Bill Gates Warns World on Omicron surge: టెక్ మేధావిగా, వ్యాపార దిగ్గజంగానే కాదు.. ప్రపంచ సమకాలీన అంశాలపై అంచనా వేయగలిగే మేధావిగా బిల్‌గేట్స్‌కి పేరుంది. కరోనా విషయంలో మొదటి నుంచి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. అయితే డెల్టాఫ్లస్ లాంటి ప్రమాదకరమైన వేరియెంట్ విజృంభణ సమయంలో.. వ్యాక్సినేషన్ రేటు పెరుగుతుండడం, పాజిటివిటీ రేటు పడిపోతుడడంపై బిల్‌గేట్స్ ఓ అంచనాకి వచ్చారు. కరోనా అంతమయ్యే సమయం ఎంతో దూరం లేదంటూ తాజాగా వ్యాఖ్యలు చేశారు.
కానీ, ఒమిక్రాన్ బిల్‌గేట్స్ అంచనాల్ని తలకిందులు చేసింది ఇప్పుడు. దీంతో తన తాజా ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారాయన. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ప్రపంచం చాలా దారుణమైన దశకు చేరుకుందని, రానున్న రోజులు మరింత కీలకమని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఏడాదిలో అన్ని దేశాలు అన్ని రంగాల్లో సంక్షోభాల్ని ఎదుర్కొక తప్పదని అంచనా వేశారు. ఈ మేరకు తన ట్విటర్‌లో వరుస ట్వీట్లు పోస్ట్ చేశారాయన.
‘‘సెలవుల్ని బంధువులతో కలిసి ఆస్వాదిద్దాం అనుకున్నా. కానీ, నా సన్నిహితులు సైతం ఒమిక్రాన్ బారినపడ్డారు. దీంతో మొత్తం కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నా. చరిత్రలో ఏ వైరస్ ఒమిక్రాన్ వేరియెంట్ కన్నా వేగంగా విస్తరించలేదు. అతిత్వరలో అన్ని దేశాల్లో ఒమిక్రాన్ విస్తరించడం ఖాయం. రాబోయే మూడు నెలలు ప్రపంచం గడ్డుకాలం ఎదుర్కొబోతోంది. కొన్నినెలలపాటు ఆ ప్రభావం కొనసాగుతుంది.
There will be more breakthrough cases in people who are vx’d, which sounds concerning but is purely a factor of how many people are vx’d and how fast this variant is spreading. Vaccines are designed to prevent people from getting seriously ill or dying & are doing that well.
— Bill Gates (@BillGates) December 21, 2021
సంక్షోభాలు తప్పకపోవచ్చు!. డెల్టాలో సగం తీవ్రతకు చేరుకున్నా.. ఒమిక్రాన్ తీవ్రత తారాస్థాయికి చేరుకుంటుంది. పరిస్థితులు దిగజారిపోతాయి. కానీ, ఒక్కటి మాత్రం కరాకండిగా చెప్పగలను. సరైన జాగ్రత్తలు పాటిస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకుంటే 2022లోనే కరోనాను జయించొచ్చు. వీలైనంత త్వరలో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు బిల్‌గేట్స్.
Omicron is spreading faster than any virus in history. It will soon be in every country in the world.
— Bill Gates (@BillGates) December 21, 2021
ఆ కామెంట్‌పై విమర్శ
కరోనా ప్యాండెమిక్‌లో దారుణమైన దశకు చేరుకున్నామన్న బిల్‌గేట్స్.. మరో ట్వీట్‌తో విమర్శలపాలయ్యారు. బూస్టర్ షాట్స్ తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన సలహాను చాలామంది తప్పుబడుతున్నారు.
సంబంధిత వార్త: కరోనా అంతమయ్యేది అప్పుడే: బిల్ గేట్స్
Comments
Please login to add a commentAdd a comment