Covid 19 vaccination immunity period: కోవిడ్ వాక్సిన్ డోస్, వైరస్ ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్, మరణాల రేటు తగ్గించేందుకేనని కేంద్రం అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఈ రోజు (గురువారం) మీడియా సమావేశంలో స్పష్టం చేసింది. పోస్ట్ వ్యాక్సినేషన్ తర్వాత రోగ నిరోధకత 9 నెలల వరకు ఉంటుందని, పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా భయపడాల్సిన అవసరం లేదని, దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
కోవిడ్ వ్యాక్సిన్లన్నీ మనదేశంతో సహా, ఇజ్రాయెల్, యూఎస్, యూరప్, యూకే, చైనా నుంచి వచ్చినప్పటికీ ప్రాథమికంగా వ్యాధిని ఎదుర్కొనేవే కానీ వ్యాధిని పూర్తిగా నిరోధించవు. ముందు జాగ్రత్తగా తీసుకునే కోవిడ్ డోసులు.. వ్యాధి తీవ్రతను తగ్గించడం, ఆసుపత్రుల్లో చేరికలు, మరణాల రేటులను తగ్గించడానికేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్‌ఆర్) డైరెక్టర్ జనరల్ డా. బలరాం భార్గవ తెలిపారు. మన దేశంలోని వయోజన జనాభాలో దాదాపు 90% మందికి మొదటి డోస్ టీకాలు పూర్తయ్యాయి.
ఐతే టీకాలు వేయించుకున్న వారిలో కొంతమందికి ముందుగా రోగ లక్షణ అంటువ్యాధులు ఉన్నందు వల్ల చాలా మందిలో సార్స్-కోవ్ 2 యాంటిజెన్‌కు సంబంధించి కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. మరికొందరికి గుర్తించబడని లక్షణ రహిత అంటువ్యాధులు ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 10 నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా అర్హులైన వారికి ఫోన్ ఎస్సెమ్మెస్ సందేశాలు పంపడం ద్వారా విస్తృత టీకా కవరేజీని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment