నల్లటి పక్షులు కూర్చున్నట్లున్నాయి. విరిగిన కోట బురుజు చిరిగిన భూపటంలా నిలుచోనుంది. తేజ్‌బలి మళ్ళీ వస్తానని కేకవేశాడు. వేలాది ఊళ్ళలో ఉన్నాడు. అయితే ఎక్కడా ఏదీ ఇలా ఆకర్షించలేదు. డెత్ వెల్ అడుగున ఉన్న చిన్న తలుపు తోసి లోపలికి చేరి తలుపు మూసుకుని పైకి చూస్తాడుకదా, పైన బావిచుట్టూ వేదిక మీదికి వంగి నుంచున్న వందలాది కళ్ళ నేపథ్యంలో లోతైన ఆకాశం ఉంది. జనం కొట్టిన చప్పట్లు బావిలోకి రాలిపడతాయి. మెల్లగా ఎర్రటి మోటార్‌బైక్ కిక్ కొట్టినపుడు జనసమూహం ఉద్రిక్తతతో నిటారుగా నుంచుంటుంది. రాకెట్లా తేజ్‌బలి రివ్వురివ్వురివ్వుమని పైకెక్కి వస్తాడు. అంతే. మొత్తం డెత్ వెల్ కంపిస్తుంది, వీక్షకులు భయపడేలా. ఐటం ముగిసి కాస్త అడ్డదిడ్డంగా తిరిగి కిందికి దిగి మధ్యనున్న గరుడ స్తంభానికి వాహనాన్ని ఆనించి, బావి అడుగున ఉన్న చిన్న తలుపు తోసి కూపం బయటికి వెళతాడు. బయటకూడా అదే సమూహం. అన్ని ఊళ్ళల్లోనూ అదే సమూహం. ఏ కలలోనూ రానటువంటి సమూహం. ఎవరో మంత్రం వేసినట్టు రాత్రి పది అవగానే కరిగిపోయే సమూహం. ఈ సమూహాన్ని దాటి, దాని చేతులు, ఒళ్ళు నిమిరి, తేజ్‌బలి సముద్రతీరాన్ని చేరేవాడు. అంచులో నిలబడి కోటను చూసేవాడు. కోటను చుట్టుముట్టిన సముద్రం నెమ్మదిగా అతడి పాదాలను తడిపి, వేగంగా వెనక్కు జరుగుతూ పాదాలకింది ఇసుకనూ తోడేసేది. తేజ్‌బలి ‘మళ్ళీ వస్తాను’ అని కేక వేసేవాడు. ఒకవిధంగా చూస్తే అతడిని ఇవాళ ఇలా స్వేచ్ఛగా తీరానికి పంపే పెద్దమనస్సు చూపినవాడు యజమాని రామ్‌ప్యారే. చివరిరోజు కావటంవల్ల అన్ని షోలలోనూ నువ్వు ఉండాల్సిందే అని ఒత్తిడి పెట్టకుండా, ‘‘తేజ్‌బలి, నీపాటికి నువ్వు తిరిగిరా. ఈ రోజు ఛగున్, పట్టూలు ఐటం చేస్తారు. వారు సొంతంగా నిర్వహించడానికి తయారుకావాలి కదా! వెళ్ళు. మజా చెయ్. రేపు ఉదయం మనం ఊరు వదులుతాం. గుర్తుంచుకో’’ అని నల్లతేలు కీ ఇచ్చాడు రామ్‌ప్యారే. అప్పుడు అతను కాస్త కలవరంలో ఉన్నట్టు కనిపించాడు. రామ్‌ప్యారే కళ్ళల్లో తేజ్‌బలి గురించి ఎప్పుడూ గుప్తమైన ఆరాధన భావమొకటి ఉన్నట్టుండేది. తలుచుకుని వుంటే, అదృష్టం వరించివుంటే, మరెక్కడో వెలిగిపోగలిగే తేజ్‌బలి అంతఃసత్వాన్ని గాఢంగా గౌరవించేవాడిలా రామ్‌ప్యారే వ్యవహరించేవాడు. రోజురోజుకూ దివాలా తీస్తున్నప్పటికీ తేజ్‌బలి జీతాన్ని, అతడి బైకుల సర్వీసింగ్‌లను తప్పకుండా నిర్వహించేవాడు. ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికైనా ముందు తేజ్బలిని ఒక మాట అడగటం అతడికి అలవాటైంది. ‘‘నువ్వు గొప్ప కళాకారుడివి. అంతే గొప్ప వ్యక్తివి. ఏమిటో నీ అదృష్టానికి పక్షవాతం వచ్చింది. అందువల్లే ఈ సామాన్యమైన స్టంట్ కళల కంపెనీకి వచ్చావు. మాకేమో నీవల్ల మంచే జరిగింది. అయితే నీకు తగిన స్థలం, గౌరవం ఇచ్చే స్థితి మాదికాదు. ఉన్నదాంట్లోనే సర్దుకుందాం’’ అనే రీతిలోనే అతని తీరు ఉండేది. తేజ్‌బలి ఆకర్షణీయమైన దుస్తులను సమయానికి ఉతికి లాండ్రీ చేయించే ఏర్పాటు గత సంవత్సరం ఇచలకరంజి క్యాంపులో రద్దయింది. అప్పుడు ఆదాయమే లేని, ‘మిలన్ డెత్ వెల్’ బిక్కుబిక్కుమంటోంది. జనరేటర్, విద్యుత్ మండలి లంచం, వేదిక అద్దె, స్థలానికి డిపాజిట్ –అన్నీ సమకూర్చేలోపు దివాలా తీసిన రామ్ప్యారేతో లాండ్రీ విషయంలో గొడవ పడటం సమంజసం కాదనిపించి తేజ్‌బలి మౌనం వహించాడు. తన దుస్తుల ఖర్చు తానే చూసుకోసాగాడు. ఒక రాత్రి తాగిన మత్తులో రామ్‌ప్యారే, ‘‘నిన్ను బాగా చూసుకోలేకపోతున్నాను. క్షమించు’’ అని తేజ్‌బలి కాళ్ళమీద పడి ఏడవసాగాడు. ‘‘వద్దు సేఠ్, వద్దు’’ అని తేజ్‌బలి అనగానే, ‘‘సేఠ్ అని నన్ను పిలవకు’’ అని అరిచి తన చెంపలు తానే వాయించుకున్నాడు. అతుకులు వేసిన జీన్స్ ప్యాంటులో ఉన్న రామ్‌ప్యారే కన్నీళ్ళను తన షర్ట్ చేతులకు తుడుచుకున్న క్షణంలో తేజ్బలిలో ఏదో పొంగినట్టయ్యింది. జుట్టంతా నెరిసిపోయిన తలను తట్టి – ‘‘నీకు మంచి కాలం వస్తుంది. విచారించకు’’ అన్నాడు. దీన్ని నమ్మటానికి ఎదురుచూస్తున్నవాడిలా రామ్‌ప్యారే ‘‘నిజంగా, అవునా’’ అని కళ్ళు విప్పార్చి,‘‘నా టైమ్ బాగవ్వనీ తేజ్‌బలి, నిన్ను దేవుడిలా చూసుకుంటాను. నీకొక ఫుల్‌టైమ్ అసిస్టెంట్ కుర్రవాడిని ఇస్తాను’’ అని కొత్త ఆవేశంతో బయటికి నడిచాడు. ఒక విధమైన అబద్దపు వాగ్దానాన్ని పరస్పరం ఇచ్చుకున్నట్టున్న ఆ క్షణం తరువాత తేజ్‌బలికి తను మిలన్ డెత్ వెల్‌కు భారంగా మారాడనే భావన అతడి గుండెను బరువెక్కించసాగింది. వంట చేసే ఆట ఆడే పిల్లలు ఉత్తుత్తి భోజనం చేస్తున్నట్టు నటిస్తూ, చిన్నచిన్న గరిటెలతో వడ్డించినట్టు –తాము భవిష్యత్తు గురించి, జీవితం గురించి కలలను కంటున్నట్టు అనిపించింది. ఇది జరిగిన కొన్నిరోజుల తరువాత అర్నాళా క్యాంపులో ఒక చిన్న ఇబ్బంది కలిగింది. డెత్ వెల్ చుట్టూ వరుసగా ఏర్పాటు చేసిన విద్యుత్ బల్బుల మాలికలో ఒక చోట తెగిన వైర్‌ను అకస్మాత్తుగా తాకిన ఓ చిన్న అమ్మాయి షాక్ తగిలి మూర్ఛపోయింది. అదృష్టవశాత్తు ఆమె తేరుకున్నప్పటికీ ఊరిజనం కోపానికి ‘మిలన్ డెత్ వెల్’ ముక్కలైంది. జనం వేదికను విరిచేశారు. పోస్టర్లకు తారుపూశారు. భయపడి అర్నాళ కొండల్లో దాగి కూర్చున్న రామ్ప్యారేను తరుముకుంటూపోయి వెదికి కొట్టారు. చాలా రోజులు ‘డెత్ వెల్’ స్పీకర్లు మౌనంగా ఉన్నాయి. తేరుకున్న అమ్మాయికోసం పరిహారం వసూలు చేయడానికి వచ్చిన స్థానిక యువనాయకులు, తన బైక్‌కు బ్రాస్ పూసి మెరిసేలా చేస్తున్న తేజ్బలితో– ‘‘ఎందుకు హీరో, పని లేదా? మా ఎలెక్షన్ ప్రచారానికి రా, భోజనం పెడతాం. కోడికూరతో భోజనం’’ అని వెక్కించారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇది తనకొక దుర్భరమైన క్షణమనిపించింది. ఇలాంటి కఠిన సమయంలోనే మార్పు సాధ్యమని బలంగా అనిపించింది. రామ్‌ప్యారే భారాన్ని దించడానికి ఇది తగిన సమయం అనిపించి మెల్లిగా రామ్‌ప్యారే దగ్గరికి వెళ్ళి, ‘‘ప్యారేజీ, నీకు నీ భారమే ఎక్కువగా ఉంది. నా వల్ల ఎలాంటి సహాయం లేదు. నేను మీకు ఊరకూరకే భారమవకూడదు. నాకు పోయిన నెల జీతం వద్దు. నేను మరో ఉద్యోగం వెతుక్కుంటాను. ఎంత లేదన్నా పన్వెల్, కల్యాణ్‌లలో డ్రైవర్ ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. గత రెండేళ్ళల్లో ముంబయి ఫ్యాక్టరీలన్నీ మూతపడి జనం వీఆర్ఎస్ అనే పిడుగుకు బలి అయ్యారట. వచ్చిన సొమ్ముతో పిచ్చివాళ్ళల్లా బిజినెస్ బిజినెస్ అని మాక్సీ క్యాబ్, టాటా సుమో, క్వాలిస్ అని అద్దెకు తిప్పటానికి వాహనాలు కొనుక్కుంటూ ఉన్నారట. అందువల్ల మంచి డ్రైవర్‌కు చాలా డిమాండు ఉందట. వెళతాను. కచ్చితంగా ఉపవాసం ఉండను ప్యారేజి. నమ్మండి. మీ పరిస్థితి కుదుటపడనివ్వండి. అప్పుడు కచ్చితంగా వచ్చి చేరుతాను’’ – అని చెయ్యి పట్టుకుని ఎవరి గొంతుతోనో మాట్లాడుతున్నవాడిలా అన్నాడు. రామ్‌ప్యారే కళ్ళల్లో ఒక క్షణం విముక్తి పొందిన మెరుపు కనిపించినప్పటికీ, ఆ మెరుపు తేజ్‌బలికి తెలిసిపోయిందనే సత్యాన్ని మరుగుపరుస్తున్నట్టు తన చేతిలో ఉన్న అతడి రెండు చేతులను తన ముఖానికి హత్తుకుని – ‘‘ఛీ! ఇలాంటి రోజు నాకు వచ్చేసిందా’’ అని నిట్టూర్పు విడిచాడు. ‘‘నువ్వు పులివి తేజ్‌బలి, పులి. పులి ఉపవాసం ఉంటుంది. కానీ కచ్చితంగా గడ్డి తినదు. నువ్వు గడ్డి తినకూడదు. నువ్వు వీరుడివి. నైపుణ్యం కలవాడివి. సమాజం నిన్ను తలమీద పెట్టుకోవాలి. సమాజపు ఇల్లు పాడైపోయింది. నేను? నేనూ నిన్ను చూడకపోతే? ఆ!’’ అని చెబుతూ వెంటనే విముక్తి పొందే క్షణాన్ని తనే చేతులారా పోగొట్టుకుంటున్నాడేమోననే భయంతో ఆగిపోయాడు. అతని రెండు కళ్ళూ డెత్ వెల్ ఖాళీ బావుల్లా కనిపిస్తున్నాయి.ఆ నిరాశ నిండిన చూపుల్లో తేజ్‌బలికి తన విముక్తిదారి కూడా కనిపించినట్లయ్యింది. మాట్లాడటం మొదలుపెడితే మళ్ళీ అంతా కలగాపులగం అవుతుందనిపించి మెల్లగా నడుస్తూ తన టెంట్‌కు వెళ్ళాడు. రాత్రి ఒక్క బల్బు వెలిగించుకుని అందరూ భోజనం చేస్తున్నప్పుడు మోటర్‌బైక్ గర్జించినట్టు రామ్ప్యారె అరవసాగాడు – ‘‘పోనీ, పెద్దవాళ్ళందరూ పోనీ, మేము బాగుండాలని వాళ్ళనంతా కట్టివేయడానికి సాధ్యమా? మాతోపాటు మీరు ఉపవాసం ఉండండని చెప్పటానికి నేనెవరిని? ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో–అందరూ వెళ్ళిపోండి. అయితే ఎవరి సొమ్ము బాకీ ఉంచుకోలేను. తీర్చేశక్తి నాకు లేదు. జనరేటర్ అమ్మి తరువాత ఇస్తాను. ఒకనెల అయినా వ్యవధి కావాలి. నా మీద ఆ మాత్రం నమ్మకముంచి వెళ్ళండి’’. ఈ అరుపులు ఒక దశ తరువాత తేజ్బలితోపాటు స్వయంగా ప్యారేకూ పిల్లల ఆటల్లోని కేకల్లా అనిపించసాగాయి. మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే అంతా నాటకీయమయ్యేది. పైగా అది నాటకీయమైనకొద్దీ వాస్తవాన్ని గెలిచిన భ్రమ అయ్యేది. అబద్ధం అనిపించినట్టల్లా తేలికయ్యేది. చప్పున ఇద్దరికీ నవ్వొచ్చింది. అర్ధరాత్రివేళ చీకట్లో నిలబడ్డ చెట్లను భయపెట్టేలా పకపకా నవ్వసాగారు.తదుపరి క్యాంప్ నుంచి ప్రకటనల్లో రామ్‌ప్యారే – ‘‘మా అమితాబ్, మా సచిన్ టెండూల్కర్, మా రాకెట్ తేజబలి’’ – అని కేకలు పెట్టసాగాడు. అయితే ఈ ఆవేశంతోపాటు అంతరంగంలో ఎక్కడో – చేతులారా దగ్గరికి వచ్చిన ఒక మలుపును తన శక్తికి మించిన దుర్బలతవల్ల తానే పోగొట్టుకున్నవాడిలా కుంగిపోసాగాడు. కొత్త యువకులకు ఈ రాకెట్ తేజ్బలిలో అంత ఆకర్షణ కనబడలేదు. ఎంతగా మీసాలకు రంగువేసినా, ఎంత టైట్ జీన్స్ ప్యాంట్ తొడుక్కున్నా అతని మెడ దగ్గర వదులైన చర్మం, అతడి మోచేతుల మీద ఉబ్బిన నరాలు ఉదాసీనంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కొత్త ఉత్సాహంతో ఛగున్, పట్టూలు జరిపే స్టంటులలో తేజ్‌బలి అనుభవం లేకపోయినా, ప్రేక్షకులకు కావలసిన తారుణ్యపు కాంతి ఉండేది. అది నిగూఢ నాడులను ఉద్దీపింపజేస్తున్నట్టుగా ఉంది. మైమరుపును సహజంగానే బదిలీ చేసేలా ఉండేది. అయితే తేజ్‌బలి ఏదో పాతవైభవపు అవశేషంలా కనిపించేవాడు. యువకుల నుదుటి చెమట పూలమీది మంచుబిందువులా కనిపిస్తే, తేజ్‌బలి చెమట అలసట ధారలా కనిపించేది. రామ్ప్యారేకూ ఇది తెలియని విషయంకాదు. అయితే రామ్‌ప్యారే తేజ్‌బలి ద్వారా తన తారుణ్యపు ఉత్కర్షను పొందడానికి తపించేవాడు. వయస్సులో దాదాపు తనంతే ఉన్నప్పటికీ తేజ్‌బలి ఆ డెత్ వెల్‌లో టర్ర్ర్ అని తిరిగి తిరిగి ప్రేక్షకులు విసిరిన కర్చీఫ్‌లను మెరుపులా పట్టుకుని చప్పట్లు కొట్టించుకునేటప్పుడు ‘పరవాలేదు ఇంకా ఉంది’, ‘ఇంకా ఏదో ఉంది’, ‘ఇంకా మిగిలి ఉంది’ అనే భావాన్ని రామ్‌ప్యారే అనుభవించేవాడు. అయితే ఐటం చూసిన తరువాత వీరయోధుల్లా సవారులంతా గుమ్మంలో నుంచున్నప్పడు – బయటకువెళ్ళే ప్రేక్షకుల బృందంలోని యువతీయువకులందరూ ఛగున్, పట్టూలను చూడటానికి, చేతులు కలపటానికి సహజంగానే ఆకర్షితులైనట్టుగా, తేజ్‌బలి చేత ఆకర్షింపబడేవారు కాదు. తేజ్‌బలి వయసు ప్రేక్షకులూ ఇంకేదో జగత్తులో అప్పటికే కాలుపెట్టేవాళ్ళు. అందువల్ల చివరికి ఈ తేజ్‌బలి రాకెట్ కావటం కేవలం తన మనోలోకంలో అని రామ్ప్యారేకు కచ్చితంగా అవగాహన కలిగినా ఈ లోకమే అతడి పరమసత్యం కావటం వల్ల అతను దాన్ని కించిత్తూ లోపం లేకుండా శ్రమ వహించి కాపాడుకునేవాడు. మిలిటరీ హోటల్నుంచి మటన్ తెప్పిస్తే, మంచి ముక్కలను వెదికి తేజ్‌బలికి పంపేవాడు. ఇలాంటి రామ్‌ప్యారే వ్యావహారిక జగత్తుకు తన వల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు, ఇప్పటికీ తాను అక్కడి నుంచి బయటికి రాకపోతే అన్యాయమౌతుందనే అభిప్రాయాన్ని ఎందుకో గత వారంనుంచి ఈ అలిబాగ్ కడలితీరం దృఢపరుస్తోంది. ఎదురుగా కోట, విశాలమైన నిర్జనమైన ఇసుక మైదానం, ఎగరడానికి మరిచిన పక్షుల్లా ఒత్తుగా కూర్చున్న గాలిమరలు, అన్నీ ఒక విసర్జన ఘడియలోని కరువును అస్పష్టంగా తేజ్‌బలికి సూచిస్తున్నాయి.దట్టంగా నల్లబారబోతున్న ఎరుపులో నడుస్తున్న అతడు మనస్సుల్లోనే తాలీము చేయసాగాడు – ‘రామ్‌ప్యారే, నాకు తెలుసు. నీకు బాధ కలుగుతుంది. నాకు తెలుసు నువ్వు భయపడతావు. నాకు తెలుసు మనమిద్దరమూ పరస్పరం ఒకరికొకరు కావాలి. కానీ కుదరదు. ఇక చాలు ! నేను మిలన్ డెత్ వెల్‌ని వదిలిపెడుతున్నాను. మన ఇద్దరివల్ల మన ఇద్దరికీ జరగవలసిందంతా జరిగింది. ప్యారేజీ, ఈ ఆయుష్షు ఉన్నంత వరకూ అది మన వెంట తోడుగా ఉంటుంది. నన్ను వదిలేయ్. నువ్వు మెత్తబడ్డావు. ఈ యువకులు నిన్ను చూసుకోవాలి. ఎక్కువగా తాగవద్దు. లివర్ పాడవుతే అంతా ముగిసిపోతుంది. ఈ నల్లతేలును నాకు ఇవ్వు, చాలు. అది నన్ను వేరెక్కడికో తీసుకెళ్ళగలదు. దాని ఋణం నాపై ఉండనీ. అది నీలో నన్ను శాశ్వతంగా కట్టివేయగలదు. చూడు ప్యారే... ఈ కోట అది వేరే ఎవరో చూసింది కాదు. అది ఇప్పుడు నాకు కనిపిస్తోంది. ఈ తీరంలో నన్ను వదిలెయ్. కేవలం అడుగులే ఉన్నటువంటి, దారులే లేనటువంటి ఈ మృదువైన తీరంలో ప్రశాంతంగా వెళ్ళిపోనువ్వు’. అర్ధరాత్రి దాటేవరకూ తేజ్‌బలి అలాగే కాళ్ళుచాపి ఇసుకలోనే కూర్చునివున్నాడు. ఈ తావు కేవలం అతని ఏకాంత సమయం కోసమే వికసించినట్టుంది. కడలి సద్దు, సొగుసు, అన్నీ వేరు వేరు అవతారాలను ధరించసాగాయి. కోట పల్చటి మేఘాలను లాగుతోంది. అక్కడ ఎవరో వెలిగించి పెట్టిన దీపాలు అవునో కాదో అన్నట్టు వెలుగుతున్నాయి. అది మరికాసేట్లో తీరాన్ని వదలబోతున్న ఓడలా కనిపించసాగింది. ఇక్కడ చివరి ఆట తరువాత లవలేశమూ మిగలనట్టు ‘మిలన్ డెత్ వెల్’ రెండు పెద్ద పెద్ద లారీలలో చేరుకుంది. ‘‘సేఠ్, రాకెట్ సార్ ఇంకా రాలేదు. రాకెట్ సార్ ఇంకా రాలేదు’’ అని పనివాళ్ళు, ఛగున్, పట్టూలు అందరూ భయమూ, అయోమయాలతో తొందరపెట్టినపుడు రామ్‌ప్యారే, ‘‘అతను వస్తాడు. నాకు తెలుసు. మీ పనులు చూసుకోండి. పదండి. వేకువ ట్రాఫిక్ పెరిగేలోపు మనంహైవే చేరాలి. బయలుదేరుదాం’’ అని గద్దించాడు. పట్టూ– ‘‘సేఠ్, మన తర్వాతి క్యాంపు ఎక్కడో ఆయనకు తెలుసా? ఆయనను పిల్చుకునే వస్తాను. సముద్ర తీరంలో ఉంటారు...’’ అని అనగానే, రామ్‌ప్యారే, ‘‘చుప్, అతడిని ఎవరూ పిల్చుకుని రావలసిన అవసరం లేదు. అతనికంతా తెలుసు. అతనికంతా తెలుసు’’ అని తారాస్థాయిలో అరిచాడు. అతనికంతా తెలిసినట్టుంది. పరస్పరం ముక్తులయ్యే అవకాశాన్ని ఈసారి మళ్ళీ పోగొట్టుకోకూడదనే ఎరుక అతని అంతరంగంలో కంపిస్తోంది. తెల్లవారుతున్నప్పుడు హైవేలో లోనావాలా వైపు తిరిగిన ట్రక్కులలో అందరూ నిద్రపోయారు. రామ్‌ప్యారే మాత్రం రెప్ప వాల్చకుండా మొత్తం లారీ తన దేహమన్నట్టు విగ్రహంలా కదులుతూ, ఎదుటి రోడ్డునే చూస్తున్నాడు. ఇసుక తీరంలో, ఒరిగిన చోటే నిరాటంకంగా నిద్రపోయిన తేజ్‌బలి చుట్టూ నిలబడిన కొందరు పిల్లలు పరస్పరం ‘‘రాకెట్ తేజ్‌బలి, రాకెట్ తేజ్‌బలి’’ అని గుసగుసగా అంటూ, నిమజ్జనం మరుసటిరోజున ఒడ్డుకు వచ్చి పడిన విలక్షణ విగ్రహాన్ని చూస్తున్నట్టు, గాలికి ఎగురుతున్న అతడి ముంగురులనే చూస్తున్నారు.రెండు విభిన్న లోకాల మధ్యలో నిగూఢమైన ముక్త తంతులా దూరంలో నిల్చున్న నల్లతేలు, కొత్త కిరణాలలో తళతళమని మెరుస్తూ మొదటి కిక్ కోసం ఎదురుచూస్తోంది. కన్నడ మూలం : జయంత కాయ్కిణి అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
గురి
సర్కస్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ ఊళ్ళో అదే మొదటి ఆట.నింగిలో వేలాడే ఉయ్యాలల మీద నాజూకైన అమ్మాయిలు చేస్తున్న విన్యాసాలు, వారిని అనుకరించబోయి విఫలమై అంత ఎత్తునుంచీ కిందకి వలలో పడిపోతున్న మరగుజ్జు హాస్యగాళ్ళు, వారిని చూస్తూ కేరింతలు కొడుతున్న జనం. ఏమీ మారలేదు. జనాల కేరింతలు తనకి ఇప్పటికీ అదే ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆ కేరింతలు విని ఎంతకాలం అయ్యిందో! జైల్లో, ఆ నాలుగు గోడల మధ్యన, కేవలం తన ఉఛ్వాసనిశ్వాసలే తప్ప ఈ సందడేది?పరదా పక్కకి జరిపి ఆ జనాలకేసి చూశాడు మణి, అలియాస్ తల్వార్ మణి. అప్పట్లో తన ప్రదర్శన చూడటానికి జనాలు ఎగబడేవాళ్ళు. కేవలం తనవల్లే ఆ సర్కస్ నడిచిందన్నా అతిశయోక్తి కాదేమో! కానీ మునుపటి ఓపిక ఇప్పుడు లేదు. చూపు కూడా మందగించింది. కేవలం చినబాబు అడిగాడనే కాదు, తనMీ ఈ సర్కస్‌తో విడదీయలేని అనుంబంధం ఉంది. తను రూబీని కలిసింది కూడా ఇక్కడే. ఒకటా రెండా పద్నాలుగు సంవత్సరాల అనుబంధం, మరో పద్నాలుగు సంవత్సరాల ఎడబాటు! తన బలమైన కోరికో, లేక దైవేచ్చో మళ్ళీ ఇన్నేళ్ళకి ఇక్కడ అడుగుపెట్టాడు. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం అయిన పెద్దయ్య ఇప్పుడు పక్షవాతం వచ్చి కేవలం కుర్చీకే పరిమితం అయ్యాడని తెలిసినా, చినబాబుని బ్రతిమిలాడి ఆయనముందే మళ్ళీ తన పునరాగమనం జరగాలని, మొదటివరుసలోనే కూర్చొని దగ్గరగా పెద్దయ్య తనని చూడాలని పట్టుబట్టాడు మణి. సరే అనక తప్పలేదు చినబాబుకి. దూరంగా అచేతన స్థితిలో ఉన్న పెద్దయ్య మణిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. తరువాతి ప్రదర్శన తనదే. సిద్ధమవుతున్నాడు మణి. విసరవలసిన కత్తులు, కంటికి కట్టుకొనే ఆ నల్లగుడ్డ, అన్నింటినీ ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఆ కత్తులంటే అతనికి ఎంతో ప్రేమ. వెలుపల నుంచి తన పేరు పిలుస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. నోటితో గట్టిగా గాలి తీసి వదిలాడు. పరదా తొలగించుకుంటూ జనాల మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు తల్వార్ మణి. చెయ్యెత్తి అందరికీ అభివాదం చేశాడు. జనాలు లేచి మరీ చప్పట్లు కొట్టారు. అదీ అతని స్థాయి. దేశంలోనే అతనిలా కళ్ళకు గంతలు కట్టుకొని మనిషికి తగలకుండా కత్తులు విసరగలిగేవాడు మరొకడు లేడని అప్పట్లో అన్ని వార్తా పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చాయి. జనాలు స్థిమితపడ్డారు. ఎదురుగా సుమారు ఒక యిరవై అడుగుల దూరంలో గుండ్రపు చెక్కకి ఒక అమ్మాయిని తెచ్చి కట్టేశారు. ఎదురుగా అమ్మాయి. ఆమెకి కొంచెం పక్కగా పెద్దయ్య. అదీ మణికి కనిపిస్తున్న దృశ్యం. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయాడు మణి. రూబీ గుర్తొచ్చింది. ఇంతలో పక్కన ఉన్న వ్యక్తి, మణి దగ్గరున్న నల్లటి గుడ్డని తీసి అతని కళ్ళకు గట్టిగా బిగించాడు. నిశ్శబ్దం. అందరూ ఊపిరి బిగపట్టి మరీ చూస్తున్నారు, ఏం జరబోతోందో! ఆ ఆసక్తి వారి ముఖాల్లో స్పష్టంగా కనపడుతోంది. ఆ ఆమ్మాయిని కట్టేసిన గుండ్రపు చెక్కని తిప్పాడు పక్కనున్న వ్యక్తి. మణి కత్తి తీశాడు. తిరుగుతున్న ఆ చట్రంతో పాటు అతని బుర్రలో పాత జ్ఞాపకాలు కూడా గిర్రున తిరుగుతున్నాయి. ఎన్నడూ లేనిది తల్వార్ మణì æచెయ్యి మొదటిసారిగా వణికింది. రూబీ. పేరుకి తగ్గ రూపం. మొదటిసారి తనని చూసినప్పుడే తాను విసిరే కత్తిలా అనిపించింది మణికి. ప్రేమలో పడిపోయాడు. అది ప్రేమో, ఆరాధనో లేక మైకమో తేల్చుకోలేని స్థితి అతనిది. ఆమె కళ్ళను చూస్తూ జీవితాంతం గడిపేయగలననుకున్నాడు. అంతటి కట్టిపడేసే సౌందర్యం ఆమెది. ఇంతలోనే నిరాశ! తాను ప్రేమిస్తే సరిపోతుందా? ఆమె కూడా తిరిగి తనని ప్రేమించద్దూ! ఆశ పడటానికైనా హద్దుండాలని సరిపెట్టుకున్నాడు. తనని ఆమెకి తగ్గ అందగాడిగా ఎందుకు పుట్టించలేదని దేవుణ్ణి నిందించేశాడు కూడా! ‘‘ఇదిగో మణీ! ఈ అమ్మాయి నీతో పనిచేస్తుంది. పేరు రూబీ. నువ్వు రేపటి నుంచి ఈమెతోనే నీ ప్రదర్శనలు చేయాలి’’. ఒక్కసారి సర్కస్ ఫోకస్ లైట్లలాగా వెలిగిపోయింది మణి ముఖం. ఇంకా తాను వరమే కోరలేదు, అప్పుడే దేవత వరమిచ్చేసింది కాబోలు అనుకున్నాడు. చెంపలు వేసుకున్నాడు. తొందరపడి దేవుణ్ణి నిందించేశానే అని బాధపడ్డాడు. ‘‘ఆ అమ్మాయికి ఇదంతా కొత్త. నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి’’ అంటున్న సర్కస్ ఇంచార్జ్, మణి కంటికి అప్పగింతలు చేస్తున్న మామగారిలాగా కనబడ్డాడు. బయటపడలేని సంబరంతో లోపల ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు మణి. కాలం గడుస్తోంది. రూబీపైన విపరీతమైన ప్రేమని పెంచేసుకున్నాడు మణి. ఎంతగా అంటే, తాను రోజూ విసిరేవి కత్తులు కాదు, తన ప్రేమ రాయబారాన్ని మోసుకు వెళ్ళే బాణాలు అనుకునే వరకూ చేరింది అతని వైఖరి. కానీ అతను విసిరే కత్తుల్లాగే ఆ బాణాలు కూడా ఆమెకి అస్సలు తగల్లేదు. చాలాసార్లు రూబీ మణికి నచ్చజెప్పింది. ఒకరోజు కుండ బద్దలు కొట్టేసింది, తనకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని. మణి ముఖం మీదే చెప్పేసింది. తన ప్రపంచం ఒక్కసారి తల్లకిందులైపోయినట్టు అనిపించింది మణికి. తట్టుకోలేకపోయాడు. అర్ధరాత్రి గడిచింది. రూబీ ఉండే గదివైపు తడబడుతూ అడుగులు వేస్తున్నాడు మణి. చేతిలో కల్లుసీసా. తనని తాను నిగ్రహించుకునే స్థితిలో లేడు. పెద్దగా అరుస్తూ రూబీని నిద్రలేపాడు. ఆ గొడవకి మిగతావాళ్ళు కూడా నిద్రలేచారు. పెద్ద రభసే అయ్యింది. తనని పెళ్ళి చేసుకోకుంటే æచంపేస్తా అంటూ ఊగిపోతూ చేతిలో సీసాని పగలగొట్టి రూబీ మీదకి వెళ్ళబోయాడు మణి. చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి ఆపారు. రూబీ, మణికి దగ్గరగా వెళ్ళి గట్టిగా అతని చెంప పగలగొట్టింది. ఆ ఊపుకి వెళ్ళి పక్కన పడిపోయాడు. అందరూ అక్కడనుంచి వెళ్ళిపోయారు. రూబీ మాత్రం మళ్ళీ మణికి దగ్గరగా వెళ్ళింది. అతడి తల నిమిరింది. ఏదో గిలిగింత కలిగినట్టు ఆ మత్తులోనే నవ్వేసాడు మణి. ఆ స్పర్శ బహుశా అతని మనసుని తాకింది కాబోలు! రూబీ... రూబీ... అంటూ కలవరిస్తున్నాడు. రూబీకి కూడా మణి అంటే ఇష్టమే. కాకపోతే ఈ జీవితం రూబీకి నచ్చలేదు. ఏవో కుటుంబ పరిస్థితుల వల్ల ఇక్కడకి రావల్సి వచ్చిందేకానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి మాత్రం కాదు. కానీ మణి పరిస్థితి అది కాదు. ఈ సర్కస్ అతని జీవితం. అతనికి ఇక్కడ మంచి భవిషత్తు కూడా ఉంది. తనవల్ల మణి జీవితం మారిపోవటం, అతను ఇష్టపడ్డ ప్రపంచాన్ని తనకోసం మార్చుకోవటం రెండూ రూబీకి ఇష్టంలేదు. అందుకే అతని ప్రేమకి దూరం అవ్వాలని అనుకుంది. అర్ధరాత్రి దాటింతర్వాత. ఏదో పెనుగులాట. ఏదోఅలజడి. బలవంతంగా మత్తునుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు మణి. తన వల్ల కావటం లేదు. ఐనా ప్రయత్నిస్తున్నాడు. మసకమసగ్గా కళ్ళముందు ఆడుతున్న ఆ దృశ్యాల్లో ఎవరో ఒక అమ్మాయి. ఒక మగమనిషి. ఆ అమ్మాయి అరవటానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆ మగ మృగం కిరాతకంగా ఆమెని లోబరచుకోవాలని ప్రయత్నం చేస్తోంది.బలం మొత్తం కూడగట్టుకొని లేచి నిలబడ్డాడు.‘‘ఎవరదీ! ఏయ్ వదులు’’ అంటూ ఆ మనిషి చొక్కా పట్టుకున్నాడు. అంత దగ్గరగా ఆ ముఖాన్ని చూసి ఖంగుతిన్నాడు. ఎదురుగా ఉన్న ఆ మనిషి టపీమని తలపై గట్టిగా రాయితో మోదడంతో అక్కడే స్పృహ కోల్పోయాడు మణి.పొద్దున్నే ఎవరో బూటుకాలితో గట్టిగా తంతుంటే మెలకువ వచ్చింది మణికి. ఎదురుగా ఉన్న రక్తపు మడుగులోంచి సూర్యోదయమయ్యింది అతనికి. ఒక్కసారి మబ్బులు విడిపోయాయి. అది రూబీ శవం. పొత్తికడుపులో పగలగొట్టిన గాజు సీసా గుచ్చుకొని ఉంది.‘‘ఏరా, అమ్మాయి ప్రేమించకపోతే పాడుచేసి ప్రాణాలు తీసేస్తార్రా మీరు...’’ అంటూ తంతున్నాడు కానిస్టేబుల్. మణికి ఏమీ అర్థంకాలేదు. ‘‘వీడిని ఇక్కడనుంచి తీసుకుపోండి సార్! వీడిలాంటి వాళ్ళుంటే మా సర్కస్కే చెడ్డపేరు’’ అంటున్న పెద్దయ్య వైపు కోపంగా చూశాడు మణి. కానీ పెద్దయ్య మాత్రం మణి కళ్ళలోకి చూడలేకపోయాడు. అది ఎందుకో మణికి మాత్రమే తెలుసు. ‘‘నడవరా స్టేషన్‌కి’’ అంటూ మెడ పట్టుకొని తీసుకెళ్ళారు పోలీసులు. అలా వెళుతూ కూడా వెనక్కి తిరిగి మరీ పెద్దయ్యవైపే చూశాడు మణి. ‘‘వెళ్ళొస్తా పెద్దయ్యా’’ అన్నాడు. పెద్దయ్యకి మణి కళ్ళలోకి చూసే ధైర్యం రాలేదు. బహుశా ఇంకెప్పటికీ రాదేమో!జైల్లో ఎవ్వరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు మణి. ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడేవాడు. మధ్యమధ్యలో వెక్కివెక్కి ఏడుస్తూ ఉండేవాడు. ఆ జైల్లో కూడా మణికి అభిమానులు లేకపోలేదు. వారి సహాయంతో ఒక చిన్న గడ్డి బొమ్మని, కొన్ని డమ్మీ చాకులని సమకూర్చుకొని గంటలు తరబడి సాధన చేసేవాడు. ఇదీ క్లుప్తంగా మణి జైలు జీవితం. మణి జైలునుంచి విడుదలయ్యాక ఆ గడ్డిబొమ్మని బయటపారేస్తూ కానిస్టేబుల్ గమనించిన ఒక వింత విషయం ఏంటంటే ఇన్నాళ్ళూ మనిషికి తగలకుండా కత్తులు వేయటంలో నేర్పరి అయిన మణి, ఇప్పుడు మాత్రం ఒకేచోట గురి తప్పకుండా ఆ గడ్డిబొమ్మ గుండెల్లోకే చాకుని విసరగలగటం. చిద్రమైపోయిన హృదయంతో ఉన్న ఆ బొమ్మ, బహుశా రూబీని మరిచిపోలేని మణికి ప్రతిరూపమేమో అనుకున్నాడు.‘మణి... మణి...మణి...’ అంటూ ప్రేక్షకులు కొడుతున్న కేరింతలతో మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. వణుకుతున్న చేతినుంచి బాణంలాగా దూసుకువెళ్ళింది కత్తి. ఎప్పటిలాగే ఈసారి కూడా అది గురి తప్పలేదు. జైల్లో రూబీనే తలచుకుంటూ, ఆ గడ్డిబొమ్మలో పెద్దయ్యనే చూస్తూ మణి చేసిన సాధన మొత్తానికి ఫలించింది. ప్రేక్షకుల దృష్టిలో అతని గురి తప్పినప్పటికీ, మణì æలక్ష్యం మాత్రం నెరవేరింది. - యేటూరి రోహణ్ -
అడవి కాని చోట..!
సర్కస్‌ను వృత్తిగా చేసుకుని ఒక యువకుడు పొట్టపోసుకునేవాడు. సర్కస్‌లో పులుల విన్యాసాలను చూసేందుకు ప్రజలు ఎగబడేవారు. చిన్నా, పెద్దా అంతా కిక్కిరిసిపోయేవారు. సర్కస్ ద్వారా వచ్చే ఆదాయంతో పులులకు తిన్నంత మాంసం పెట్టేవాడు. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అకస్మాత్తుగా ప్రభుత్వం ఎందుకో ఆ ఏడాది సర్కస్‌ను నిషేధించింది. దాంతో ఆ యువకుడు తను పైసా పైసా వెనకేసి దాచుకున్న డబ్బుతో మాంసం తెచ్చి పులుల కడుపు నింపేవాడు. ఆ డబ్బంతా అయిపోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు. తను ఎలాగోలా కడుపునింపుకునేవాడు. కానీ పులుల కడుపు నింపాలంటే మాటలా! పులులు ఆకలి బాధతో అల్లాడిపోసాగాయి. తన కష్టాన్ని మిత్రుడితో చెప్పుకుని కన్నీరుమున్నీరయ్యాడా యువకుడు. పులి వంటి వాటిని అడవిలో వదిలేస్తే అవే రాజాలా బతికేస్తాయని సలహా ఇచ్చాడు మిత్రుడు. మిత్రుడి సలహా ఆ యువకుడికి ఎంతగానో నచ్చింది. పులులను దగ్గరలోని అడవిలోకి తోలుకెళ్లాడు. పులులు కూడా సంతోషంగా అడవిలోకి వెళ్లాయి. కొన్ని రోజులకే పులులపై సీమకుక్కలు దాడిచేసి చంపేశాయన్న వార్త ఊరంతా పాకింది. పులులను కుక్కలు దాడి చేసి చంపడమేమిటా అని ఆశ్చర్యపోవడం ప్రజల వంతయ్యింది. ఈ విషయం ఆ సర్కస్ యువకుడికీ తెలిసి చనిపోయిన తమ పులులను చూసి రోదించసాగాడు. ‘నా పులులను సర్కస్ లో ఉంచుకోకుండా అడవిలో పెంచితే ఈ రోజు ఈ పులులు కుక్కల దాడిలో చనిపోయేవి కావు కదా’ అని వాపోయాడు. ఈ కథలోలాగే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అతి గారాబంతో, ప్రేమతో వాళ్లు అడిగిందల్లా తెచ్చి వాళ్లముందుంచుతారు. ఇలాంటి పిల్లలు పెరిగి పెద్దయి తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎదురయ్యే సవాళ్లకు బెంబేలెత్తుతారు. ప్రతీ చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. పిల్లలకు ప్రేమను పంచడం తప్పుకాదు ప్రేమతో పాటు ధైర్యసాహసాలు నూరిపోయాలి. పోరాటపటిమను చిన్నప్పటి నుంచి నేర్పాలి. – తహూరా సిద్దీఖా -
బోన్ నుంచి పులి ఎస్కేప్.. భయంతో జనాల పరుగులు.!
బీజింగ్: ‘పులితో ఫోటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా ట్రై చెయ్యచ్చు.. సరే ! చనువిచ్చింది కదాని ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’.. అని జూనియర్ ఏన్టీఆర్ యమదొంగ సినిమాలో చెప్పిన డైలాగ్. అచ్చం ఈ డైలాగ్‌కు వర్తించే ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పులితో ఆటాడించే ఓ సర్కస్ కంపెనీకి ఆ పులి ముచ్చెమటలు పట్టించింది. మన పక్క దేశం చైనాలోని ఓ గ్రామంలో జనసమూహం మధ్యలో పులితో సర్కస్ ఆడిస్తున్నారు. ఇంకేముంది.. దానికి తిక్కరేగినట్టుంది.. మెళ్లిగా బోన్ నుంచి తప్పించుకొని జనాలపై వేటకు ప్రయత్నించింది. ఈ ఘటనతో ఉలిక్కపడ్డ జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో పరుగు తీశారు. ఆ పులిని అడ్డుకోడానికి సర్కస్ కంపెనీ వారు శతవిధాల ప్రయత్నించారు. గత శనివారం చైనాలోని షాంగ్జీ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చిన్న చిన్న గాయాలతో భయపడినట్లు తెలుస్తోంది. -
చిలుకా.. క్షేమమా!
పచ్చని చిలుకలు తోడుంటే.. అంటూ పాట పాడుకుంటాం. అంటే చిలుకలంటే పచ్చగానే ఉంటాయని మనకు తెలుసు. సర్కస్‌లలో, సినిమాల్లో ఒక్కోసారి రంగురంగుల చిలుకలు దర్శనమిస్తాయి. కానీ ఎప్పుడైనా నీలిరంగు చిలుకను చూశారా? ఈ అరుదైన చిలుక జాతిని శాస్త్రవేత్తలు మెక్సికోలో గుర్తించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్తలు అమెజాన్ ప్రాంతంలో ఈ చిలుకలను గుర్తించారు. ఈ చిలుకలలో అనేక ప్రత్యేక లక్షణాలున్నాయట. మనదగ్గర ఉండే పచ్చని చిలుకల కంటే ఇవి పెద్దగా అరుస్తాయట. అది కూడా ఒకే రకమైన శబ్దం చేస్తూ మళ్లీ మళ్లీ అరుస్తాయట. అంతేగాక ఇవి చిన్న గుంపులుగా జీవిస్తాయని, ఒక్కో గుంపులో 10 నుంచి 12 చిలుకలు ఉంటాయని చెప్పారు. శాకాహారులైన ఈ పక్షులు పండ్లు, పువ్వులు, ఆకులు, విత్తనాలను ఇష్టంగా తింటాయని ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. వీటి మైటోకాండ్రియాలోని జన్యు క్రమాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సుమారు 1,20,000 సంవత్సరాల క్రితమే ఈ జాతి ఆవిర్భవించిందని గుర్తించారు. -
సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి
-
సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి
సర్కస్ ఈవెంట్లలో భాగంగా సింహంతో సర్కస్ చేయిస్తున్న రింగ్ మాస్టర్‌పై సింహం దాడి చేసింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని డౌల్లెన్స్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించన వీడియో ఫేస్బుక్లో వైరల్ అయింది. సర్కస్ చేయిస్తున్న మాస్టర్‌పై ఒక్కసారిగా దూకిన సింహం అతని ఛాతీ భాగంలో తీవ్రంగా గాయపర్చింది. ఇంతలో తేరుకున్న సర్కస్ నిర్వహకులు సింహంపైకి పొగను వదిలి మాస్టర్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన మాస్టర్‌ను ఆసుపత్రికి తరలించారు. మాస్టర్‌పై సింహం దాడి చేయడంతో షాక్‌కు గురైన ప్రేక్షకులు ఆ ప్రాంతం నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం మాస్టర్ ఆరోగ్య పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు సర్కస్ నిర్వాహకులు తెలిపారు. -
ప్రపంచానికి సర్కస్ నేర్పింది దొమ్మరులే
పాములపాడు: ప్రపంచానికి సర్కస్ నేర్పింది దొంబర కులస్తులేనని దొంబర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి దొంబర కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. 1969కి ముందు విముక్తి జాతుల్లో ఉండేదన్నారు. సంచార జాతులకు ప్రత్యేకంగా రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. గ్రామ స్థాయిలో కుల సమీకరణలు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కుల పెద్దలకు సూచించారు. ఐకమత్యంతో ఉండి సమస్యలు పరిష్కరించుకుంటూ దొంబరుల సత్తా ప్రభుత్వానికి చాటాలన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో తమ వాటా తమకు కేటాయిండం కూడా పక్కనపెట్టేశారన్నారు. సంచార జాతులన్నింటిని సమీకరించి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేక కార్పోరేషన్, రెసిడెన్సియల్ పాఠశాలల ఏర్పాటు, ఈ కార్యక్రమంలో ఆసంఘం రాష్ట్ర నాయకులు గుర్రప్ప, నాగన్న, మురళి, రవి, సుబ్బరాయుడు, లక్ష్మణ్, ఆంజనేయులు, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
'జిమ్నాస్టిక్స్ అంటే సర్కస్ ఫీట్లా అని అడిగారు'
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి తొలి మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్‌కు రియోలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయట. రియోకు వచ్చిన అభిమానుల్లో కొంతమంది జిమ్నాస్టిక్స్ గేమ్స్‌ను సర్కస్ ఫీట్లతో పోల్చడమే కాకుండా, తనను పదే పదే అవే ప్రశ్నలతో సతమతం చేశారని దీపా కర్మాకర్ తాజాగా స్పష్టం చేసింది. 'నేను రియోలో పతకం సాధించాలనే ఒత్తిడిలో ఉన్నప్పుడు పలువురు నా వద్దకు వచ్చి జిమ్నాస్టిక్స్ అంటే ఏమిటని అడిగారు. అలా అడగమే కాకుండా సర్కస్‌ను పోలి ఉంటుందా అని అడిగారు. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోకుండా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించా' అని వాల్ట్ విభాగంలో నాల్గోస్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన దీపా పేర్కొంది. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రియో జ్ఞాపకాల్ని నెమరవేసుకున్న త్రిపుర అమ్మాయి.. జిమ్నాస్టిక్స్ను సర్కస్ తో పోల్చడం కొంతవరకూ ఇబ్బందికరంగా అనిపించిందని పేర్కొంది. -
సర్కస్‌లో పేలుడు : 11 మందికి గాయాలు
లీమా : పెరూ సన్ జుయన్ డీ జిల్లాలోని సర్కాస్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వెనక దోపిడి దొంగల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించండంతో పలువురికి వినికిడి లోపం ఏర్పడిందని చెప్పారు. అయితే సర్కాస్లోకి ఎవరైనా గ్రేనేడ్ విసిరారా లేకుంటే ముందే సర్కస్‌లో దీనిని అమర్చి ఉంచారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో పెరూలో దోపిడి దొంగల ఆగడాలు పెచ్చురిల్లాయి. ప్రైవేట్ పాఠశాలు, ట్యాక్సీ డ్రైవర్లు, భవన నిర్మాణ సంస్థలను లక్ష్యంగా చేసుకుని పలువురు దోపిడికి పాల్పడుతున్నారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 వేల ఫిర్యాదులు అందాయని పెరూ చీఫ్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు. -
పేదరికం బతుకంటోందీ.. చట్టం జీవహింసంటోంది!
-
తెంచుకోండి.. నమ్మకాల బంధనాలు
ప్రేరణ మీరు జీవితంలో ఏం సాధించగలరనేది మీలోని శక్తిసామర్థ్యాలు నిర్ణయించాలే తప్ప మీ చిన్నప్పటి నమ్మకాలు, అనుభవాలు కాదు. సర్కస్‌లో ఏనుగు విన్యాసాలను చూసి మీరు ఆనందించే ఉంటారు కదా! అంతటి బలమైన జంతువు కూడా రింగ్‌మాస్టర్ చెప్పినట్టల్లా నడుచుకుంటుంది. ప్రదర్శన పూర్తయ్యాక దాని కాలును మామూలు ఇనుప గొలుసుతో ఒక చిన్న చెక్కకొయ్యకు కట్టి ఉంచుతారు. 10 అడుగుల ఎత్తు, 5000కిలోల బరువున్న బలమైన ఏనుగుకు ఆ గొలుసును తెంచడం పెద్ద కష్టం కాదు. అయినా, ఆ దిశగా చిన్న ప్రయత్నం కూడా చేయదు. అక్కడి నుంచి పారిపోవాలనుకుంటే గొలుసు తెంచుకొని పారిపోవడం ఏనుగుకు చేతకాదా?... ఎందుక్కాదు! కచ్చితంగా చేతనవుతుంది. మరి ఎందుకు పారిపోదు? కొయ్యను పెకిలించి, గొలుసును తెంచుకోవడం అసాధ్యమని దాని మనసులో బలంగా ముద్రించుకుపోయింది కాబట్టి!! అలా ఎందుకు జరిగింది? పిల్లగా ఉన్నప్పుడు ఎదురైన బాధాకరమైన అనుభవం ఏనుగు మనసులో గట్టిగా నాటుకుపోయింది. ఇప్పటికీ అదే నిజమని నమ్ముతోంది. బంధనాన్ని తెంచుకొని, స్వేచ్ఛ పొందడం తనవల్ల కాదని అనుకుంటోంది. సర్కస్‌లో విన్యాసాలు చేసే గజరాజుకు చిన్నప్పటి నుంచే శిక్షణ ఇస్తుంటారు. అప్పుడు దాని కాలుకు బలమైన ఇనుప గొలుసును బిగించి, భూమిలోకి దిగగొట్టిన ఉక్కు కొయ్యకు కట్టేస్తారు. అక్కడి నుంచి పారిపోయేందుకు అది తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఉక్కు కొయ్యను పెకిలించి, గొలుసును తెంచేయాలని పోరాడుతుంది. కాలును లాగుతున్న కొద్దీ, ఇనుప గొలుసు కోసుకుపోతుంది. కాలులోంచి రక్తం కారి, విపరీతంగా నొప్పి పుడుతుంది. కాలిపై గాయం ఏర్పడుతుంది. పారిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ బాధాకరమైన అనుభవమే ఎదురవుతుంది. దాంతో ఇక పారిపోవాలనుకోవడం వ్యర్థ ప్రయత్నమేనని చివరికి బుల్లి ఏనుగు భావిస్తుంది. తనకు ఇక స్వేచ్ఛ లభించదని నమ్ముతుంది. అప్పటినుంచి గొలుసుతో కట్టేసిన కాలును లాగే ప్రయత్నం కూడా చేయదు. ఆ నొప్పి, అనుభవం దాని మనసులో జీవితాంతం నిలిచిపోతాయి. ఏనుగు పెరిగి పెద్దదయ్యింది. దాని ఆకారం, బరువు, బలం ఎన్నో రెట్లు పెరిగాయి. అయినా దాన్నిప్పుడు మామూలు గొలుసుతో, చిన్న చెక్క కొయ్యకే కట్టేస్తున్నారు. అది ఎక్కడికీ పారిపోదని తెలుసు కాబట్టే అలాంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికైనా ఏనుగు తన బలమేంటో తెలుసుకోవడం లేదు. గొలుసు ఎంత పొడవుంటే అంత వరకే వెళ్తోంది తప్ప దాన్ని లాగేసే ప్రయత్నం చేయడం లేదు. అది తన ప్రస్తుత దుస్థితి నుంచి విముక్తి పొందలేకపోతోంది. రింగ్‌మాస్టర్ చేతిలో దెబ్బలు తింటూ అతడు చెప్పినట్టల్లా చేస్తోంది. మనుషుల్లోనూ గజ బలం! ఏనుగు కష్టాలకు కారణమేంటో తెలిసిందా?చిన్నప్పటి అనుభవాన్ని, నమ్మకాన్ని ఇంకా పట్టుకొని వేలాడ్డమే దాని దుస్థితికి కారణం. మనందరం కూడా సర్కస్ ఏనుగులాంటి వాళ్లమే. మనలో కూడా నమ్మశక్యం కానంత బలం దాగి ఉంది. అలాగే మనం ధైర్యంగా ముందుకెళ్లకుండా బంధిస్తున్న గొలుసులు, చెక్క కొయ్యలు కూడా ఉన్నాయి. మనసుల్లో ఎప్పుడో ఏర్పడ్డ నమ్మకాలు, అనుభవాలు మనుషులను బంధించి ఉంచుతున్నాయి. అవి వారిని వారే తక్కువ అంచనా వేసుకునేలా చేస్తున్నాయి. చిన్నతనంలో ఏర్పడ్డ ఒక్క నమ్మకం, ఎదురైన అనుభవం, పలకరించిన ఒక చిన్న వైఫల్యం, ఎవరో చెప్పిన ఒక విషయం.. ఇలాంటివన్నీ ఇనుప గొలుసులుగా, చెక్క కొయ్యలుగా మారిపోతున్నాయి. మనుషులు తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకోకుండా చేస్తున్నాయి. చేయగలిగే పనిని కూడా చేయకుండా ఆపుతున్నాయి. సాధించగలిగే విజయాలను సాధించకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు నిజాయతీగా ప్రశ్నించుకోండి. మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఇనుప గొలుసులు, చెక్క కొయ్యలు ఏమిటో తెలుసుకోండి. నువ్వు ఆ పని చేయొద్దు, నీ వల్ల కాదు, నీకు అంత సత్తా లేదు, నువ్వొక దద్దమ్మ, నీలో తెలివి తేటలు లేవు.. బాల్యంలో చాలామంది ఇలాంటి మాటలు అనిపించుకున్నవారే! దురదృష్టం ఏమిటంటే.. వాటిని నిజమేనని నమ్మేస్తుంటారు. తమలో నిజంగా ఎలాంటి శక్తిసామర్థ్యాలు లేవని, బలహీనులమని అనుకుంటారు. జీవితాంతం అదే భ్రమలో బతికేస్తుంటారు. తమ అపజయాలకు కారణాలు వెతుక్కుంటారు. పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారినా, ఉక్కు కొయ్య స్థానంలో చెక్క కొయ్య వచ్చినా.. ఆ విషయం కూడా తెలుసుకోలేరు. ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నా చేయలేరు. ‘నా వల్ల కాదు’ అనే పాత నమ్మకమే వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. బలహీనులుగా మార్చొద్దు మనుషులు కొన్నిసార్లు ఏనుగుల శిక్షకుడి పాత్రను పోషిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు, ఉపాధ్యాయులు విద్యార్థులకు, మిత్రులు తమ సహచరులకు తెలిసో తెలియకో బలహీనతను నూరిపోస్తుంటారు. తద్వారా వారికి మేలు చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు. ఇది తప్పు ఆలోచన. మీ కింద ఉన్నవారిని, సహచరులను ఇనుప గొలుసుతో కట్టేయాలని చూడకండి. తాము నిజంగానే బలహీనులమని వారు భ్రమపడేలా చేయకండి. సంకెళ్ల నుంచి విముక్తి చెందండి ఏనుగులో ఉన్నంత బలం మనుషుల్లోనూ ఉందని నమ్మండి. ఇనుప గొలుసులకు, చెక్క కొయ్యలకు లొంగిపోకండి. మీరు ముందుకెళ్లకుండా బంధించి ఉంచుతున్న నమ్మకాలను పటాపంచలు చేయండి. మీరు జీవితంలో ఏం సాధించగలరనేది మీలోని శక్తిసామర్థ్యాలు నిర్ణయించాలే తప్ప మీ చిన్నప్పటి నమ్మకాలు, అనుభవాలు కాదు. చెక్క కొయ్యను విరిచేయండి, ఇనుప గొలుసును తెంచేయండి.. మీ పాత భావనల నుంచి విముక్తి పొందండి. అనుకున్నది సాధించి చూపండి.. స్వేచ్ఛగా!! -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో.. -
ఐ-ఫీస్ట్ చేస్తున్న సర్కస్ ఫీట్స్