సియోల్ : మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కొరియాకు చేరుకున్న సియోల్లో పర్యటిస్తున్నారు. ఆయనకు సౌత్ కొరియాలో ఘన స్వాగతం లభించింది. సియోల్ విమానాశ్రయానికి చేరుకున్న వందలాదిమంది భారతీయులు ప్రధానితో చేయి కలపడానికి ఉత్సాహం చూపారు. అనంతరం సౌత్ కొరియా జాతీయ సమాధిని ప్రధాని సందర్శించిన ఆ తర్వాత కొరియా కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు.
సౌత్ కొరియాలోని భారత సమాజం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్ హాల్ మోదీ మోదీ... నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ సంవత్సరాల కాల పాలనలో దేశంలో ఎంతో అభివృద్ధిని సాదించిందనీ, అందుకే మెరుగైన అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులందరూ తిరిగి భారతదేశానికి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.
పెద్ద పెద్ద భవనాలు,మంచి రోడ్లు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని, ప్రజలకు మంచి జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నాని మోదీ అన్నారు. దేశంలోని మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఇంకా ఆరుబైటకు వెళ్లడం సిగ్గు చేటంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
భారత్ లేకుండా బ్రిక్స్ లేదన్నారు. భారత్ అభివృద్ధి పథాన్నిఎంచుకుందనీ ప్రపంచంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారత్ రావాలన్నారు. దేశం పట్ల ప్రపంచ దృక్పథం మారిందని, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా అవతరిస్తుందని ప్రధాని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ.. కొరియా ప్రెసిడెంట్ పార్క్ జియోన్ హై తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అటు వివిధ కంపెనీల సీఈవోలతోనూ సమావేశం కానున్నారు.
భారత్ పట్ల ప్రపంచం తీరు మారింది
Published Mon, May 18 2015 11:35 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement