ఒమిక్రాన్ వేరియెంట్ నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆరంభం నష్టాలతోనే మొదలై.. ఉదయం 9:45 గంటల సమయానికి సెన్సెక్స్ 349 పాయింట్ల నష్టంతో 57,347 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 17,172 వద్ద ట్రేడవుతూ.. మొదలు నష్టం కంటే కొంచెం మెరుగైంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.20 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌యూఎల్, టైటన్ షేర్లు రాణిస్తున్నాయి. మారుతీ, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
ఎన్‌ఎస్‌ఈ టాప్ గెయినర్స్‌గా ఐడియా, రెలిఇన్‌ఫ్రా, ఏబీక్యాపిటల్, హింద్ జింక్, టాప్ లాసర్స్‌గా కోల్ ఇండియా, రెల్‌క్యాపిటల్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, భారత్‌ఫార్గ్, డిష్ టీవీలు ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్‌ఈ లోనూ ఇదే ట్రేడ్ కనిపిస్తుండగా.. అదనంగా శ్రీరామ్ చిట్స్ లాసర్ కేటగిరీలోకొనసాగుతోంది.
అనిశ్చి తప్పదా?
ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కొవిడ్ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తుండటం వల్ల ఆర్థిక రికవరీకి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశీయ సూచీలు సైతం ఒమిక్రాన్ వేరియెంట్ భయాలతో అంతర్జాతీయ మార్కెట్ల తరహాలోనే కొనసాగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితికి చేరతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం 6-8 తేదీల్లో జరగనుంది. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్ల కీలక రేట్లను యథాతథంగానే ఆర్‌బీఐ కొనసాగించొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment