సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి | Terriyfying video: Lion attacks keeper during circus routine in France | Sakshi
Sakshi News home page

సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి

Published Tue, May 9 2017 4:32 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి

సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి

సర్కస్‌ ఈవెంట్లలో భాగంగా సింహంతో సర్కస్ చేయిస్తున్న రింగ్‌ మాస్టర్‌పై సింహం దాడి చేసింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని డౌల్లెన్స్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించన వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్‌ అయింది. సర్కస్‌ చేయిస్తున్న మాస్టర్‌పై ఒక్కసారిగా దూకిన సింహం అతని ఛాతీ భాగంలో తీవ్రంగా గాయపర్చింది.

ఇంతలో తేరుకున్న సర్కస్‌ నిర్వహకులు సింహంపైకి పొగను వదిలి మాస్టర్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన మాస్టర్‌ను ఆసుపత్రికి తరలించారు. మాస్టర్‌పై సింహం దాడి చేయడంతో షాక్‌కు గురైన ప్రేక్షకులు ఆ ప్రాంతం నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం మాస్టర్‌ ఆరోగ్య పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు సర్కస్‌ నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement