తెలంగాణ జట్ల ఓటమి | telangana teams loses opening games in national rugby championship | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్ల ఓటమి

Feb 9 2018 10:38 AM | Updated on Feb 9 2018 10:38 AM

telangana teams loses opening games in national rugby championship - Sakshi

తెలంగాణ, బిహార్‌ జట్ల మధ్య మ్యాచ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయ రగ్బీ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ జట్లు ఓటమితో ప్రారంభించాయి. లాల్‌బహదూర్‌ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ జట్లు తలపడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయాన్ని చవిచూశాయి. గురువారం జరిగిన అండర్‌–17 బాలుర తొలి మ్యాచ్‌లో తెలంగాణ 0–21తో బిహార్‌ చేతిలో, రెండో మ్యాచ్‌లో 0–10తో పంజాబ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. మరో మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ 0–20తో పంజాబ్‌ చేతిలో ఓడిపోయింది. అండర్‌–19 విభాగంలోనూ ఛత్తీస్‌గఢ్‌ 7–0తో తెలంగాణపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్‌ 25–0తో జమ్మూ కశ్మీర్‌పై, ఒడిశా 14–0తో గుజరాత్‌పై, ఢిల్లీ 14–7తో పంజాబ్‌పై, బిహార్‌ 34–0తో రాజస్తాన్‌పై, జమ్మూ కశ్మీర్‌ 15–0తో విద్యాభారతిపై విజయం సాధించాయి.

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

అండర్‌–17 బాలురు: బిహార్‌ 0–22తో ఆంధ్రప్రదేశ్‌పై, ఢిల్లీ 15–0తో గుజరాత్‌పై, రాజస్తాన్‌ 5–0తో ఛత్తీస్‌గఢ్‌పై నెగ్గాయి.బాలికలు: తమిళనాడు 18–0తో పంజాబ్‌పై, ఛత్తీస్‌గఢ్‌ 17–0తో రాజస్తాన్‌పై, ఒడిశా 22–0తో జమ్మూ కశ్మీర్‌పై, బిహార్‌ 27–0తో గుజరాత్‌పై, పంజాబ్‌ 10–0తో ఆంధ్రప్రదేశ్‌పై, ఢిల్లీ 5–0తో ఛత్తీస్‌గఢ్‌పై గెలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement