Shocking: Lion Attacks Keeper Drags Him Away In Bush, Video Goes Viral - Sakshi
Sakshi News home page

ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..

Published Sun, Apr 30 2023 12:06 PM | Last Updated on Sun, Apr 30 2023 1:30 PM

Viral Video: Lion Attacks Keeper, Drags Him Away In Bush - Sakshi

కొన్ని జంతువులను పెంచినంత మాత్రాన దాడి చేయవని అనుకులేం. అందుకు ఉదాహరణగా పలు ఉదంతాలను కూడా చూశాం కూడా. ఒక్కోసారి చాలా విచిత్రంగా ‍ప్రవర్తించి దాడి చేసేందుకు రెడి అయిపోతాయి. అందులోకి క్రూరమృగాలైతే ఇక చెప్పనవసరం లేదు. అచ్చం అలానే ఇక్కడో సింహం రోజు తన సంరక్షణ చూసే కీపర్‌పైనే దాడి చేసింది. ఈ ఘటన బ్రిటీష్‌ పార్క్‌లో చోటు చేసుకుంది. 

రోజు తనను చూస్తుంది కదా అని అతను రోజులానే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను సింహం దాడి చేస్తుందని కూడా అనుకోలేదు. సడెన్‌గా సింహం అతన్ని పరిగెట్టించి దాడి చేసి, బొమ్మ మాదిరిగి ఈడ్చుకెళ్లిపోయింది. చూస్తుండగానే క్షణాల్లో ఆ వృద్ధ కీపర్‌ ఆ సింహానికి ఆహరమైపోయాడు. దీన్నంతా గమినిస్తున్న ఓ మహిళ భయంతో వెర్రిగా కేకులు వేసింది. అందుకు సంబంధించిన వీడియోని బ్రిటీష్‌ పార్క్‌ ఓనర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  

వీడియో కోస ఇక్కడ క్లిక చేయండి:

(చదవండి: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పాము కలకలం..ఏకంగా 22 పాములు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement