shankaran
-
‘జెమిని సర్కస్’ శంకరన్ కన్నుమూత
కన్నూర్ (కేరళ): దేశంలో సర్కస్ ఇండస్ట్రీకి ఆద్యుల్లో ఒకరైన జెమిని శంకరన్ (99) ఇక లేరు. వయో సంబంధ రుగ్మతలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జంతువుల విన్యాసాలు, సాహస బృందాల ప్రదర్శనలతో తరాల పాటు ప్రేక్షకులకు వినోదం పంచిన జెమిని, జంబో సర్కస్ కంపెనీలు ఆయన స్థాపించినవే. 1924లో కేరళలోని కొలస్సెరీ గ్రామంలో పుట్టిన శంకరన్ సర్కస్ కళాకారుడిగా శిక్షణ పొందారు. సైన్యంలో చేరి రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రిటైరయ్యాక మళ్లీ సర్కస్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తాడుపై, ఐరన్ బార్‌పై నడవడంలో ప్రావీణ్యం సంపాదించారు. 1951లో విజయ్ సర్కస్ కంపెనీని కొనుగోలు చేసి జెమినిగా పేరు మార్చారు. నిపుణులతో, విదేశాల నుంచి తెప్పించిన జంతువులతో తీర్చిదిద్దారు. 1964లో రష్యా అంతర్జాతీయ సర్కస్ ఫెస్టివల్లో శంకరన్ సారథ్యంలోని భారత్ బృందం పాల్గొంది. -
'ఐఏఎస్ శంకరన్‌తో పనిచేయడం మా అదృష్టం'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని లెనిన్ సెంటర్లో మంగళవారం ఏపీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి యస్. ఆర్.శంకరన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరన్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వీ. సుబ్రమణ్యం, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్. వీ. సుబ్రమణ్యం మాట్లాడుతూ.. శంకరన్ లాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం మాకు ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. జీవితంలో ఎదగాలి అనుకునేవారు శంకరన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శంకరన్ అధికారిగా పనిచేసే రోజుల్లో జిల్లాలో పర్యటించిన సందర్భాల్లో పరిష్కరించాల్సిన సమస్యలను డైరీలో నమోదు చేసేవారని గుర్తుచేశారు. ఆయన రాసిన వ్యాసాలు నేటి యువత అందరూ చదవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పేద వర్గాలకు అండగా నిలబడిన శంకరన్ లాంటి వ్యక్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపం అని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ కొనియాడారు. 'టాక్ లెస్ డూ మోర్' అన్నదే శంకరన్ గారి నినాదం అని సీపీఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు, ఫైనాన్స్ సెక్రటరీ యస్.యస్. రావత్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర ,టోబాకో బోర్డు సెక్రెటరీ సునీత , చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ దమయంతి తదితరులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో భేష్
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నాయని ఏపీ, తెలంగాణ ఇన్‌కంట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శంకరన్ వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ 159వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శంకరన్ మాట్లాడుతూ, దేశంలో ఆర్థిక వనరులు పెరగాలన్నా.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడాలన్నా.. నిజాయతీగా పన్నులు చెల్లించాలని ప్రజలకు సూచించారు. దేశంలో ప్రతీ పౌరుడు నిజాయతీగా, సులువుగా పన్నులు చెల్లించేందుకు వీలుగా సాంకేతికతను వాడుకుంటున్నామని చెప్పారు. ఈఫైలింగ్కు అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. 2018–19 ఏడాదిలో 6.68 కోట్ల ఈఫైలింగులు రావడమే దీనికి నిదర్శనమని అన్నారు. దీన్ని మరింత సులభతరం చేస్తామని చెప్పారు. ప్రత్యక్ష పన్నుల విషయంలో దేశంలో గణనీయ వృద్ధి నమోదవుతోందని తెలిపారు. 2014–15లో రూ.6.95 లక్షల కోట్లు పన్ను రూపంలో వసూళ్లవగా 2018–19లో అది రూ.11.37 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. రూ.4.41 లక్షల కోట్ల అభివృద్ధితో 63.5 శాతం వృద్ధి రేటు నమోదవ్వడం విశేషమని కొనియాడారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణల్లో వృద్ధి రేటు కూడా బాగుందన్నారు. 2014–15లో వృద్ధి రేటు రెండు రాష్ట్రాల నుంచి రూ.31,762 వేల కోట్లు ఉండగా, 2018–19 వరకు అది రూ.52,040 కోట్లకు చేరిందని తెలిపారు. ఐదేళ్లలో 82 శాతం వృద్ధి నమోదు చేయడం రికార్డని కొనియాడారు. దేశంలో ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ తరువాత తెలుగు రాష్ట్రాలు దేశానికి ఆదాయం ఇవ్వడంలో ఐదో స్థానంలో నిలిచాయని ప్రశంసించారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరుగుతుండటం దేశానికి శుభసూచకమని అన్నారు. ఐఏఎస్‌కు ఎంపికైన అంధ ఉద్యోగి కట్టా సింహాచలాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డీజీఐటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆర్.కె.పల్లికల్, డి.జి.ఇన్వెస్టిగేషన్ ఆర్.హెచ్.పాలీవాల్, చీఫ్ కమిషనర్ శ్రీ అతుల్ ప్రణయ్, నల్సార్ యూనివర్సిటీ వీసీ ఫైజల్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. అనంతరం పన్ను చెల్లింపులో అగ్రస్థానంలో నిలిచిన పలు కంపెనీలకు అవార్డులు అందజేశారు. -
ఆ ఇద్దరికీ అపూర్వ సన్మానం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రాంగణం అరుదైన ఘటనకు వేదికైంది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం ఆవిర్భావం కోసం అప్పటి సీపీఐతో విభేదించి బయటకు వచ్చిన ఇద్దరు కమ్యూనిస్టు యోధులను ఘనంగా సన్మానించారు. ఆ ఇద్దరు.. పార్టీ తొలి కేంద్ర కమిటీ సభ్యులైన కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (95), తమిళనాడుకు చెందిన పార్టీ నేత శంకరన్ (96). పార్టీ మహాసభలకు వీరిని అతిథులుగా ఆహ్వానించిన సీపీఎం నేతలు మహాసభల వేదికపై సత్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వారి మెడలో దండలు వేశారు. పార్టీ మూలస్తంభాలైన ఈ ఇద్దరు నేతల కృషి మరువలేనిదని కొనియాడారు. అచ్యుతానందన్, శంకరన్‌లు కనీసం నడవలేని స్థితిలో ఉన్నా.. సహాయకులను వెంటబెట్టుకుని సభలకు హాజరవడం విశేషం. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మాణిక్ సర్కార్ సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ప్రజావ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. బుధవారం ప్రారంభమైన పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మతతత్వ విధానాలతో నేరుగా ప్రజాస్వామ్యంపై దాడికి బీజేపీ, సంఘ్ పరివార్లు తెగబడుతున్నాయని ఆరోపించారు. వామపక్ష, ప్రజాతంత్ర కూటమి మాత్రమే దేశ ప్రజల నిజమైన కూటమి అని అన్నారు. మార్క్సిస్టు యోధులకు సంతాపం మహాసభల్లో తొలిరోజు పలువురు మార్క్సిస్టు యోధులకు నివాళి అర్పించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ సంతాప తీర్మానంలో ఖగేన్‌దాస్, పుకుమోల్‌సేన్, నూరుల్‌హుడా, సుబో«ధ్ మెహతాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పులువురు నేతలకు సంతాపం ప్రకటించారు. తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి, ట్రేడ్ యూనియన్ నేతలు పర్సా సత్యనారాయణ, తిరందాసు గోపిలకు కూడా మహాసభ నివాళి అర్పించింది. బెంగాల్, త్రిపుర, బిహార్, మహారాష్ట్రల్లో హత్యలకు గురైన పార్టీ నేతలను సంస్మరించుకున్నారు. -
యూనిఫాంలో చిందేసి.. సస్పెండ్ అయ్యాడు
విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి.. అందులోనూ యానిఫాం ధరించి డాన్స్ చేశారు. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దుమారం చెలరేగింది. ఉన్నతాధికారులు సంబంధిత అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. తమిళనాడులోని సేలం జిల్లాలో అత్తూరు సబ్ జైలు డిప్యూటీ జైలర్ శంకరన్ (58) గత నెలలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా యూనిఫాం ధరించి ఆయన డాన్స్ చేస్తుండగా, తోటి అధికారులు ప్రోత్సహిస్తూ తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీశారు. ఈ వీడియోను ఫోస్బుక్లో పోస్ట్ చేయడంతో పాటు వాట్సప్‌లో షేర్ చేసుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో శంకరన్‌ను కోయంబత్తూరుకు బదిలీ చేసి, విచారణకు ఆదేశించారు. సేలం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ షణ్ముగ సుందరం విచారణ చేసి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా శంకరన్‌పై చర్యలు తీసుకున్నారు. -
‘అంబేద్కర్‌లా ఆలోచించిన శంకరన్’
సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ ఆలోచన విధానాలు సమానత్వం, న్యాయం అనే అంశాలను జీవితాంతం పెనవేసుకున్న గొప్ప వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి ఉండ్రు రాజశేఖర్ కొనియాడారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(సీడీస్) ఆధ్వర్యంలో శనివారం మాజీ ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ 4వ స్మారకోపన్యాసాన్ని పురస్కరించుకుని ఆయున ముఖ్యఅతిథిగా పాల్గొని ‘రాజకీయ ప్రాతినిధ్యంపై అంబేద్కర్ ఆలోచనలు’ అంశంపై ప్రసంగించారు. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలని అంబేద్కర్ పోరాడారని తెలిపారు. శంకరన్ ఆదర్శప్రాయులు: కె.రామచంద్రమూర్తి ఎస్ఆర్ శంకరన్ వ్యక్తిత్వం చాలా గొప్పదని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆయన శంకరన్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ సి.బీనా, చుక్కా రావుయ్యు, కె.ఆర్. వేణుగోపాల్, కాకి మాదవరావు తదితరులు పాల్గొన్నారు.