Rugby game
-
రగ్బీ ప్లేయర్ నుంచి క్రికెటర్ దాకా.. ఆసక్తికర ప్రయాణం
కగిసో రబాడా.. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్‌గా అందరికి సుపరిచితమే. తన ఫాస్ట్ బౌలింగ్‌తో జట్టును ఎన్నోసార్లు గెలిపించి కీలక బౌలర్‌గా ఎదిగాడు. మంచి వేగంతో బంతులు సంధించే రబాడ దెబ్బకు ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించడంలో దిట్ట. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రబాడా ఐపీఎల్లో వందో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. సాహా వికెట్ తీయడం ద్వారా రబాడ ఈ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రబాడా క్రికెటర్ కాకపోయుంటే రగ్బీ ప్లేయర్ అయ్యేవాడంట. అతని గురించి మనకు తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రగ్బీతో కెరీర్ మొదలుపెట్టి ఆపై క్రికెటర్‌గా.. కగిసో రబాడా మొదట రగ్బీలో కెరీర్‌ను కొనసాగించాలనుకున్నాడు. కానీ అతను తన మొదటి ప్రేమను అంటే రగ్బీని వదులుకోవాల్సి వచ్చింది. రగ్బీ ప్లేయర్ నుంచి కగిసో రబాడా క్రికెటర్‌గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. రబాడాకు చిన్నప్పటి నుంచి రగ్బీ అంటే ఆసక్తి. అతను పాఠశాల జట్టుతో రగ్బీ ఆడేవాడు. కానీ ఒక్కసారి ఆఫ్ సీజన్ కారణంగా సరదాగా క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. తర్వాత ఎ లెవల్ క్రికెట్ టీమ్‌లోనూ, రగ్బీ టీమ్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. అందుకే ఈ ఆటగాడు రగ్బీని వదిలి క్రికెటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు మే 25, 1995న జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించిన రబాడా 2013లో దేశవాళీ క్రికెట్లో ఆడడం ప్రారంభించాడు. మరుసటి సంవత్సరం అంటే 2014లో అండర్-19 ప్రపంచకప్ జట్టులోకి ఎంపికయ్యాడు. తన ప్రతిభను ప్రదర్శించేందుకు రబడకు ఇది పెద్ద వేదికగా మారింది. అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో తన స్పీడ్ మ్యాజిక్‌ను చూపించాడు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై రబాడా 25 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ సంవత్సరం ప్రొటీస్ జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. Photo: IPL Twitter తండ్రి డాక్టర్, తల్లి లాయర్ దీంతో.. కగిసో రబాడాకి ఆర్థికంగా ఇబ్బందులు లేవు. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది. అండర్-19 టి20 ప్రపంచకప్ తర్వాత అతను విజయాల మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఈ టాల్ ఫాస్ట్ బౌలర్ 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 19 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన రబాడా అరంగేట్రం టీ20లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. Photo: IPL Twitter టి20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఒక సంవత్సరం తర్వాత 2015లో రబాడా తన వన్డే అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో.. రబాడా 3 మెయిడిన్లు బౌలింగ్ వేసి 8 ఓవర్లలో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టాడు. ఇక కగిసో రబడ ఐపీఎల్ లో 2022 సంవత్సరంలో 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీయగా, 2021 సంవత్సరంలో 15 వికెట్లు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో రబడ అత్యుత్తమ ప్రదర్శన 2020లో వచ్చింది. ఈ సీజన్ లో 17 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 64 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు తీశాడు. -
రగ్బీలో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ..
చేగుంట(తూప్రాన్): రాష్ట్ర స్థాయి జూనియర్ రగ్బీ పోటీల్లో మెదక్ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని డాన్‌బాస్కో స్కూల్ గ్రౌండ్లో జరిగిన అండర్–18 జూనియర్ రగ్బీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. మేడ్చల్ జిల్లా టీంతో పోటీ పడి 5–0 స్కోర్‌తో విజయం సాధించారు. అమ్మాయిల విభాగం నుంచి శ్రీవాణి, నవీన, బాలుర విభాగం నుంచి శ్రీకాంత్, నితిన్ జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికయ్యారని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ సువర్ణ, కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. వీరు ఒడిస్సాలో వచ్చే నెల 10 వతేదీ నుంచి 13 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా రగ్బీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
రగ్భీలో దుమ్మురేపిన ఫిజీ.. వరుసగా రెండోసారి స్వర్ణం
టోక్యో: పసిఫిక్ మహా సముద్రంలోని ఓ చిరు దీవి ఫిజీ దేశం తన రగ్బీ టైటిల్ నిలబెట్టుకుంది. తద్వారా వరుస ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాలు సాధించింది. బుధవారం జరిగిన ఫైనల్లో ఫిజీ జట్టు 27–12 స్కోరు తేడాతో ప్రపంచకప్ చాంపియన్ న్యూజిలాండ్‌పై నెగ్గింది. ఇటు ఫిజీ, అటు కివీస్... ఇరు దేశాల జాతీయ క్రీడ రగ్బీనే! పైగా ఫైనల్ కూడా ఈ రెండు పసిఫిక్ జట్ల మధ్యే జరగడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో ఫిజీ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. తొలి అర్ధభాగంలోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. 19–12తో ముగించారు. ఇక ద్వితీయార్ధంలో అయితే న్యూజిలాండ్‌ను ఒక్క పాయింట్ కూడా చేయనీకుండా పరిపూర్ణ ఆధిపత్యాన్ని చాటారు. రెండో అర్ధ భాగంలో ఫిజీ మరో 8 పాయింట్లు చేస్తే కివీస్ స్కోరే చేయలేదు. ఈ విజయం కోసం, ఒలింపిక్స్ స్వర్ణం కోసం రగ్బీ జట్టు ఓ రకంగా యజ్ఞమే చేసింది. కోవిడ్ కోరలకు చిక్కకుండా ఒకట్రెండు కాదు నెలల తరబడి బయో బబుల్‌లో గడిపింది. కఠోర సాధన చేసింది. ఇప్పుడు అనుకున్నది సాధించినా... వెంటనే కుటుంబాలను కలిసే వీల్లేదు. కఠినమైన క్వారంటైన్ పూర్తయ్యాకే టైటిల్ సంతోషాన్ని ఫిజీ వాసులతో, కుటుంబసభ్యులతో పంచుకోవాల్సి ఉంటుంది. కివీస్ రజతంతో సరిపెట్టుకోగా... కాంస్య పతక పోరులో అర్జెంటీనా 17–12తో గత రన్నరప్ బ్రిటన్ను ఓడించింది. రగ్బీ క్రీడాంశాన్ని 2016 రియో ఒలింపిక్స్‌లోనే ప్రవేశపెట్టారు. నాడు హంగామా... ‘రియో’లోనే ఈ ఆట రగ్బీ సెవెన్ పేరుతో విశ్వక్రీడల్లో భాగమైంది. తమకు ఇష్టమైన క్రీడలో ఫిజీ ఆటగాళ్లు ఆరంభం నుంచే అద్భుత ప్రదర్శన కనబరిచారు. చివరకు ఒలింపిక్స్ రగ్బీ సెవెన్లో బంగారు బోణీ కొట్టారు. ఈ ఘనతను, ఘనవిజయాన్ని ఆటగాళ్లకు ప్రోత్సాహంతో, భారీ ప్రైజ్‌మనీతో సరిపెట్టకుండా ఫిజీ ప్రభుత్వం చిరస్మరణీయం చేసుకోవాలని నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్‌తో 7 ఫిజీ డాలర్ నోటును ముద్రించింది. నిజానికి ఏ దేశంలోనూ 7 విలువైన నోటు, నాణెం లేనేలేదు. అంతా 5, 10, 20, 50, 100 విలువల్లోనే ఉంటాయి. కానీ ఫిజీ తమ జట్టు సాధించిన రగ్బీ సెవెన్ ‘గోల్డ్’కు గుర్తుగా ఈ నోట్లను ముద్రించింది. అన్నట్లు కేవలం 9 లక్షల జనాభా కలిగిన ఫిజీ దేశానికి ఒలింపిక్స్ చరిత్రలో అదే తొలి స్వర్ణం! -
కరోనాతో మళ్లీ కివీస్‌లో లాక్డౌన్
వెల్లింగ్టన్ : కరోనా ప్రభావం లేకపోవడంతో న్యూజిలాండ్‌లో అతి సాధారణ పరిస్థితుల్లో జరిగిన క్రీడలు మళ్లీ నిబంధనల చట్రంలో ఇరుక్కున్నాయి. ఆక్లాండ్‌లో తాజాగా నాలుగు పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని జసిండా ఆడెర్న్ ప్రకటించారు. కేసులు బయటపడిన ఆక్లాండ్‌లో లెవల్–3 లాక్డౌన్, మిగతా ప్రాంతాల్లో లెవల్–2 లాక్డౌన్ బుధవారం నుంచి 72 గంటల పాటు ఉంటుందని ఆమె వెల్లడించారు. దీంతో ఈ వారాంతంలో జరగనున్న సూపర్ రగ్బీ చివరి రౌండ్ పోటీల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఆక్లాండ్‌లో ఆదివారం బ్లూస్, క్రూసేడర్స్ మధ్య జరుగనున్న మ్యాచ్‌ను దాదాపు 43,000 మంది ప్రత్యక్షంగా వీక్షించే అవకాశముంది. లెవల్–3 నిబంధనల ప్రకారం ప్రధాన క్రీడా టోర్నీలు నిర్వహించేందుకు అనుమతి లేదు. ఒకవేళ ఆక్లాండ్‌లో లాక్‌డౌన్‌ను వారాంతానికి పొడిగిస్తే ఈ మ్యాచ్‌కూ ఆటంకం కలగవచ్చు. లెవల్–2 ప్రాంతాల్లో ప్రేక్షకులు లేకుండా టోర్నీలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. జూన్ 14న జరిగిన ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఆక్లాండ్‌లోని ఈడెన్‌పార్క్‌లో బ్లూస్, హారికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 40,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. 102 రోజుల తర్వాత న్యూజిలాండ్‌లో మళ్లీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
నేటి నుంచి రగ్బీ టోర్నమెంట్
హైదరాబాద్: భారత రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ (ఐఆర్‌ఎఫ్‌యూ) ఆధ్వర్యంలో తెలంగాణ రగ్బీ సంఘం సహకారంతో నేటి నుంచి జాతీయ సబ్ జూనియర్ రగ్బీ చాంపియన్‌షిప్ జరగనుంది. జింఖానా మైదానంలో రెండు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు శుక్రవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఆర్‌ఎఫ్‌యూ ప్రతినిధి సందీప్ తెలిపారు. గతంలో రెండు సార్లు హైదరాబాద్‌లోనే ఈ పోటీలను నిర్వహించామని, ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈసారి కూడా ఇక్కడే టోర్నీని జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇందులో 21 రాష్ట్రాలకు చెందిన 670 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. 15 నిమిషాల పాటు జరిగే మ్యాచ్‌లో తొలి 7 నిమిషాల తర్వాత ఒక నిమిషం విరామం ఉంటుందన్నారు. ప్రతీ జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. -
‘సై’రా మహేంద్ర
పట్టుదల, ఏకాగ్రతతో జాతీయస్థాయిలో క్రీడల్లో రాణించి తర్లుపాడు మండలం నాయుడుపల్లె గ్రామానికి వన్నె తెచ్చాడో ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి. ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా రగ్బీ ఆటపై అతనికున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆటకు తమ సహాయ సహకారాలు అందించి జాతీయస్థాయిలో రాణించే విధంగా తోడ్పడ్డారు. సాధనతో ఏదైనా సాధించవచ్చని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు గాలి మహేంద్రరెడ్డి. తర్లుపాడు: జిల్లాలోని తర్లుపాడు మండలం నాయుడుపల్లె గ్రామానికి చెందిన గాలి వెంకట రంగారెడ్డి, జి.వి.శివ దంపతుల కుమారుడు మహేంద్రరెడ్డి. పాఠశాల స్థాయిలో రగ్బీ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు. పోటీల్లో రాణిస్తూ పలు బహుమతులు సాధించాడు. రగ్బీపై మహేంద్రరెడ్డికి ఉన్న ఆసక్తి, రాణిస్తున్న తీరును గమనించి ఫారిన్ కోచ్‌లు పలు సూచనలు చేస్తూ కర్నూలులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పంజాబ్‌లోని లూథియానాలో జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు గతనెల 30 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నిర్వహించారు. ఆ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి మహేంద్రరెడ్డి కెప్టెన్‌గా సెమీ ఫైనల్ ఆడటం మండలం, జిల్లా, రాష్ట్రానికే వన్నె తెచ్చింది. రగ్బీ క్రీడ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.జి.భరత్, సెక్రటరీ బి.రామాంజనేయులు, సీనియర్ క్రీడాకారుల ప్రొత్సాహంతో పలు విభాగాల్లో రాణించి ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. రెండేళ్ల క్రిందట జిల్లా స్థాయి పోటీల్లో రాణించాడు. ఆ తరువాత 2017 సెప్టెంబర్‌లో సౌత్ జోన్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీల్లో కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రగ్బీ క్రీడాకారులు పాల్గొన్నారు. సౌత్ జోన్ పోటీల్లో మహేంద్రరెడ్డి రాణించటంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ప్రభుత్వం చేయూతనివ్వాలి: జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వం చేయూతనిచ్చి ప్రొత్సహించాల్సి ఉంది. ప్రతిభ చాటిన క్రీడాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మండల, పట్టణ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి శిక్షకులను నియమించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న పేద క్రీడాకారులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఉపకార వేతనం అందించాలని పలువురు క్రీడాభిమానులు కోరుతున్నారు. ప్రతిభ ఉన్నా ఆర్థికస్థోమత లేని క్రీడాకారులు ఎందరో మరుగున పడుతున్నారని వారిని గుర్తించి ప్రోత్సహించాలంటున్నారు. రగ్బీ క్రీడలో ఆల్ ఇండియా డివిజన్ 2లో 15ఎస్ ఛాంపియన్షిప్ ఆడిన గాలి మహేంద్రరెడ్డి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా పశ్చిమ ప్రకాశానికి వన్నె తెచ్చాడని సాధన డిగ్రీ కళాశాల డైరెక్టర్ జి.ఎల్.రమేష్‌బాబు విద్యార్థిని అభినందించారు. కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న మహేంద్రరెడ్డి జాతీయ క్రీడల్లో రాణించటం కళాశాలకే గర్వకారణంగా ఉందన్నారు. -
తెలంగాణ జట్ల ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఎస్జీఎఫ్ఐ జాతీయ రగ్బీ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ జట్లు ఓటమితో ప్రారంభించాయి. లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ జట్లు తలపడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవిచూశాయి. గురువారం జరిగిన అండర్–17 బాలుర తొలి మ్యాచ్‌లో తెలంగాణ 0–21తో బిహార్ చేతిలో, రెండో మ్యాచ్‌లో 0–10తో పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడింది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 0–20తో పంజాబ్ చేతిలో ఓడిపోయింది. అండర్–19 విభాగంలోనూ ఛత్తీస్‌గఢ్ 7–0తో తెలంగాణపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 25–0తో జమ్మూ కశ్మీర్‌పై, ఒడిశా 14–0తో గుజరాత్‌పై, ఢిల్లీ 14–7తో పంజాబ్‌పై, బిహార్ 34–0తో రాజస్తాన్‌పై, జమ్మూ కశ్మీర్ 15–0తో విద్యాభారతిపై విజయం సాధించాయి. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు అండర్–17 బాలురు: బిహార్ 0–22తో ఆంధ్రప్రదేశ్‌పై, ఢిల్లీ 15–0తో గుజరాత్‌పై, రాజస్తాన్ 5–0తో ఛత్తీస్‌గఢ్‌పై నెగ్గాయి.బాలికలు: తమిళనాడు 18–0తో పంజాబ్‌పై, ఛత్తీస్‌గఢ్ 17–0తో రాజస్తాన్‌పై, ఒడిశా 22–0తో జమ్మూ కశ్మీర్‌పై, బిహార్ 27–0తో గుజరాత్‌పై, పంజాబ్ 10–0తో ఆంధ్రప్రదేశ్‌పై, ఢిల్లీ 5–0తో ఛత్తీస్‌గఢ్‌పై గెలిచాయి. -
పెళ్లి నుంచి తప్పించుకొని.. జాతీయ జట్టుకు ఆడుతూ
సాక్షి, హైదరాబాద్ : బాల్యవివాహం నుంచి తప్పించుకున్న హైదరాబాద్‌కు యువ క్రీడాకారిణి నేడు జాతీయ రగ్బీ జట్టుకు ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన బి అనూష అనే విద్యార్థి పదో తరగతి చదువుతున్న సమయంలో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వివాహం ఇష్టం లేని అనూష చైల్డ్‌లైన్ అధికారులను ఆశ్రయించింది. పెళ్లికి పదిరోజుల ముందు చైల్డ్‌లైన్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో అనూష వివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహం నేరమౌతుందని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం నుంచి బయటపడిన అనూష ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతోంది. అంతే కాకుండా మహిళల రగ్బీఆటలో ప్రతిభ చూపింది. జాతీయ జట్టుకు ఎంపికైంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడటం తన లక్ష్యం అని అనూష తెలిపింది. గతంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన మహిళల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో తెలంగాణ తరపున ఆడింది. -
జాతీయ రగ్బీ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మరో జాతీయ స్థాయి టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. భా రత స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్ఐ) రగ్బీ జాతీయ చాంపియన్‌షిప్ బుధవారం ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మొత్తం 14 రాష్ట్రాలకు చెందిన జట్లు ఇందులో తలపడుతున్నాయి. మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆసియా రగ్బీ చాంపియన్‌షిప్‌ను కూడా నగరంలో నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు. -
కాసేపట్లో రగ్బీ.. సింహం నోట్లోకి చేయి
సౌత్ ఆఫ్రికా: బోనులో ఉన్నా.. బయట ఉన్నా సింహం సింహమే.. ఆ విషయం ఆదమరిచారో అంతే సంగతులు.. బహుషా ఈ విషయం మరిచినట్లున్నాడు ఓ రగ్బీ ప్లేయర్.. ఏం చక్కా మరికాసేపట్లో రగ్బీలో ప్రత్యర్థిపై తలపడాల్సిన ఆ క్రీడాకారుడు సింహం చేత కరిపించుకొని ఆస్పత్రి పాలయ్యాడు. సింహాన్ని చూసేందుకు వెళ్లి దాని తలపై చేయిపెట్టి దువ్వుతూ అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. స్కాట్ బల్ద్విన్ అనే రగ్బీ క్రీడాకారుడు తన టీంతో కలిసి దక్షిణాప్రికాలో జరిగే రగ్బీ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. సరదాగా అక్కడ పెంపుడు సింహాలను పెంచుతున్న చోటకు వెళ్లాడు. ఆ తర్వాత అవి బోనులో తిరుగుతుండగా ఫొటో తీసుకోవడంతోపాటు బోను పక్కనే కూర్చున్న సింహంపై తలపెట్టి కొద్ది సేపు దువ్వాడు. సరిగ్గా దాని ముఖంపై చేతితో తడిమే లోగానే వెంటనే సింహం చేతినందుకుంది. దీంతో అబ్బా అంటూ గారు కేకలు వేశాడు. ఏదోలా తన చేతిని లాక్కున్నాడుగానీ గాయాలు మాత్రం అయ్యాయి. అతడి చేతికి కుట్లు కూడా పడ్డాయి. దీంతో చివరకు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా కూడా అందుకే అత్యుత్సాహం పనికిరాదంటూ హితవు పలుకుతున్నారు. -
కాసేపట్లో రగ్బీ.. సింహంతో పెట్టుకున్నాడు
-
సిటీలో.. అమెరికా ఆట
గ్రెడిరన్ ఫుట్‌బాల్ అలియాస్ అమెరికన్ ఫుట్‌బాల్. రగ్బీకి నెక్స్ట్వర్షన్. మినీ యాక్షన్ మూవీని తలపించే ఈ క్రీడను భారతీయులు ఇప్పుడిప్పుడే ఆదరిస్తున్నారు. సినిమాల ప్రభావమో, కార్పొరేట్, ప్రభుత్వ రంగాల చొరవో... మొత్తానికి క్రికెట్‌నే ఆదరించే దేశంలో ఈ ఆట కూడా పాపులర్ అవుతోంది. మొట్టమొదటిసారిగా ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో తలపడుతున్న హైదరాబాద్ టీమ్ స్కైకింగ్స్కు సిటీవాసి ప్రవీణ్ చింతల తొలి సర్టిఫైడ్ కోచ్. ఈ సందర్భంగా ఆయన ‘సిటీ ప్లస్’తో ముచ్చటించారు... - కళ డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆర్మీలో స్పోర్ట్స్ కోటాలో కోర్ ఆఫ్ మిలటరీ పోలీస్‌లో జాబ్ వచ్చింది. అక్కడ హైట్, స్పీడ్ ఉండటంతో రగ్బీ గేమ్‌కి సెలెక్ట్ చేశారు. అలా ఆర్మీ తరపున ఇండియాలోని అన్ని మేజర్ క్లబ్స్‌లో రగ్బీ ఆడాను. 2009 లో కోచింగ్ సర్టిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి కోచ్‌గా పని చేస్తున్నా. ఇక అమెరికన్ ఫుట్‌బాల్ విషయానికొస్తే... ఇండియాలో 3 ఏళ్ల నుంచి ఆడుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే రగ్బీకి నెక్ట్స్వెర్షన్ అమెరికన్ ఫుట్‌బాల్. రగ్బీ ప్లేయర్ చూడటానికి సాకర్ ప్లేయర్లా కనిపిస్తాడు. అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ చూడటానికి గ్లాడియేటర్లా కనిపిస్తాడు. రగ్బీ ప్లేయర్స్‌కి ఉండే స్పీడ్, స్కిల్స్ దీనికి సరిపోతాయి. అప్పటికే నేను సర్టిఫైడ్ రగ్బీ కోచ్ కావటం వల్ల నాకు అవకాశం వచ్చింది. ఆదరణ పెరుగుతోంది... హైదరాబాద్‌లో 2012లో జరిగిన మొదటి మ్యాచ్‌లో పాల్గొన్నాను. మొదటిసారే 12 వేల మంది మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో ఆడినప్పుడు 26 వేల మంది వచ్చారు. ఇంకా ఈ గేమ్ గురించి ఎక్కువ అవగాహన లేదు. అవగాహన పెరిగితే పోటీ పెరుగుతుంది. 16-28 వయసు వాళ్లు దీంట్లో శిక్షణ తీసుకోవచ్చు. అథ్లెట్ అయి ఉండాలి. ఈ ఆటలో ఒక జట్టుకి 44 మంది ఉంటారు. అలా 44 మందికి వ్యక్తిగత స్థానాలు ఉంటాయి. ఇందులో అతనికి అప్పగించిన బాధ్యతను చేసి వెళ్లిపోతే సరిపోతుంది. ఈ గేమ్‌లో ఆల్‌రౌండర్స్ కొంతమందే ఉంటారు. మ్యాచ్ మొత్తం 60 నిమిషాలపాటు జరుగుతుంది. ఇది పూర్తి స్థాయి ప్రొఫెషనల్ లీగ్. 2016లో ఐపీఎల్ తరహాలో వేలం ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో క్రీడలకు మార్కెట్ ఏర్పడుతోంది. భవిష్యత్తులో మంచి అవకాశాలున్నాయి. ఎన్ఎఫ్ఎల్, ఈఎఫ్‌ఎల్‌ఐ... ప్రపంచంలోనే అత్యధిక సంపన్నమైన స్పోర్ట్స్ లీగ్ ఎన్ఎఫ్ఎల్. వాళ్లు ఇండియాలో ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేసి, దాని తరపున మొదటిసారి అమెరికా ఫుట్‌బాల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈఎఫ్ఎల్ఐలో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. పాకిస్తాన్, శ్రీలంక జట్లు కూడా ఉన్నాయి. శ్రీలంకలో మొదటి సీజన్ జరిగింది. హైదరాబాద్ టీం స్కైకింగ్స్ రాక ముందు కోల్‌కతా జట్టు కోసం ఆడాము.