Pooja Hegde: పొట్ట చెక్కలవుతుందేమో అనిపించింది! | Pooja Hegde is excited to be on board for Cirkus | Sakshi

పొట్ట చెక్కలవుతుందేమో అనిపించింది!

May 28 2021 1:50 AM | Updated on May 28 2021 7:32 AM

Pooja Hegde is excited to be on board for Cirkus - Sakshi

ఈ సినిమా సెట్‌లో బాగా ఎంజాయ్‌ చేశాను. అసలు వర్క్‌ చేస్తున్నామా? అనిపించేది. షూటింగ్‌ అంత సరదాగా జరిగింది. లొకేషన్‌లో అందరూ వేసిన జోక్స్‌కి..

హిట్టూ, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కొన్ని సినిమాల షూటింగ్‌ అనుభూతి ఎప్పటికీ మంచి జ్ఞాపకంగా గుర్తుండిపోతుందని అంటున్నారు పూజా హెగ్డే. ఈ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ– ‘‘లాక్‌డౌన్‌కు ముందు హిందీ మూవీ ‘సర్కస్‌’ షూట్‌లో పాల్గొన్నాను. ఈ సినిమా సెట్‌లో బాగా ఎంజాయ్‌ చేశాను. అసలు వర్క్‌ చేస్తున్నామా? అనిపించేది. షూటింగ్‌ అంత సరదాగా జరిగింది. లొకేషన్‌లో అందరూ వేసిన జోక్స్‌కి పొట్ట చెక్కలవుతుందేమో అనిపించింది.

ఈ మధ్య కాలంలో నేను ఒక షూటింగ్‌ లొకేషన్లో ఇంతగా నవ్వింది ఈ సెట్‌లోనే. రణ్‌వీర్‌ సింగ్, జాక్వెలిన్‌ ఎంతో ఫన్‌  క్రియేట్‌ చేశారు. రణ్‌వీర్‌ ఎనర్జీ నాలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా పూజా మాట్లాడుతూ– ‘‘సల్మాన్‌ ఖాన్‌తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’ సినిమా చేయనున్నాను. షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాక సల్మాన్‌తో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. అంత ఎగై్జటెడ్‌గా ఉన్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement