Medak Students Selected For National Level Rubby Competitions - Sakshi
Sakshi News home page

రగ్బీలో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ..  

Nov 30 2021 2:13 PM | Updated on Nov 30 2021 2:52 PM

Medak Students Selected For National Rugby Game - Sakshi

చేగుంట(తూప్రాన్‌): రాష్ట్ర స్థాయి జూనియర్‌ రగ్బీ పోటీల్లో మెదక్‌ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని డాన్‌బాస్కో స్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన అండర్‌–18 జూనియర్‌ రగ్బీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. మేడ్చల్‌ జిల్లా టీంతో పోటీ పడి 5–0 స్కోర్‌తో విజయం సాధించారు.

అమ్మాయిల విభాగం నుంచి శ్రీవాణి, నవీన, బాలుర విభాగం నుంచి శ్రీకాంత్, నితిన్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికయ్యారని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్‌ సువర్ణ, కోచ్‌ కర్ణం గణేష్‌ రవికుమార్‌ తెలిపారు. వీరు ఒడిస్సాలో వచ్చే నెల 10 వతేదీ నుంచి 13 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement