లీమా : పెరూ సన్ జుయన్ డీ జిల్లాలోని సర్కాస్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు వెనక దోపిడి దొంగల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించండంతో పలువురికి వినికిడి లోపం ఏర్పడిందని చెప్పారు. అయితే సర్కాస్లోకి ఎవరైనా గ్రేనేడ్ విసిరారా లేకుంటే ముందే సర్కస్లో దీనిని అమర్చి ఉంచారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల కాలంలో పెరూలో దోపిడి దొంగల ఆగడాలు పెచ్చురిల్లాయి. ప్రైవేట్ పాఠశాలు, ట్యాక్సీ డ్రైవర్లు, భవన నిర్మాణ సంస్థలను లక్ష్యంగా చేసుకుని పలువురు దోపిడికి పాల్పడుతున్నారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 వేల ఫిర్యాదులు అందాయని పెరూ చీఫ్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.