
న్యూఢిల్లీ: ప్రంచాన్ని చుట్టేసిన ఒమిక్రాన్ భారత్‌లో కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా శనివారం మరో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. గుజరాత్, జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. ఇతడు కొన్ని రోజుల క్రితమే జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చినట్లు తెలిసింది. ఇది భారత్‌లో ఒమిక్రాన్ మూడో కేసు.
(చదవండి: Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు)
72 ఏళ్ల బాధిత వ్యక్తి జింబాబ్వే నుంచి వచ్చిన తర్వాత స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. టెస్ట్‌లు చేయింగా.. గురువారం అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక అతడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు రాష్ట్ర హెల్త్ కమిషనర్ జై ప్రకాశ్ శివ్‌హారే తెలిపారు. బాధితుడిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. ఈ కేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది.
(చదవండి: Omicron: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం)
మహారాష్ట్రలో నాలుగో కేసు..
మహారాష్ట్రలో నాలుగో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. నవంబర్ నెల చివర్లో దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్, ఢిల్లీ మీదుగా ముంబై చేరుకున్న మహారాష్ట్రకు చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..
►తీవ్రమైన కండరాల నొప్పులు
►చికెన్‌గున్యా లక్షణాలు
►తీవ్రమయిన అలసట
చదవండి: హైదరాబాద్‌లో ఒమిక్రాన్ కలవరం.. వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment