సియోల్ : అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఉత్తర కొరియా ఒకదాని తర్వాత ఒకటిగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. తూర్పు సముద్రం వైపు పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
అయితే ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనేది దక్షిణ కొరియా సైన్యం తెలియజేయలేదు. కాగా క్షిపణులు ఇప్పటికే సముద్రంలో పడిపోయాయని భావిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కొద్ది రోజుల క్రితం కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఆ దేశం ఇప్పటివరకు పరీక్షించిన క్షిపణుల కంటే బాలిస్టిక్ క్షిపణి ఎంతో శక్తివంతమైనది. ఈ క్షిపణి ద్వారా అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని ఉత్తర కొరియా గతంలో పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా యూఎస్‌ఏ తాజాగా దక్షిణ కొరియా, జపాన్‌లతో కలసి దీర్ఘ శ్రేణి బీ-వన్ బీ బాంబర్లను ప్రయోగించింది.
ఉత్తర కొరియాకు చెందిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్‌ఏ)ఈ క్షిపణిని 'హ్వాసాంగ్-19' ఐసీబీఎంగా పేర్కొంది. దీనిని ప్రపంచంలోని బలమైన వ్యూహాత్మక క్షిపణి అని పేర్కొంది. ఈ క్షిపణి పరీక్షను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారని, ఉత్తర కొరియాకు చెందిన విశిష్ట వ్యూహాత్మక అణు దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారని కేసీఎన్‌ఏ పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉత్తర కొరియా జరిగిపిన క్షిపణుల ప్రయోగాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో కిమ్‌తో భేటీ అయ్యారు.
ఇది కూడా చదవండి: అన్ని ప్రైవేటు ఆస్తులు ప్రభుత్వానివి కావు: సుప్రీం కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment