
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ 20 అల్ట్రాకు సంబంధించి అనేక రూమర్లు, ఆసక్తికర మైన అంశాలు ఇప్పటికే మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా 108 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో, 5జీ టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుందని తాజా లీక్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ఆగస్టు 5న ఆవిష్కరించనుందని సమాచారం.
గెలాక్సీ ఎస్ 20 అల్ట్రాలో108 మెగాపిక్సెల్ కెమెరా ఖాయం అంటూ ప్రముఖ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ ట్వీట్ చేశారు. 108 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు 6.9 అంగుళాల భారీ స్క్రీన్ తో గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా ను తీసుకు రానుందని అంచనా. అలాగే ఎస్-పెన్ స్థానాన్ని మార్చనుందని భావిస్తున్నారు. అయితే, ప్లస్ మోడల్ ను కూడా లాంచ్ చేయనుందా, లేదంటే రెగ్యులర్ నోట్ 20, అల్ట్రా తీసుకొస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. (గెలాక్సీ నోట్ 10 లైట్ ధర తగ్గింది : క్యాష్‌బ్యాక్ కూడా)
Samsung Galaxy Note 20 "Ultra" ("Canvas2") has a 108MP main cam. I know we knew, but I've seen hard evidence now, so consider it confirmed from my end.
— Roland Quandt (@rquandt) June 25, 2020
Comments
Please login to add a commentAdd a comment