ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన పేరు.. ఒమిక్రాన్. కరోనా వైరస్ వేరియెంట్‌లలో ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాప్తిస్తుండడంతో ఎంతటి విపత్తుకు దారితీస్తుందోనని హడలిపోతున్నారంతా. అయితే ఈ పేరు మాత్రం అక్కడ లాభాలు కురిపిస్తోంది.
ఒమిక్రాన్ ఇదే పేరుతో క్రిప్టో స్పేస్‌లో ఓ కాయిన్ ఉంది. నవంబర్ 27న ఈ క్రిప్టోకరెన్సీ విలువ 64 డాలర్లుగా ఉండింది. అయితే డబ్ల్యూహెచ్‌వో ‘ఒమిక్రాన్’ వేరియెంట్ ఆందోళన ప్రకటన తర్వాత వేరియెంట్ గురించి విస్తృత స్థాయిలో జరిగిన చర్చ.. ఈ కాయిన్ విలువను అమాంతం పెంచేసింది. నవంబర్ 29న ఒమిక్రాన్ మార్కెట్ వాల్యూ 692 డాలర్లకు చేరుకోగా.. నవంబర్ 30న ప్రారంభ విలువకు 900 శాతం పెరిగి 689 డాలర్లకు చేరుకుంది. చివరికి మంగళవారం 420 డాలర్ల వద్ద ఉండిపోయి.. క్రిప్టో మార్కెట్‌లో తన జోరు కొనసాగిస్తోంది.
ఒమిక్రాన్ కరెన్సీకి ఎలాంటి మద్దతు లేదు. డోజ్‌కాయిన్ లాగే ఇది కూడా అంచనాల నడుమే తన విలువను పెంచుకోవడం, పడిపోవడం జరుగుతోంది కూడా. ఇక ఒమిక్రాన్ అలర్ట్ పరిణామాల తర్వాత డిజిటల్ ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్, ఇతరత్ర కాయిన్స్ విలువ లాభాలతో కొనసాగుతుండడం విశేషం. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్ B.1.1.529కు గ్రీకు 24 అక్షరాల్లోని 15వ అక్షరం ఒమిక్రాన్ ఆధారంగా పేరును నిర్ణయించింది ఫైలోజెనెటిక్ ఎసైన్‌మెంట్ ఆఫ్ నేమ్డ్ గ్లోబల్ ఔట్‌బ్రేక్ కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment