బెర్లిన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు సిద్ధమైంది. టీకా తీసుకోని వారికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తికాని వారు.. మార్కెట్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రకటించారు. దీంతోపాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో జర్మనీ వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేయనుంది.
ప్రతి ఒక్కరికి టీకాలను తప్పనిసరి చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం తర్వాత.. వచ్చే ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైవు.. జర్మనీ జనాభాలో ఇప్పటివరకు 75శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాదాపు 68శాతం మందికి మాత్రమే టీకాలు పూర్తి చేసింది. ఇక డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఈ కొత్త వేరియెంట్‌కు సంబంధించి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్ ఉన్నాయి.
(చదవండి: Viral Video: కలల రాణిని పెళ్లి దుస్తుల్లోచూసి.. ఒక్కసారిగా ఏడ్చిన వరుడు! బ్యూటిఫుల్ కపుల్..)
Comments
Please login to add a commentAdd a comment