కన్నూర్ (కేరళ): దేశంలో సర్కస్ ఇండస్ట్రీకి ఆద్యుల్లో ఒకరైన జెమిని శంకరన్ (99) ఇక లేరు. వయో సంబంధ రుగ్మతలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జంతువుల విన్యాసాలు, సాహస బృందాల ప్రదర్శనలతో తరాల పాటు ప్రేక్షకులకు వినోదం పంచిన జెమిని, జంబో సర్కస్ కంపెనీలు ఆయన స్థాపించినవే.
1924లో కేరళలోని కొలస్సెరీ గ్రామంలో పుట్టిన శంకరన్ సర్కస్ కళాకారుడిగా శిక్షణ పొందారు. సైన్యంలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రిటైరయ్యాక మళ్లీ సర్కస్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తాడుపై, ఐరన్ బార్‌పై నడవడంలో ప్రావీణ్యం సంపాదించారు. 1951లో విజయ్ సర్కస్ కంపెనీని కొనుగోలు చేసి జెమినిగా పేరు మార్చారు. నిపుణులతో, విదేశాల నుంచి తెప్పించిన జంతువులతో తీర్చిదిద్దారు. 1964లో రష్యా అంతర్జాతీయ సర్కస్ ఫెస్టివల్‌లో శంకరన్ సారథ్యంలోని భారత్ బృందం పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment