surge price
-
Cryptocurrency: ఒమిక్రాన్ పేరులోనే మ్యాజిక్ ఉంది
ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన పేరు.. ఒమిక్రాన్. కరోనా వైరస్ వేరియెంట్లలో ‘ఒమిక్రాన్’ వేగంగా వ్యాప్తిస్తుండడంతో ఎంతటి విపత్తుకు దారితీస్తుందోనని హడలిపోతున్నారంతా. అయితే ఈ పేరు మాత్రం అక్కడ లాభాలు కురిపిస్తోంది. ఒమిక్రాన్ ఇదే పేరుతో క్రిప్టో స్పేస్‌లో ఓ కాయిన్ ఉంది. నవంబర్ 27న ఈ క్రిప్టోకరెన్సీ విలువ 64 డాలర్లుగా ఉండింది. అయితే డబ్ల్యూహెచ్‌వో ‘ఒమిక్రాన్’ వేరియెంట్ ఆందోళన ప్రకటన తర్వాత వేరియెంట్ గురించి విస్తృత స్థాయిలో జరిగిన చర్చ.. ఈ కాయిన్ విలువను అమాంతం పెంచేసింది. నవంబర్ 29న ఒమిక్రాన్ మార్కెట్ వాల్యూ 692 డాలర్లకు చేరుకోగా.. నవంబర్ 30న ప్రారంభ విలువకు 900 శాతం పెరిగి 689 డాలర్లకు చేరుకుంది. చివరికి మంగళవారం 420 డాలర్ల వద్ద ఉండిపోయి.. క్రిప్టో మార్కెట్లో తన జోరు కొనసాగిస్తోంది. ఒమిక్రాన్ కరెన్సీకి ఎలాంటి మద్దతు లేదు. డోజ్కాయిన్ లాగే ఇది కూడా అంచనాల నడుమే తన విలువను పెంచుకోవడం, పడిపోవడం జరుగుతోంది కూడా. ఇక ఒమిక్రాన్ అలర్ట్ పరిణామాల తర్వాత డిజిటల్ ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్, ఇతరత్ర కాయిన్స్ విలువ లాభాలతో కొనసాగుతుండడం విశేషం. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్ B.1.1.529కు గ్రీకు 24 అక్షరాల్లోని 15వ అక్షరం ఒమిక్రాన్ ఆధారంగా పేరును నిర్ణయించింది ఫైలోజెనెటిక్ ఎసైన్మెంట్ ఆఫ్ నేమ్డ్ గ్లోబల్ ఔట్‌బ్రేక్ కంపెనీ. చదవండి: చైనా ముందే చెప్పింది.. అయినా వినలేదు! -
ఊబర్, ఓలా సర్వీసులపై కఠిన చర్యలు
ఢిల్లీ: ఓలా, ఊబర్ ట్యాక్సీ సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వం కన్నెర్రజేసింది. దేశ రాజధానిలో సరి-బేసి విధానం అమలు చేస్తున్న సమయంలో తమ రేట్లను మూడునుంచి ఐదు రెట్లకు పెంచి ప్రయాణీకుల జేబులు కొల్లగొడుతున్న ఈ ట్యాక్సీ సర్వీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ట్యాక్సీ సర్వీసులు విమాన ప్రయాణపు చార్జీలను తమ నుంచి వసూలు చేస్తున్నాయని ప్రయాణీకులు వాపోతున్నారు. మామూలు సమయంలో మూడు రెట్లు, రద్దీ సమయంలో ఐదు రెట్లు చార్జీలు వసూలు చేస్తున్నారని వారు పేర్కొన్నారు. 'గతంలో నేను ఇంటి నుంచి అఫీసుకు వెళ్లడానికి రూ.400 అయ్యేది. ఇప్పుడు ఏకంగా రూ.2100 అవుతోంది' అని వసంత్ కుంజ్ కు చెందిన పునీత్ గులాటి వాపోయారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వ సరి-బేసి విధానాన్ని పాజిటివ్ గా అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ రేట్లకు మించి అధికంగా రేట్లను వసూలు చేసే టాక్సీల లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. చేంజ్ ఆర్గనైజేషన్ సభ్యులు పెరిగిన టాక్సీ ధరలకు వ్యతిరేకంగా వెయ్యి మంది సంతకాలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఊబర్, ఓలా సర్వీసులపై అమన్ గార్గ్ కోర్టులో కేసును నమోదు చేశారు. గతంలో బెంగళూరులో ట్యాక్సీ రేట్ల పెంపుకు వ్యతిరేకంగా అమన్ కేసు వేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది.