సియోల్ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ‘ఎ’ సిరీస్‌లో మరో ఫోన్‌ను పరిచయం చేసింది. అందరూ ఊహించినట్టుగా శాంసంగ్ గెలాక్సీ ఏ 90 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను నేడు (మంగళవారం, సెప్టెంబరు 3) దక్షిణ కొరియాలో తీసుకొచ్చింది. ఇది గెలాక్సీ ఏ సిరీస్‌లో మొట్ట మొదటి 5జీ డివైస్ కాగా, శాంసంగ్ డెక్స్ సపోర్ట్‌తో వచ్చిన తొలి ఫోన్ కూడా. అంతేకాదు శాంసంగ్ ఎస్10, శాంసంగ్ నోట్ 10, నోట్ 10 ప్లస్ తరువాత వస్తున్న నాల్గవ 5జీ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ ఏ 90 కావడం మరో విశేషం.
స్లిమ్ బెజెల్స్ ఇన్‌ఫినిటీ యూ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 64, 128 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. అయితే 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ను 512 జీబీ వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించింది. రేపటి నుంచి కొరియన్ మార్కెట్లలో విక్రయానికి లభ్యం. అయితే ధర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అలాగే ఇండియాలో 5జీ వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ ఏ 90 4జీ వేరియంట్‌ను ఇండియాలో తీసుకొస్తుందా లేదా, వచ్చే ఏడాది దాకా వెయిట్ చేస్తుందా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు.
శాంసంగ్ ఏ 90 ఫీచర్లు
6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ చిప్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
48+8+5 ఎంపీ రియర్ కెమెరా
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
4500 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment