నేటి నుంచి రగ్బీ టోర్నమెంట్‌ | National Sub Junior Rugby Starts Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రగ్బీ టోర్నమెంట్‌

Published Sat, Feb 1 2020 10:05 AM | Last Updated on Sat, Feb 1 2020 10:05 AM

National Sub Junior Rugby Starts Today - Sakshi

హైదరాబాద్‌: భారత రగ్బీ ఫుట్‌బాల్‌ యూనియన్‌ (ఐఆర్‌ఎఫ్‌యూ) ఆధ్వర్యంలో తెలంగాణ రగ్బీ సంఘం సహకారంతో నేటి నుంచి జాతీయ సబ్‌ జూనియర్‌ రగ్బీ చాంపియన్‌షిప్‌ జరగనుంది. జింఖానా మైదానంలో రెండు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు శుక్రవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఆర్‌ఎఫ్‌యూ ప్రతినిధి సందీప్‌ తెలిపారు.

గతంలో రెండు సార్లు హైదరాబాద్‌లోనే ఈ పోటీలను నిర్వహించామని, ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఈసారి కూడా ఇక్కడే టోర్నీని జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇందులో 21 రాష్ట్రాలకు చెందిన 670 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. 15 నిమిషాల పాటు జరిగే మ్యాచ్‌లో తొలి 7 నిమిషాల తర్వాత ఒక నిమిషం విరామం ఉంటుందన్నారు. ప్రతీ జట్టుకు ఏడుగురు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement