సిటీలో.. అమెరికా ఆట | america game... in city | Sakshi
Sakshi News home page

సిటీలో.. అమెరికా ఆట

Published Sun, Jan 11 2015 11:30 PM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM

సిటీలో.. అమెరికా ఆట - Sakshi

సిటీలో.. అమెరికా ఆట

గ్రెడిరన్ ఫుట్‌బాల్ అలియాస్ అమెరికన్ ఫుట్‌బాల్. రగ్బీకి నెక్స్ట్‌వర్షన్. మినీ యాక్షన్ మూవీని తలపించే ఈ క్రీడను భారతీయులు ఇప్పుడిప్పుడే ఆదరిస్తున్నారు. సినిమాల ప్రభావమో, కార్పొరేట్, ప్రభుత్వ రంగాల చొరవో... మొత్తానికి క్రికెట్‌నే ఆదరించే దేశంలో ఈ ఆట కూడా పాపులర్ అవుతోంది. మొట్టమొదటిసారిగా ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో తలపడుతున్న హైదరాబాద్ టీమ్ స్కైకింగ్స్‌కు సిటీవాసి ప్రవీణ్ చింతల తొలి సర్టిఫైడ్ కోచ్. ఈ సందర్భంగా ఆయన ‘సిటీ ప్లస్’తో ముచ్చటించారు...
 - కళ

డిగ్రీ సెకెండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆర్మీలో స్పోర్ట్స్ కోటాలో కోర్ ఆఫ్ మిలటరీ పోలీస్‌లో జాబ్ వచ్చింది. అక్కడ హైట్, స్పీడ్ ఉండటంతో  రగ్బీ గేమ్‌కి సెలెక్ట్ చేశారు. అలా ఆర్మీ తరపున ఇండియాలోని అన్ని మేజర్ క్లబ్స్‌లో రగ్బీ ఆడాను. 2009 లో కోచింగ్ సర్టిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి కోచ్‌గా పని చేస్తున్నా.

ఇక అమెరికన్ ఫుట్‌బాల్ విషయానికొస్తే... ఇండియాలో 3 ఏళ్ల నుంచి ఆడుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే రగ్బీకి నెక్ట్స్‌వెర్షన్ అమెరికన్ ఫుట్‌బాల్. రగ్బీ ప్లేయర్ చూడటానికి సాకర్ ప్లేయర్‌లా కనిపిస్తాడు. అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ చూడటానికి గ్లాడియేటర్‌లా కనిపిస్తాడు. రగ్బీ ప్లేయర్స్‌కి ఉండే స్పీడ్, స్కిల్స్ దీనికి సరిపోతాయి. అప్పటికే నేను సర్టిఫైడ్ రగ్బీ కోచ్ కావటం వల్ల నాకు అవకాశం వచ్చింది.
 
ఆదరణ పెరుగుతోంది...

హైదరాబాద్‌లో 2012లో  జరిగిన మొదటి మ్యాచ్‌లో పాల్గొన్నాను. మొదటిసారే 12 వేల మంది మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో ఆడినప్పుడు 26 వేల మంది వచ్చారు. ఇంకా ఈ గేమ్ గురించి ఎక్కువ అవగాహన లేదు. అవగాహన పెరిగితే పోటీ పెరుగుతుంది. 16-28 వయసు వాళ్లు దీంట్లో శిక్షణ తీసుకోవచ్చు. అథ్లెట్ అయి ఉండాలి. ఈ ఆటలో ఒక జట్టుకి 44 మంది ఉంటారు. అలా 44 మందికి వ్యక్తిగత స్థానాలు ఉంటాయి.

ఇందులో అతనికి అప్పగించిన బాధ్యతను చేసి వెళ్లిపోతే సరిపోతుంది. ఈ గేమ్‌లో ఆల్‌రౌండర్స్ కొంతమందే ఉంటారు. మ్యాచ్ మొత్తం 60 నిమిషాలపాటు జరుగుతుంది. ఇది పూర్తి స్థాయి ప్రొఫెషనల్ లీగ్. 2016లో ఐపీఎల్ తరహాలో వేలం ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో క్రీడలకు మార్కెట్ ఏర్పడుతోంది. భవిష్యత్తులో మంచి అవకాశాలున్నాయి.
 
ఎన్‌ఎఫ్‌ఎల్, ఈఎఫ్‌ఎల్‌ఐ...
ప్రపంచంలోనే అత్యధిక సంపన్నమైన స్పోర్ట్స్ లీగ్ ఎన్‌ఎఫ్‌ఎల్. వాళ్లు ఇండియాలో ఎలైట్ ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేసి, దాని తరపున మొదటిసారి అమెరికా ఫుట్‌బాల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈఎఫ్‌ఎల్‌ఐలో మొత్తం ఆరు జట్లు ఉంటాయి. పాకిస్తాన్, శ్రీలంక జట్లు కూడా ఉన్నాయి. శ్రీలంకలో మొదటి సీజన్ జరిగింది.  హైదరాబాద్ టీం స్కైకింగ్స్ రాక ముందు కోల్‌కతా జట్టు కోసం ఆడాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement