
బీజింగ్: ‘పులితో ఫోటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా ట్రై చెయ్యచ్చు.. సరే ! చనువిచ్చింది కదాని ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’.. అని జూనియర్ ఏన్టీఆర్ యమదొంగ సినిమాలో చెప్పిన డైలాగ్. అచ్చం ఈ డైలాగ్‌కు వర్తించే ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పులితో ఆటాడించే ఓ సర్కస్ కంపెనీకి ఆ పులి ముచ్చెమటలు పట్టించింది.
మన పక్క దేశం చైనాలోని ఓ గ్రామంలో జనసమూహం మధ్యలో పులితో సర్కస్ ఆడిస్తున్నారు. ఇంకేముంది.. దానికి తిక్కరేగినట్టుంది.. మెళ్లిగా బోన్ నుంచి తప్పించుకొని జనాలపై వేటకు ప్రయత్నించింది. ఈ ఘటనతో ఉలిక్కపడ్డ జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో పరుగు తీశారు. ఆ పులిని అడ్డుకోడానికి సర్కస్ కంపెనీ వారు శతవిధాల ప్రయత్నించారు. గత శనివారం చైనాలోని షాంగ్జీ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చిన్న చిన్న గాయాలతో భయపడినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment