ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్: స్కూల్‌కు సెలవులు ఇవ్వడం లేదని ఓ విద్యార్ధి ఏకంగా 20 మంది విద్యార్ధుల జీవితాలను ఇరకాటంలో పెట్టాడు. ఎందుకు చేశావని స్కూల్ ప్రిన్సిపాలు అడిగితే అతను చెప్పిన సమాధానం విని అందరూ నోరెళ్ల బెట్టారు. అసలేంజరిగిందంటే..
ఒడిశాలోని బర్‌గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌ల్లో 11వ తరగతి చదివే విద్యార్థి (16) తన 20 మంది స్నేహితులకు బాటిల్ నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ ప్రేమానంద్ పటేల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కారణంగా మరోమారు లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని నేరానికి పాల్పడిన విద్యార్ధి ఆశించాడు. అలా జరగకపోవడంతో ఈ పనికి పూనుకున్నాడని తెలిపాడు. ఐతే అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు సదరు విద్యార్ధిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే విద్యార్ధి కెరీర్, చిన్న వయసును దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చెయ్యలేదు. ఐతే పాఠశాల యాజమన్యం సదరు విద్యార్ధిని కొన్ని రోజులపాటు స్కూల్ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
పాఠశాలలోని హాస్టల్‌లో నివసిస్తున్న విద్యార్ధి ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్నాడు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లు వచ్చినప్పుడు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఒమిక్రాన్ వల్ల కూడా స్కూళ్లు మూతపడి సెలవులిస్తారని అనుకున్నాడు. అలా జరగకపోవడంతో తోటలోని పురుగుల మందును నీళ్లలో కలిపి విద్యార్ధులకు తాగేందుకు ఇచ్చాడు. నీళ్లను తాగిన విద్యార్ధులు ఆనారోగ్యానికి గురయ్యారు.
చదవండి: జపాన్‌లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..!
Comments
Please login to add a commentAdd a comment