![Pooja Hegde New Home In Bandra Worth 45 Crores - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/13/Pooja-Hegde-New-Home.jpg.webp?itok=2t57f_5b)
పూజా హెగ్డే.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేసింది. కానీ వరస ఫ్లాపుల దెబ్బకు పూర్తిగా ఈమెకు ఇక్కడ పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఫామ్ లో లేనప్పటికీ కోట్లు ఖరీదు చేసే బంగ్లాలోకి మారనున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూజాహెగ్డే.. తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. 'ముకుంద' అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'డీజే', 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' తదితర చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు టాలీవుడ్ నుంచి సైడ్ అయిపోయింది.
ప్రస్తుతం హిందీలో దేవా, శంకీ అనే చిత్రాలు చేస్తున్న పూజా.. ముంబయిలోని బాంద్రాలో దాదాపు రూ.45 కోట్లు విలువ చేసే మేన్షన్ లోకి మారనుందట. ఇది సమద్రం ఫేసింగ్ తో ఉండటంతో పాటు దాదాపు 4000 S.ft విస్తీరణం ఉంది. ఇంకా చాలా సదుపాయాలే ఉన్నాయట. అయితే పూజా హెగ్డే.. దీన్ని కొనేసిందా? అద్దె ప్రాతిపదికన తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment