ఆ స్టార్‌ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే | Pooja Hegde Reveals She Calls Ranveer Singh As Pammi Aunty | Sakshi
Sakshi News home page

Pooja Hegde: ఆ స్టార్‌ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే

Published Sun, Mar 20 2022 9:05 AM | Last Updated on Sun, Mar 20 2022 9:20 AM

Pooja Hegde Reveals She Calls Ranveer Singh As Pammi Aunty - Sakshi

Pooja Hegde Reveals She Calls Ranveer Singh As Pammi Aunty: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల 'రాధేశ్యామ్‌' సినిమాతో ప్రేక్షకులను, అభిమానులను పలకరించింది. ఈ సినిమాకు ప్రస్తుతం మిక్స్‌డ్‌ టాక్‌ వస్తున్న బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబడుతోంది. ఈ సినిమా తర్వాత పూజా బాలీవుడ్‌లో ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బీటౌన్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ 'సర్కస్‌' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా ఎనర్జిటిక్‌ స్టార్‌ రణ్‌వీర్ సింగ్‌ నటిస్తున్నాడు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణ్‌వీర్ సింగ్‌ను తాను ఏమని పిలుస్తుందో చెప్పేసింది పూజా హెగ్డే. 

చదవండి: పూజా హెగ్డేపై నెటిజన్ల ఫైర్‌.. అసలేం చేసింది..

ఈ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే.. 'రణ్‌వీర్‌ సింగ్ అంటే ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్. నేను తనని 'పమ్మీ ఆంటీ' అని పిలుస్తాను. ఎందుకంటే అతను ఎప్పుడూ సెట్‌లో సరదాగా ఉంటూ అందర్ని అదే పనిగా గమనిస్తూ ఉంటాడు. ఈ సినిమాలో మా ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మీరు ఒక గొప్ప ఆన్‌స్క్రీన్‌ జంటను చూస్తారని నేను భావిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. రొహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ  సినిమా విలియం షేక్‌స్పియర్ నాటకం 'ది కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌' ఆధారంగా తెరకెక్కించినట్లు సమాచారం. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, వరుణ్‌ శర్మ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

చదవండి: మొక్కలు నాటిన పూజా హెగ్డే.. ఆ స్మైల్‌ చూడండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement